Tag Archives: childrens

తల్లిదండ్రులు చిన్నారులపై తరచూ చేసుకుంటున్నారా.. అయితే మీరు బాధ పడాల్సిందే!

ఇప్పుడు జనరేషన్ లో పిల్లలు ఎంత చలాకీగా ఉంటారో అందరికీ తెలిసిందే. మంచి లేదా చెడు ఏదైనా పిల్లలు తొందరగా నేర్చుకుంటారు. దానివల్ల కొన్ని సందర్భాల్లో పిల్లలు తల్లిదండ్రులను ఇబ్బంది పెడుతుంటారు. కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రులకు కోపం వచ్చి వారిపై చేయి చేసుకుంటారు. కానీ పిల్లల్ని కొట్టడం వల్ల వారిలో మార్పు రాకపోవడం సరి మీపై నెగిటివ్ ఒపీనియన్ క్రియేట్ అవుతుంది.

తాజాగా ఈ విషయం గురించి అధ్యయనం చేయటం వల్ల తేలిన విషయం ఏమిటంటే పిల్లల్ని కొట్టడం వల్ల వారిలో మార్పు రాకపోగా వారి బుద్ధి మందగిస్తుంది. అలాగే పిల్లల్లో తల్లిదండ్రుల మీద నమ్మకం పోయి ఇన్ సెక్యూరిటీ ఫీల్ అవుతారు.

మన భారతదేశం మరియు ఇతర 30 దేశాలలో పిల్లలను కొట్టటం నేరం కాదు. కానీ 62 దేశాలలో పిల్లల్ని కొట్టడం నేరంగా పరిగణిస్తారు. యునిసెఫ్ వెల్లడించిన వివరాల ప్రకారం 25 కోట్ల మంది రెండు నుండి 4 సంవత్సరాలలోపు పిల్లలు శారీరక హింసకు గురవుతున్నారు.

పిల్లలు మనకి ఇబ్బంది కలిగించే పనులు చేసినప్పుడు కోపం వచ్చి వారిని కొట్టడం మంచిది కాదు. అలా చేయటం వల్ల వారు మన మాట వినకుండా ఇంకా మొండిగా తయారవుతారు. పిల్లలకి మంచి, చెడు గురించి వివరించి ఇంకొకసారి అటువంటి ఇబ్బంది కలిగించే పనులు చేయకుండా వారికి నచ్చచెప్పాలి. అలా కాకుండా వారిపై చేయి చేసుకోవడం ఏమాత్రం సరి అయినది కాదు.

చిన్నారులకు కరోనా వైరస్ టీకాలు.. ఎప్పటినుండంటే?

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ తీవ్రరూపం దాల్చడంతో ప్రపంచ దేశాలన్ని వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేశాయి. ఈ క్రమంలోనే మన దేశంలో 18 సంవత్సరాలు 45 సంవత్సరాలు పైబడిన వారందరికీ కూడా వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేశారు. ఇప్పటికే కరోనా వైరస్ గత ఏడాదిన్నర కాలం నుంచి ఈ మహమ్మారి బారిన పడి ఎంతో మంది మరణించారు. ఈ క్రమంలోనే రెండవ దశ మన దేశంలో తీవ్ర రూపం దాలుస్తూ అల్లకల్లోలం సృష్టించింది.ఈ క్రమంలోనే 18 సంవత్సరాలు పైబడిన వారందరికీ వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేశారు.

ఇప్పటికే రెండు దశలలో వ్యాప్తిచెందిన కరోనా వైరస్ తర్వాత మూడవ దశ చిన్న పిల్లలపై అధిక ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నా సమయంలో ఇప్పటికే అన్ని దేశాల ప్రభుత్వాలు ఎంతో అప్రమత్తమయ్యాయి. అదేవిధంగా చిన్నపిల్లలో ఈ వైరస్ ను కట్టడి చేయడం కోసం త్వరలోనే వీరికి టీకాలు అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపించనున్నాయి.

