Tag Archives: cry

అతనికి కాల్ చేసిన సమంత.. ఏడుస్తూ ఎం చెప్పారో తెలుసా..?

సమంత గురించి తెలియని వాళ్లు ఉండరు. ఆమె మొదటగా మోడలింగ్ లో అడుగు పెట్టి 2007లో రవి వర్మన్ దర్శకత్వంలో మాస్కోవిన్ కావేరి సినిమాలో నటించేందుకు ఒప్పుకుంది. కానీ ఆమె తొలి చిత్రం 2010లో ఓ ఏమాయ చేశావే చిత్రంతో తెలుగు పరిశ్రమలోకి అడుగుపెట్టింది. తమిళంలో కూడా ఎన్నో చిత్రాల్లో నటించి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.

ఆ తర్వాత తెలుగులో బృందావనం సినిమాలో ఎన్టీఆర్ సరసన నటించారు. తర్వాత 2011లో దూకుడు తర్వాత.. ఇంకెన్నో సినిమాల్లో నటించారు. బృందావనం, దూకుడు సినిమాలు ఆమెకు స్టార్ హోదా తెచ్చిపెట్టాయి. దూకుడు సినిమా షూటింగ్ సమయంలో జరిగిన కొన్ని విషయాలను శ్రీను వైట్ల వెల్లడించారు. ఈ సినిమాను ఇస్తాంబుల్ లో షూట్ చేసిన విషయం తెలిసిందే.

అయితే అక్కడ ఒక రోజు వాళ్లకు షూటింగ్ లేదు. ఆ సమయంలో సమంతకు షాపింగ్ కు వెళ్లమని శ్రీనువైట్ల సూచించాడు. అతడు చెప్పిన విధంగానే ఆమె షాపింగ్ కు వెళ్లింది. అలా ఆమె షాపింగ్ కు వెళ్లిన కొన్ని నిమిషాల తర్వాత ఓ ఘటన జరిగింది. అదేంటంటే.. ఆమె ఎదురుగా ఓ ఆత్మాహుతి జరిగిందని.. దీంతో ఆమె భయపడి పోయి తనకు కాల్ చేసి ఏడుస్తూ చెప్పినట్లు శ్రీనువైట్లు చెప్పాడు.

కాని అక్కడ ఆమె మానవ బాంబ్ ను చూశారట. ఇదిలా ఉండగా.. ఇస్తాంబుల్ లో తాము స్టే చేసిన బిల్డింగ్ 36వ అంతస్తులో ఉండగా.. భూకంపం వచ్చినట్లు తెలిపాడు శ్రీనువైట్ల. అక్కడ చాలావరకు ఇబ్బందులకు గురయ్యామని.. అయినా సమంత ఎక్కడా డిస్టబెన్స్ కాకుండా.. తనకు ఇచ్చిన పాత్రకు 100 శాతం న్యాయం చేశారని చెప్పారు.

ఏడుపు కూడా ఆరోగ్యానికి ఎంతో మంచిది తెలుసా..?

సాధారణంగా ఒక వ్యక్తి ఎంతో భావోద్వేగానికి గురి అవుతున్నాడు అంటే అతనికి కంటిలో నుంచి నీరు కారుతాయి. అయితే మనిషి కళ్ళలోంచి కన్నీళ్ళు కారుతున్నాయి అంటే అది కేవలం భావోద్వేగమైన ఏడుపు మాత్రమే కాకుండా.. మనం సంతోషంగా ఉన్నప్పుడు కూడా మన కంటినుంచి ