Tag Archives: crows

మీడియాను కాకులని సంబోధిస్తూ మీడియా పై ఆగ్రహం వ్యక్తం చేసిన యాంకర్ ఝాన్సీ..!

సాధారణంగా మీడియా ప్రతి విషయాన్ని ఎంతో ఫోకస్ చేస్తుంది. అది రాజకీయాలలో నైనా లేదా సినిమా పరిశ్రమలో నైనా మీడియా మరింత ఎక్కువగా ఆతృతను చూపిస్తూ.. చిత్ర పరిశ్రమకు పెద్ద తలనొప్పిగా మారింది. సాధారణంగా సెలబ్రిటీల విషయాలు మీడియా ద్వారా ప్రజల్లోకి వెళ్లడం సర్వసాధారణం. అయితే ఈ మధ్య కాలంలో మీడియా ఫోకస్ మరింత ఎక్కువైంది అంటూ పలువురు సెలబ్రిటీలు మీడియా పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

బుల్లితెరపై యాంకర్ గా, సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న యాంకర్ ఝాన్సీ తాజాగా మీడియా పై ఆగ్రహం వ్యక్తం చేశారు.ప్రతి సెలబ్రెటీకి కూడా ఒక వ్యక్తిగత జీవితం ఉంటుందని వారి వ్యక్తిగత విషయాలు వారి ఇంటికి మాత్రమే పరిమితం కావాలని భావిస్తారు. కానీ మీడియా ఫోకస్ వల్ల ప్రతి చిన్న విషయాన్ని పెద్దదిగా చూపిస్తున్నారని ఝాన్సీ మీడియాపై విరుచుకుపడ్డారు.

ఈ క్రమంలోనే ఈమె సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ చేశారు ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది. ఈ క్రమంలోనే ఆమె తెలియజేస్తూ అనగనగా ఒక ఎద్దు ఎద్దు కాలిలో పుండు… ఆ పుండులో పురుగులు..ఎద్దు తో కబుర్లు చెప్పాల్సిన కాకి ఆ పుండును పొడుస్తూ పొడుస్తూ పురుగులు తింటుంది. ఆ ఎద్దు రెచ్చిపోయి బుసలు కొడుతూ కాకుల గోల పెంచి మైకులు పట్టి మరీ మా మురికిని అందరి ఇంటిలోకి చేరవేస్తున్నాయి. ఇండస్ట్రీలో పెళ్లి జరిగిన విడాకులు జరిగిన ఎన్నికలు జరిగిన కాకుల హడావిడి చేస్తున్నారంటూ మీడియాను కాకులతో పోలుస్తూ యాంకర్ ఝాన్సీ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇకపోతే ఈమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలోని పరిస్థితులకు అద్దం పడుతున్నాయి. గత కొద్దిరోజుల నుంచి టాలీవుడ్ ఇండస్ట్రీలో సమంత విడాకుల విషయం పవన్ కళ్యాణ్ రిపబ్లిక్ ప్రీ రిలీజ్ వేడుకలో చేసిన వ్యాఖ్యలు, మా ఎన్నికల గురించి ఝాన్సీ పరోక్షంగా మీడియాపై ఈ విధంగా స్పందించినట్లు తెలుస్తోంది.

ఈ రెండు కాకులు రౌడీలంటా.. పోలీసులకు ఫిర్యాదు!

సాధారణంగా మనం పంట పొలాల్లో పక్షులు పంటను నాశనం చేయకుండా ఉండాలని పంట పొలాల్లో దిష్టి బొమ్మలను పెట్టడం చూస్తుంటాము. ఈ విధంగా దిష్టిబొమ్మలు ఉండటం వల్ల ఎలాంటి పక్షులు ఆ దరిదాపుల్లోకి రావు.పంట పొలాలలో పెట్టె దిష్టిబొమ్మలు యూకేలో ప్రతి ఇంటి ముందు పెడుతున్నారు. అదేంటి దిష్టి బొమ్మలు ఇంటికి పెట్టుకోవడం ఏంటని అనుకుంటున్నారా… సాధారణంగా దిష్టిబొమ్మలు మన ఇంటి పై ఎటువంటి చెడు దృష్టి పడకుండా ఉండటం కోసం పెట్టుకుంటాము. కానీ యుకెలో వారు మాత్రం కాకుల బెడద తట్టుకోలేక ప్రతి ఇంటి ముందు ఈ విధంగా దిష్టిబొమ్మలను పెట్టిన ఘటన చోటు చేసుకుంది… అసలేం జరిగిందంటే…

యూకేలో కార్లిస్లే అవెన్యూ, లిటిల్ఓవర్ ప్రాంతంలో గత కొన్ని రోజుల నుంచి కార్ల విండ్‌స్క్రీన్, వైపర్‌లు పాడవుతున్నాయి. ఎవరో కార్ల మీద గీతలు పెడుతున్నారు. అద్దాలు పగలగొడుతున్నారు. విలువైన వస్తువులను దొంగతనం చేస్తూ వెళుతున్నారు.అయితే ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఈ విధంగా చేస్తున్నారని భావించిన ఆ ప్రాంతవాసులు కొందరి యువకులను కాపలాగా నియమించారు. అయితే కాపలాగా ఉన్న ఆ యువకులకి ఒక షాకింగ్ విషయం తెలిసింది.