చిన్న పిల్లలలో వ్యాక్సిన్ కనుగొనడానికి ఇప్పటికే మోడెర్నా వ్యాక్సిన్‌తో పాటు మరో ప్రొటీన్‌ ఆధారిత టీకా ఈ మేరకు ప్రాథమిక ప్రయోగాల్లో సత్ఫలితాలనిచ్చినట్లు అమెరికా శాస్త్రవేత్తలు వెల్లడించారు.ఈ పరిశోధనలో భాగంగా శాస్త్రవేత్తలు 16 కోతి పిల్లలను రెండు బృందాలుగా విడదీసి వాటిలో ఒక బృందానికి మోడెర్నా, మరో వర్గానికి ప్రొటీన్‌ ఆధారిత టీకా అందించారు.  ఈ విధంగా కోతిపిల్లలలో రెండు డోసులు అందించాక ఆ కోతులలో కొవిడ్‌ కారక ‘సార్స్‌-కొవ్‌-2’ వైరస్‌ను అంతమొందించగల సురక్షిత, బలమైన యాంటీబాడీలు ఉత్పత్తయ్యాయనీ నిపుణులు తెలియజేశారు.

పెద్ద కోతులలో 100 మైక్రోగ్రాముల టీకా డోసుతో వచ్చిన యాంటీబాడీలు.. చిన్న కోతుల్లో కేవలం 30 మైక్రోగ్రాముల డోసుతోనే ఉత్పత్తయ్యాయి. అదేవిధంగా
మోడెర్నా వ్యాక్సిన్ అందించిన కోతులలో అధిక మొత్తంలో వ్యాధి తీవ్రతను తగ్గించే  టీ-సెల్‌ ఉత్పత్తి అయినట్లు ఉత్తర కరోలినా విశ్వవిద్యాలయం ప్రొఫెసర్‌ క్రిస్టీనా డి పార్‌ తెలిపారు. ఈ విధంగా కూతులలో జరిపిన ప్రయోగాలు సత్ఫలితాలను ఇవ్వడంతో త్వరలోనే ఈ వ్యాక్సిన్ ఈ విషయంలో మరింత లోతుగా అధ్యయనాలు జరిపి త్వరలోనే పిల్లలపై ప్రయోగాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

కరోనా నుంచి పిల్లలను ఇలా రక్షించుకోండి..!

గత ఏడాదిన్నర కాలం నుంచి ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందడంతో చిన్నపిల్లల నుంచి పెద్ద వారి వరకు ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందుతూ ప్రతి ఒక్కరిలో మార్పును తీసుకు వచ్చిందని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఈ క్రమంలోనే ఆఫీసులకు వెళ్లేవారు ఇంటినుంచి పని చేయగా, స్కూలుకు వెళ్లే చిన్నారులు ఆన్లైన్ క్లాసులతో పోటీ పడుతున్నారు. ఈ క్రమంలోనే పిల్లలు నిత్యం కంప్యూటర్ల ముందు కూర్చోవడం వల్ల వారు మానసికంగా ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా పిల్లలు బయట ప్రపంచంతో సంబంధాలు తెంచుకొని కేవలం ఇంటికి మాత్రమే పరిమితం కావడం వల్ల వారిలో మరి కొన్ని సమస్యలు అధికంగా ఉన్నాయని పలువురు నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలోనే పిల్లలు కరోనా బారిన పడకుండా వారిని ఎలా రక్షించుకోవాలి. వారిలో ఉన్న మానసిక ఆందోళనలు ఏవిధంగా తొలగించాలనే విషయం గురించి పలువురు నిపుణులు తెలియజేశారు. మరి పిల్లలను ఏ విధంగా రక్షించుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం..

సాధారణంగా స్కూల్ కి వెళ్లి తోటి పిల్లలతో ఎంతో ఆనందంగా గడుపుతూ చదువుకునే విద్యార్థులు ప్రస్తుతం ఇంటిలో ఆన్లైన్ క్లాసులకు పరిమితమయ్యారు. ఈ విధంగా నిత్యం కంప్యూటర్ల ముందు కూర్చోవడం వల్ల వారిలో మానసిక ఒత్తిడి ఆందోళనలు అధిక శ్రమ వారిలో మరి కొన్ని సమస్యలు తలెత్తుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఈ క్రమంలోనే పిల్లల తల్లిదండ్రులు పిల్లలతో ఎంతో చనువుగా, ప్రేమగా వ్యవహరిస్తూ ఉండటం వల్ల వారిలో ఒత్తిడి తగ్గుతుంది. పాఠశాలకు వెళ్లే పిల్లలు కేవలం వారికి చదువు పరంగా మాత్రమే కాకుండా వ్యక్తిగతంగా తలెత్తే సమస్యలను సైతం ఉపాధ్యాయులు అడిగి తెలుసుకొని వారికి కౌన్సిలింగ్ నిర్వహించేవారు.ఈ విధంగా తల్లిదండ్రులు కూడా వారు ప్రతి చిన్న సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించే దిశగా ప్రయత్నిస్తే పిల్లలలో ఎలాంటి ఆందోళనలు ఉండవని నిపుణులు తెలియజేస్తున్నారు.

