Tag Archives: court

Actress Yamuna: కోర్టులో ఆ కేసు గెలిచాను.. కానీ ధారునమైన థంబ్‌నైల్స్‌తో నన్ను హింసిస్తున్నారు.. నేను చచ్చినా వదలరేమో : యమున

Actress Yamuna : సౌత్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా గుర్తింపు పొందిన నటి యమునా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మౌన పోరాటం సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన యమున ఆ తర్వాత తెలుగు,తమిళ్, కన్నడ భాషలలో ఎన్నో సినిమాలలో హీరోయిన్గా నటించి గుర్తింపు పొందింది. అంతేకాకుండా బుల్లితెర మీద ప్రసారమైన ఎన్నో టీవీ సీరియల్స్ లో కూడా కీలక పాత్రలలో నటించి అటు బుల్లితెర ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంది.

ప్రస్తుతం ఈటీవీలో ప్రసారమవుతున్న సీరియల్స్ లో యమున కీలక పాత్రలలో నటిస్తోంది. ఇదిలా ఉండగా నటిగా తనకంటూ ఒక మంచి గుర్తింపు ఏర్పరచుకున్న యమునా 2011లో బెంగళూరులో ఓ హోటల్‌లో వ్యభిచారం కేసులో పట్టుబడిందనే వార్త ఇప్పటికీ వైరల్ అవుతోంది. దీని గురించి పలు సందర్భాల్లో, పలు వేదికల మీద యమున చెప్పు కొచ్చింది. అయితే ఇప్పటికీ సోషల్‌ మీడియాలో ఎన్నో అసభ్యకరమైన వార్తలు రావటంతో యమున ఆవేదన వ్యక్తం చేస్తోంది.

ఇప్పటికీ ఈ సంఘటనకు సంబంధించి చాలా దారుణమైన థంబ్‌నైల్స్‌తో మానసికంగా హింసిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తు సోషల్‌ మీడియాలో వీడియో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో యమున ఆ సంఘటన గురించి మాట్లాడుతూ..” నన్ను నేను ఎంత మోటివేట్ చేసుకున్నా కూడా సోషల్‌ మీడియా వల్ల తెలియని ఓ బాధ నన్ను ఇప్పటికీ వెంటాడుతూనే ఉంది. కొన్ని సంవత్సరాల క్రితమే ఓ సమస్య నుంచి బయట పడి ప్రశాంతంగా ఉంటున్నాను. అంతే కాకుండా ఆ సమస్యలో నేను ఎందుకు ఇరుక్కోవాల్సి వచ్చిందో ఇప్పటికే చాలా ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చేశాను అంటూ తెలిపింది.

Actress Yamuna :నేను చనిపోయిన వదిలిపెట్టరు…

అంతే కాకుండా…ఆ విషయంలో న్యాయస్థానం కూడా నాకు క్లీన్ చిట్ ఇచ్చి నన్ను గెలిపించింది. న్యాయ పరంగా నేను విజయం సాధించి ప్రశాంతంగా ఉందామనుకుంటున్నప్పటికి… ఈ సోషల్ మీడియా వల్ల ప్రతిరోజు బాధ పడుతున్నా. సోషల్ మీడియాను నేను కంట్రోల్ చేయలేకపోతున్నాను. ఇప్పటికి కూడా నా గురించి, ఆ సంఘటన గురించి రకరకాల థంబ్‌నెయిల్స్‌, వీడియోలు పోస్ట్‌ చేస్తుంటారు. అవి నన్ను మానసికంగా చాలా ఇబ్బంది పెడుతున్నాయి. ఈ విషయంలో నన్ను ఎంత నేను మోటివేట్ చేసుకున్నా.. ఏదో తెలియని బాధ కలుగుతుంది. ఆ థంబ్‌నెయిల్స్‌ చూస్తే.. నేను చనిపోయినా కూడా నన్ను వీళ్లు వదలరు అనిపిస్తుంది’ అని ఆవేదన వ్యక్తం చేసింది యమున. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

వివాదాల్లోకి హీరో సుమంత్.. కోర్టు మెట్లు ఎక్కిన సుమంత్,సుప్రియ!