ఇన్ని రోజుల నుంచి తమ కార్ల విండ్ స్క్రీన్లను పగలగొట్టి, విలువైన వస్తువులను దొంగతనం చేస్తూ ఉన్నది మనుషులు కాదు.. కాకుల అని తెలియడంతో ఆ ప్రాంత వాసులు అందరూ ఎంతో ఆశ్చర్యానికి గురయ్యారు. కేవలం రెండు కాకులు ప్రతిరోజూ ఈ విధంగా కనిపించి కార్ల పై దాడి చేస్తూ ఎంతో నష్టాన్ని కలుగజేస్తున్నాయి. ఈ కాకుల దాడిని భరించలేక నగరవాసులు కాకుల పై చర్య తీసుకోవాలని ఏకంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ విధంగా పలుమార్లు కాకులను తరుముతూ ఉన్నప్పటికీ అవి వెళ్ళినట్టే వెళ్లి మరి వచ్చి విధ్వంసం సృష్టించే.కేవలం రెండు కాకుల మాత్రమే ఈ విధమైనటువంటి చర్యలకు పాల్పడుతున్నాయని. కేవలం కార్లపై మాత్రమే కాకుండా నడుస్తూ వెళుతున్నటువంటి మనుషులపై కూడా దాడి చేయడంతో విసిగిపోయిన ఆ కాలనీవాసులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై స్పందించిన రాయల్ సొసైటీ ఫర్ ది ప్రొటెక్షన్ ఆఫ్ బర్డ్స్ అధికారి మాట్లాడుతూ కార్ల అద్దాలలో పక్షులు చూసుకోవడం సర్వసాధారణమే, అయితే వాటిని చంపడానికి వేరే పక్షులు వచ్చాయని భావించి అవి వాటిని తరమడానికి ముక్కుతో పొడుస్తూ ఉండడం సర్వసాధారణమే అని తెలిపారు. ఈ విధంగా కార్ల విండోస్ కు క్లాత్ పెట్టినప్పటికీ వాటి పనిని మాత్రం ఆపలేదు.

ఈ విధంగా ఎంతో విధ్వంసం సృష్టిస్తున్న ఈ రౌడీ కాకులకు ఆ ప్రాంత వాసులు తూర్పు లండన్‌లో 50-60 దశకాల్లో పేరొందిన అండర్ వరల్డ్ కవల సోదరులు రోనీ, రెగీ పేర్లు పెట్టారు.ఈ కాకుల చేష్టలకు విసుగుచెందిన ఆ ప్రాంతవాసులు వాటిని మచ్చిక చేసుకోనీ ఈ నష్టాన్ని తప్పించాలని వాటికి ఆహారం పెడుతూ ఉన్నారు.

పిండ ప్రధానం కాకులకే ఎందుకు పెడతారు..?

సాధారణంగా మన హిందూ సాంప్రదాయాలు ఎన్నో ఆచారాలు పాటిస్తుంటారు. ఇందులో భాగంగానే చనిపోయిన తర్వాత చనిపోయిన వారికి పిండం ప్రధానం చేయడం కూడా ఒక ఆచారంగానే వస్తుంది. అదే విధంగా ప్రతి పుష్కరాలకు లేదా సంవత్సరం రోజు చనిపోయిన వారికి పిండ ప్రధానం చేయడం మనం చూస్తూనే ఉంటాం.అయితే ఈ పిండప్రధానం చేసేటప్పుడు మనం మన పితృదేవతలకు సమర్పించిన పిండాన్ని కాకులు తినాలని భావిస్తుంటారు. ఆ విధంగా కాకులు తినడం ద్వారా మన పితృదేవతలకు ఆత్మ శాంతి కలుగుతుందని నమ్మకం. అయితే పిండాన్ని కాకులకి ఎందుకు పెడతారు? ఆ విధంగా కాకులకు పెట్టడానికి గల కారణం ఏమిటి అనే విషయాలను గురించి ఇక్కడ తెలుసుకుందాం.

పురాణాల ప్రకారం రావణాసురుడుకి భయపడిన యమధర్మరాజు కాకులకు ఒక వరం ఇస్తాడు. ఎవరైతే చనిపోయి ఉంటారో వారు నరకానికి వెళ్లి బాధలను అనుభవిస్తుంటారు. అలాంటి వారికి నరక బాధలు నుంచి విముక్తి కలగాలంటే వారి కుటుంబ సభ్యులు పిండప్రధానం చేసినప్పుడు కాకుల ఎవరి పిండాన్ని అయితే తింటాయో వారికి నరక బాధల నుంచి విముక్తి కలుగుతుందనే వరాన్ని ప్రసాదిస్తాడు. అందువల్ల పిండ ప్రదానం చేసే టప్పుడు కాకులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు.

ఈ విధంగా ప్రతిసారీ పిండప్రదానం చేసినప్పుడు కాకులు ఆ పిండాన్ని తినకపోతే తమ పితృ దేవతలకు ఏవో తీరని కోరికలు ఉన్నాయని, వారి ఆత్మకు శాంతి ఇ కలగలేదని భావిస్తుంటారు. అయితే కొందరు మాత్రం పూర్వకాలంలో పశుపక్ష్యాదులకు ఆహారంగా ఈ పిండ ప్రదానం చేసే వారని,అప్పట్లో కాకులు ఎక్కువగా ఉండటం వల్ల ఈ పిండాన్ని కాకులు తినేవి. అప్పటి నుంచి ఇప్పటికీ వరకు పిండాన్ని కాకులు తినడం ఒక ఆచారంగా పాటిస్తున్నారని మరి కొందరు భావిస్తుంటారు.