ప్రస్తుతం ఉన్న ఈ కరోనా పరిస్థితుల నుంచి పిల్లలను రక్షించుకోవాలంటే తల్లిదండ్రులు కొంత సమయం పాటు దగ్గరుండి ఆ విలువైన సమయాన్ని పిల్లలతో హాయిగా గడపటం వల్ల ఈ విధమైనటువంటి సమస్యలు రాకుండా జాగ్రత్త పడవచ్చు. ప్రతి ఒక్క తల్లిదండ్రి తమ పిల్లల ఆరోగ్యం పట్ల ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ప్రతి చిన్న విషయంలోనూ సరైన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల పిల్లలు ఎటువంటి మానసిక సమస్యలకు,కరోనా వంటి మహమ్మారి బారిన పడకుండా రక్షించగలమని నిపుణులు తెలియజేస్తున్నారు.

పిల్లలు మాస్క్ ఏ విధంగా ధరించాలో తెలుసా?

కరోనా రెండవ దేశవ్యాప్తంగా తీవ్ర రూపం దాల్చిన సంగతి మనకు తెలిసిందే. ఈ మహమ్మారి బారిన పడి ఎంతో మంది యువకులు ప్రాణాలను కోల్పోయారు. ఈ క్రమంలోనే కరోనా మూడవ దశ చిన్న పిల్లలపై అధిక ప్రభావం చూపుతుందని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. ఈ క్రమంలోనే చిన్నారుల ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే ఈ మహమ్మారిని కట్టడి చేయడానికి మన వద్ద ఉన్న ఏకైక అస్త్రం మాస్క్ అని చెప్పవచ్చు.

ఈ క్రమంలోనే కరోనా నుంచి చిన్నపిల్లలను కాపాడుకోవడం కోసం వారికి మాస్క్ వాడటం మంచిదేనా? లేదా? అనే అయోమయంలో ఎంతో మంది తల్లిదండ్రులు ఉన్నారు. అయితే చిన్న పిల్లలకు మాస్క్ ఏ విధంగా ధరించాలి అనే విషయాల గురించి కేంద్ర ప్రభుత్వం మరోసారి మార్గదర్శకాలను జారీచేసింది. కేంద్ర ఆరోగ్యశాఖ పరిధిలోని డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ హెల్త్‌ సర్వీసెస్‌ (DGHS) ప్రకారం..

ఐదు సంవత్సరాలలోపు వయసు కలిగిన పిల్లలు మాస్క్ ధరించాల్సిన అవసరం లేదు.6 -11 సంవత్సరాల మధ్య వయసు కలిగిన పిల్లలు వారు మాస్క్ లను ధరించే సామర్థ్యాన్ని బట్టి మాస్క్ లు వేయాలి.12-17 సంవత్సరాల వయసు కలిగిన వారు పెద్ద వారి మాదిరిగానే యధావిధిగా మాస్క్ ధరించాలని కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు తెలిపింది. ఐదు సంవత్సరాలలోపు పిల్లలు ఎవరికైనా అనారోగ్యం చేసిన వారి దగ్గరికి వెళ్తున్న సమయంలో తప్పనిసరిగా మాస్క్ వేయాలని తెలిపారు.

