Director Teja: టాలీవుడ్ ఇండస్ట్రీలో మూస ధోరణిలో సినిమాలు చేస్తూ ఎంతో మంచి గుర్తింపు పొందిన వారిలో డైరెక్టర్ తేజ ఒకరు. ఈయన చిత్రం సినిమాతో మొదటిసారిగా మెగా ఫోన్ పట్టుకొని ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఇలా ఇండస్ట్రీలో ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న డైరెక్టర్ తేజ ఎంతోమంది టెక్నీషియన్లను నిర్మాతలను హీరో హీరోయిన్లను ఇండస్ట్రీకి పరిచయం చేశారు.
ఈ విధంగా దర్శకుడు తేజ ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఎంతోమంది ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రెటీలుగా కొనసాగుతున్నారు. ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈయనకు యాంకర్ నుంచి ఓ ఆసక్తికరమైన ప్రశ్న ఎదురయింది. మీరు ఎంతో మందిని ఇండస్ట్రీకి పరిచయం చేశారు ఇప్పుడు వాళ్లంతా గొప్ప స్థానంలో ఉన్నారు. అలా గొప్ప స్థానంలో ఉన్నవారు మీకోసమే ఏదైనా చేశారా అని ప్రశ్నించారు.
ఈ ప్రశ్నకు తేజ గారు ఒక నవ్వు నవ్వి వాళ్లు గొప్ప స్థానంలో ఉంటే నాకోసం ఎందుకు చేయాలి అని ఎదురు ప్రశ్నించడమే కాకుండా ఓ వ్యక్తి ఉన్నారంటూ సమాధానం చెప్పారు. కమెడియన్ సునీల్ శెట్టి గురించి మాట్లాడుతూ తనని జయం సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఇక ఈ సినిమా మంచి హిట్ కావడంతో నంది అవార్డు అందుకోవడమే కాకుండా ఇండస్ట్రీలో బిజీగా మారిపోయారు. అయితే ఒక రోజు ఆయన తన వద్దకు వచ్చి మీరు అవకాశం కల్పించడం వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నాను అంటూ తన కాళ్ళ మీద పడ్డారని తేజ తెలిపారు.
మీరు ఇచ్చిన అవకాశం వల్లే నేను ఈ స్థాయిలో ఉండి సొంతంగా ఇల్లు కట్టుకున్నాను అంటూ చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోని తేజ తనని లేపిమీలాంటి కొత్త వారందరిని ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఏదో ఒక రోజు నేను రోడ్డు మీదకు వస్తాను. ఆరోజురోడ్డుపై ఉండకుండా నిన్ను వెతుక్కుంటూ నీ ఇంటికి వస్తాను నీ ఇంటిలో నాకోసం ఒక గది కట్టించి పెట్టు అంటూ సమాధానం చెప్పాను .దీంతో సునీల్ శెట్టి ఇంట్లో తనకంటూ ప్రత్యేకంగా గది నిర్మించడమే కాకుండా ఆ గదిని తరచూ శుభ్రం చేస్తూ ఆ గదిలో తన ఫోటోని కూడా పెట్టారంటూ ఈ సందర్భంగా ఈయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…