అక్కినేని వారసత్వం నుంచి రెండో తరం నటుడిగా వచ్చిన సుమంత్ అనుకున్నంతగా సక్సెస్ కాలేకపోయాడు. 1999లో వచ్చిన ప్రేమకథ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. టాలీవుడ్ లో స్టార్ గా ఎదుగుతాడనుకున్న కానీ పెద్ద హిట్లు రాకపోవడం.. వరస ఫ్లాపులతో అతని కెరీర్ ప్రశ్నార్థకంగా మారింది. అంతే కాదు అటు వ్యక్తిగత జీవితం కూడా కాస్త ఒడిదొడుకలతోనే సాగిందని చెప్పొవచ్చు.

తాజాగా కన్నడలో హిట్ అయిన కపటధారిని అదే పేరుతో తెలుగులోకి రీమేక్ చేసినా విజయం కాలేకపోయాడు. అయితే ఈ హీరో సినిమాల్లో సక్సెస్ కాలేకపోయిన.. వివాదాల్లో మాత్రం ఉంటున్నాడు. తాజాగా ఓ చెక్ బౌన్స్ కేసులో హీరో సుమంత్ తో పాటు సుప్రియల ఇరుక్కున్నారు.

గురువారం ఈ కేసు విషయమై మార్కాపురం కోర్ట్ కు హాజరయ్యారు. నరుడా..  ఓ నరుడా సినిమాకు ఫైనాన్స్ ఇచ్చిన శ్రీనివాస్ రావు కోర్ట్ లో కేసు వేశాడు. తనకు ఇచ్చిన చెక్ బౌన్స్ కావడంతో కారుమంచి శ్రీనివాస్ రావు కోర్టలో కేసు వేశారు. నరుడా..ఓ నరుడా సినిమాలో సుమంత్ హీరోగా, నిర్మాతగా సుప్రియ ఉన్నారు.

ఈ సినిమాకు కారుమంచి శ్రీనివాస్ రావు ఫైనాన్స్ అందించారు. తనకు డబ్బు ఇచ్చే విషయంలో చెక్ బౌన్స్ అయిందని.. తనను మోసం చేశారని శ్రీనివాస్ రావు కేసు వేశాడు. ఈ కేసుకు సంబంధించిన వాయిదా కోసం హీరో సుమంత్, సుప్రియ గురువారం ప్రకాశం జిల్లా మార్కాపురం కోర్టుకు హాజరయ్యారు.

కోర్టులో తేల్చుకుంటా..! సంచలన నిర్ణయం తీసుకున్న సమంత..!

అక్కినేని నాగచైతన్య, సమంత మధ్య ఏమి నడుస్తుందో ఎవరికీ అర్థం కావట్లేదు. విడాకుల విషయమై గత కొన్ని రోజుల నుంచి వార్తలు వస్తున్నా.. వాటిపై వారిద్దరిలో ఒక్కరూ కూడా క్లారిటీ మాత్రం ఇవ్వడం లేదు. సమంత తన ఇన్ స్టాగ్రామ్ లో విచిత్రమైన, విభిన్నమైన పోస్టులు పెడుతూ గందరగోళానికి గురిచేస్తున్నారు. కానీ వీరిద్దరి మధ్య కన్ఫ్యూజన్ మాత్రం తొలగిపోవడం లేదు.

రోజు రోజుకూ రూమర్స్ పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు. ఇటీవల నాగచైతన్య ఇంటర్వ్యూలో తమ వ్యక్తిగత విషయాలను అడగొద్దని కండీషన్ కూడా పెట్టారు. దీంతో అనుమానాలకు ఇంకా బలం చేకూరినట్లు అయింది. ఇటీవల అలాంటి రూమర్స్ ను నమ్మను అని.. తన తల్లిదండ్రులు ఇలాగే పెంచారని చెప్పిన నాగచైతన్య అంతలోనే మరొక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అభిమానుల్లోనే గందరగోళ పరిస్థితి ఉండగా.. అటు సినీ పరిశ్రమలో కూడా వాళ్లిద్దరి మధ్య ఏం జరుగుతుందో తెలియకపోవడం ఆశ్చర్యకరం. ఇదిలా ఉండగా.. తన వ్యక్తిగత జీవితం గురించి మీడియాలో వార్తలు రాకుండా అడ్డుకునేందుకు సమంత సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీని కోసం ఆమె కోర్టు మెట్లు కూడా ఎక్కబోతున్నారంటూ తెలుస్తోంది.