చిన్నపిల్లలు మాస్క్ లను వాడే ముందు తప్పనిసరిగా చేతులను సబ్బుతో శుభ్రంగా కడగడం లేదా శానిటైజర్ వాడటం చేయాలి. ఈ క్రమంలోనే అమెరికా వ్యాధుల నియంత్రణ కేంద్రం 2 ఏళ్ల లోపు వయసు కలిగిన వారు తప్ప మిగిలిన వారందరూ తప్పకుండా మాస్కు ధరించాలని తెలిపింది.అదేవిధంగా చిన్నపిల్లలు covid బారిన పడితే వారికి ఏ విధమైనటువంటి చికిత్సను అందించాలనే విషయాలను కూడా డీజీహెచ్‌ఎస్‌ తాజా మార్గదర్శకాల్లో స్పష్టంగా పేర్కొంది. కోవిడ్ బారిన పడిన వారికి అత్యవసర పరిస్థితులలో ఉపయోగించే రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్లను పిల్లలకు అసలు ఇవ్వకూడదని స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే పిల్లలు కూడా భౌతిక దూరం పాటించడం, తరచూ చేతులు శుభ్రంగా కడుక్కోవడం వంటి జాగ్రత్తలను పాటించాలని డీజీహెచ్‌ఎస్‌ తన మార్గదర్శకాల్లో పేర్కొంది.

ప్రపంచంపై రకరకాల వైరస్ ల దాడి.. పిల్లలుకు ఆ జాగ్రత్తలు!

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర రూపం దాలుస్తుంది. రెండవ దశ దేశవ్యాప్తంగా ఎలాంటి ప్రళయాన్ని సృష్టించిందో మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్ అంటూ ప్రపంచంపై వివిధ రకాల వైరస్ కు దాడి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే థర్డ్ వేవ్ పిల్లలు అధికమైన ప్రభావాన్ని చూపిస్తుందని నిపుణులు హెచ్చరించడంతో అన్ని దేశాలు అప్రమత్తమయ్యాయి. ఈ క్రమంలోనే మూడవదశ కరోనాను ఎదుర్కోవడం కోసం అన్ని ఏర్పాట్లను ముమ్మరం చేశారు.

భారతదేశంలో మొదటి వేవ్ పెద్దగా ప్రభావం చూపించక పోవడంతో రెండవ దశను చాలా తక్కువ అంచనా వేశారు. ఈ క్రమంలోనే ఇండియా భారీ నష్టాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది.దీంతో అలర్ట్ అయిన భారత ప్రభుత్వం మూడవ దశను ఎంతో సమర్థవంతంగా ఎదుర్కోవడానికి చర్యలు చేపట్టింది.

ఈ క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వంలో అన్ని ప్రైవేటు ఆసుపత్రులలో కరోనా చికిత్స రేట్లు ఒకే విధంగా ఉండాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.ఈ క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వం హైకోర్టు ఆదేశాలను ఎందుకు పాటించడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.రెండో దశపై ప్రభుత్వం సరిగా రెడీ అవ్వలేదని హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే మహారాష్ట్రలో ఇప్పటికే ఒకే జిల్లాలో 8వేల మంది పిల్లలకు కరోనా వచ్చిందన్న హైకోర్టు… థర్డ్ వేవ్‌ ను ఎదుర్కోవడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుందని తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.తమ ప్రశ్నలపై హెల్త్ సెక్రెటరీ, డీహెచ్, డీజీపీ… హైకోర్టులో రిపోర్ట్ ఇవ్వాలని విచారణను ఇవాల్టికి వాయిదా వేసింది.

ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఇప్పటివరకు సుమారు కోటి మందికి పైగా వ్యాక్సిన్ తీసుకున్నారు. కానీ తెలంగాణలో మాత్రం ఈ టార్గెట్ ను చేరుకోలేకపోయింది. దేశంలో సగటు కంటే ఏపీలో ఎక్కువగా వ్యాక్సిన్లు వేశారు. ఏపీలో రెండు డోసులు తీసుకున్న వారి సంఖ్య 1,00,17,712కి చేరింది. ఒక్క డోసే తీసుకున్న వారి సంఖ్య 74,92,944గా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైద్య సిబ్బంది వ్యాక్సినేషన్ గురించి ప్రజలలో అవగాహన కల్పించి, ఫోన్లు చేసి మరీ వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ క్రమంలోనే ప్రజలు కూడా వ్యాక్సిన్ వేయించుకోవడానికి ముందుకు వస్తున్నట్లు తెలిపారు.