Tag Archives: center government

6 Air Bags In Car: ఇక నుంచి కారులో ఆరు ఎయిర్ బ్యాగ్స్..! కేంద్రం కొత్త రూల్..!

6 Air Bags In Car: ఎనిమిది మంది వరకు ప్రయాణించే మోటారు వాహనాలకు కనీసం ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు తప్పనిసరి చేయాలని కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఒక ట్వీట్‌లో తెలిపారు. 2019 జులై 1 నుండి డ్రైవర్ ఎయిర్‌బ్యాగ్ , ఫ్రంట్ కో-ప్యాసింజర్ ఎయిర్‌బ్యాగ్‌ల ఫిట్‌మెంట్‌ను ఈ ఏడాది జనవరి 1 నుండి అమలులోకి తీసుకురావాలని రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH) ఇప్పటికే ఆదేశించిందని గడ్కరీ వరుస ట్వీట్‌లలో తెలిపారు.

6 Air Bags In Car: ఇక నుంచి కారులో ఆరు ఎయిర్ బ్యాగ్స్..! కేంద్రం కొత్త రూల్..!

ముందు మరియు వెనుక రెండు కంపార్ట్‌మెంట్లలో కూర్చున్న ప్రయాణికులకు ఫ్రంటల్ , లాటరల్ ఢీకొనే ప్రభావాన్ని తగ్గించడానికి.. వాహనం విభాగంలో 4 అదనపు ఎయిర్‌బ్యాగ్‌లను తప్పనిసరి చేయాలని నిర్ణయించినట్లు గడ్కరీ ట్వీట్ చేశారు. కొత్తగా ప్యాసింజర్ వాహనాల్లో రెండు వైపులా లేదా సైడ్ టోర్సో ఎయిర్‌బ్యాగ్‌లు.. అవుట్‌బోర్డ్ ప్రయాణికులందరినీ కవర్ చేసే రెండు వైపులా కర్టెన్, ట్యూబ్ ఎయిర్‌బ్యాగ్‌లు తప్పనిసరిగా అమర్చబడిందని ఆయన తెలిపారు.

6 Air Bags In Car: ఇక నుంచి కారులో ఆరు ఎయిర్ బ్యాగ్స్..! కేంద్రం కొత్త రూల్..!

గతంలో కంటే.. ప్రస్తుతం ఎలాంటి ప్రమాదాలకు చోటు లేకుండా మార్చడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నాడు. ఇక వాహనం ధర ఎంత.. ఎక్కువ ధర పెట్టి తీసుకున్న వాహనాలకు కాకుండా.. తక్కువ ధర వెచ్చించి తీసుకున్న వాహనాలకు కూడా ఇలాంటి ఎయిర్ బ్యాగ్స్ అమర్చాలని.. చివరగా.. ప్రయాణికుల భద్రతే ముఖ్యంగా చూసుకోవాలని అతడు చెప్పాడు.


భారత్ లోనే ప్రమాదాల సంఖ్య ఎక్కువ..

ఇక ఈ సంవత్సరం జనవరి 1 నుంచి డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు తప్పనిసరి చేసని విషయం తెలిసిందే. అయితే ఇది డ్రైవర్ అతడి పక్క కూర్చున్న ఫ్రంట్ కో-ప్యాసింజర్ భద్రత కోసం ఇలాంటి చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నాడు. ఇక ఈ కొత్త వాహనాలకు సైడ్ కర్టెన్ ఎయిర్‌బ్యాగ్‌లను తప్పనిసరి చేసే కొత్త నిబంధన.. సైడ్ ఇంపాక్ట్‌ల విషయంలో కూడా ప్రయాణీకులకు భద్రతను అందిస్తుందన్నారు.
ప్రతీ సంవత్సరం కారు ప్రమాదాల్లో ఎక్కువ శాతం మంది చనిపోతున్నారు. ఇలాంటి వాటిల్లో ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే భారత్ లోనే ప్రమాదాల ఎక్కువగా జరుగుతన్నాయి. ఈ రోడ్డు ప్రమాదాల కారణంగా భారీ సంఖ్యలో మరణాలతో పాటు కొంతమందికి తీవ్ర గాయాలు అవున్నాయి. ప్రమాదాల వెనుక ట్రాఫిక్ ఉల్లంఘనలు ప్రధాన కారణాలుగా చెప్పబడుతున్నప్పటికీ.. తగిన భద్రతా చర్యలు తీసుకోకపోవడంతో అనేక అనర్థాలకు దారి తీస్తున్నాయి.