ఈ విషయంలో సాధ్యాసాధ్యాలపై సమంత తన లీగల్ టీమ్ తో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. తిరుమల దేవస్థానం వద్ద కూడా ఓ రిపోర్టర్ తన వ్యక్తిగత జీవితం గురించి ప్రశ్న అడిగితే.. గుడిలో అలాంటి ప్రశ్నలు ఏంటి బుద్ది ఉందా అంటూ హెచ్చరించిన సంగతి తెలిసిందే. అయితే ఇలాంటి వార్తలు ఇక మీడియాలో రాకుండా ఏం చేయాలనే సలహాలు తన లీగల్ టీం సభ్యుల నుంచి తీసుకుంటున్నట్లు సమాచారం.

వారి మూడు ముళ్ల బంధం.. ముడో రోజే ముడి తెగింది.. సంచలన తీర్పు ఇచ్చిన కోర్టు..

పెళ్లి అనే బంధానికి ఎన్ని నిర్వచనాలు చెప్పినా తక్కువే. ఎన్ని బంధాలు ఉన్నా భార్యభర్తల బంధం అనేది గొప్పది. మనకంటూ ఎవరూ లేకపోయినా పెళ్లి అయిన తర్వాత మనకంటూ ఓ తోడు అనేది జీవితాంతం ఉంటుంది. అలా కడవరకు ఎవరూ ఉండరు.

అందుకే పెళ్లి జరిగే సమయంలోనే ఎంతో మంది సాక్షుల మధ్య, పెద్దల మధ్య పంతులు మంత్రాలు చదివి మరీ వివాహాన్ని జరిపిస్తారు. ఇదిలా ఉండగా.. ఆ పెళ్లి బంధాన్ని చాలామంది చిన్న చిన్న విషయాలకు తెంచుకునేందుకు ప్రయత్నింస్తుటారు. భార్యభర్తల మధ్య గొడవలు అనేవి సహజం. కానీ వాటిని కూర్చొని పరిష్కరించుకుంటే ఎంతటి సమస్యను అయినా పరిష్కరించవచ్చు.

ఇక్కడ ఓ ఘటనలో పెళ్లి జరిగి మూడు రోజులకే విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు.మూడో రోజు ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చి గొడవ పడి.. కోర్టుకు వెళ్లారు. ఈ ఘటన హర్యానాలో చోటు చేసుకుంది. రెండే రోజులు వీళ్లిద్దరు కలిసి ఉన్నారు.

మూడో రోజు కోర్టువైపు పరుగులు పెట్టారు. అయితే హిందూ వివాహ చట్టం ప్రకారం విడాకులు తీసుకోవాలంటే.. కచ్చితంగా వివాహం జరిగి సంవత్సరం అయి ఉండాలి. కానీ ఆ నిబంధనలను పట్టించుకోకుండా ఆ కోర్టు వాళ్లకు విడాకులను మంజూరు చేశారు. అయితే ఇలా ఎలా సాధ్యం అంటూ.. ఈ విషయం తెలిసిన ప్రతీ ఒక్కరూ ఆశ్చర్యపోతున్నారు. ఆ కోర్టు తీరుపై కూడా చర్చించుకుంటున్నారు.

అయ్యో.. మగాళ్లకు గృహ హింస చట్టం లేదే..?

కొన్నిసార్లు కోర్టులు చేసే వ్యాఖ్యలు సంచలనాలను సృష్టిస్తాయి.ఈ క్రమంలోనే మద్రాస్ హైకోర్టు చేసిన కొన్ని వ్యాఖ్యలకు మగాళ్ళందరూ ఏకమై తమకి కూడా ఆ చట్టం వర్తించాలని డిమాండ్ చేస్తున్నారు. మద్రాస్ హైకోర్టు ఒక కేసు తీర్పులో భాగంగా అయ్యో… మగాళ్లకు ప్రత్యేక గృహ హింస చట్టం అనేది లేదు అన్న క్రమంలో ఈ వ్యాఖ్యలపై మగాళ్లు పెద్ద ఎత్తున వారికి ఆ చట్టం వర్తించని డిమాండ్ చేస్తున్నారు.

ప్రస్తుత కేసు విషయానికి వస్తే డాక్టర్ పి.శశికుమార్ చెన్నైలో పశు సంవర్థక శాఖలో డైరెక్టర్‌గా పనిచేసేవారు. ఐతే… ఆయన భార్య అతని పై గృహ హింస చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ విధంగా భర్తపై భార్య గృహ హింస కేసు పెట్టడంతో సంబంధిత శాఖ ఉన్నత అధికారులు సదరు డాక్టర్ ను సస్పెండ్ చేశారు.

తన భార్య పెట్టే టార్చర్ భరించలేక తనతో దూరంగా ఉండాలని భావించిన శశికుమార్ 2015 వ సంవత్సరంలో విడాకుల కోసం అప్లై చేశారు. ఈ క్రమంలోనే ఒక నాలుగు రోజులలో విడాకులు వస్తాయన్న క్రమంలో మహిళ అతనిపై గృహ హింస కేసు పెట్టడం చర్చనీయాంశంగా మారింది.2015లో సాలెం కోర్టులో విడాకుల కోసం అప్లై చేసుకోగా ఫిబ్రవరి 2020లో విడాకులకు అనుమతిస్తూ తీర్పు వెల్లడించింది.

ఈ విధంగా గృహ హింస కేసు నమోదు కావడంతో అతనిని సస్పెండ్ చేయడాన్ని పరిగణలోకి తీసుకున్న కోర్టు అతనిని తన ఉద్యోగం నుంచి సస్పెండ్ చేయాల్సిన అవసరం లేదని… తిరిగి మరో 15 రోజులలో అతను ఉద్యోగంలో చేరవచ్చని తీర్పు ఇచ్చింది.సందర్భంగా జస్టిస్ వైద్యనాథన్ ఓ వ్యాఖ్య అన్నారు. “భార్యాభర్తలు ఓ విషయాన్ని గ్రహించాలి. ఇగో, అసహనం అనేవి చెప్పులు లాంటివి వాటిని బయటకు వదలాలి కాని లోపలికి తీసుకెళ్లకూడదు తెచ్చుకుంటే భార్య ,పిల్లలు ఎంతో దుర్భరమైన జీవితాన్ని భరించాల్సి ఉంటుందని జస్టిస్ వైద్యనాథ్ తెలిపారు.

ముంబై జడ్జి వివాదాస్పద తీర్పులు.. న్యాయమూర్తికి సుప్రీం షాక్..?

గత కొన్ని రోజులుగా ముంబై హైకోర్టు మహిళా జడ్జి పుష్ప ఇస్తున్న తీర్పులు వివాదాస్పదమవుతున్న సంగతి తెలిసిందే. సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు అందరి నుంచి ఆమె తీర్పులపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చిన్నారుల లైంగిక వేధింపుల కేసులకు సంబంధించి వివాదాస్పద తీర్పులు ఇస్తున్న జడ్జికి శాశ్వత హోదా కల్పించే విధంగా సుప్రీం కోర్టు కొలీజియం చేసిన సిఫార్సును సుప్రీం కోర్టు వెనక్కు తీసుకున్నట్టు తెలుస్తోంది.

ప్రస్తుతం పుష్ప ముంబై హైకోర్టులోని నాగ్ పూర్ బెంచ్ కు జడ్జిగా ఉన్నారు. సుప్రీంకోర్టు కొలీజియం ఈ నెల 20వ తేదీన పుష్పకు శాశ్వత హోదా కల్పించడానికి సిఫార్సులు చేయగా ఆ సిఫార్సులను వెనక్కున్నారు. మైనర్లపై లైంగిక వేధింపుల కేసులో జస్టిస్ పుష్ప ఇచ్చిన వివాదాస్పద తీర్పులను అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అటార్నీ జనరల్ న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలు ఆందోళనకరమని చెప్పగా సుప్రీంకోర్టు జస్టిస్ పుష్ప ఇచ్చిన తీర్పుపై స్టే విధించింది.

ఈ నెల 19వ తేదీన జస్టిస్ పుష్ప ఒక వ్యక్తి బాలిక ఛాతీ భాగాన్ని తడమగా చర్మం తగలలేదు కాబట్టి లైంగిక వేధింపుల కేసుగా పరిగణించలేమని.. శరీర భాగాలను దుస్తులపై నుంచి తాకడం నేరం కాదని ఆమె పేర్కొన్నారు. అయిదేళ్ల బాలిక కేసుకు సంబంధించి కూడా జస్టిస్ పుష్ప వివాదాస్పద తీర్పు ఇచ్చారు. మైనర్ బాలిక చేతులను పట్టుకోవడం లైంగిక వేధింపుల కిందికి రాదని జస్టిస్ పుష్ప పేర్కొన్నారు.

న్యాయ వ్యవస్థపైనే అపనమ్మకం కలిగించే విధంగా జస్టిస్ పుష్ప తీర్పులు ఉండగా ఆమెకు శాశ్వత హోదా కల్పించకుండా అడుగులు పడటం గమనార్హం. గతంలో కూడా జస్టిస్ పుష్ప ఇచ్చిన తీర్పులను పునఃపరిశీలించాలని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.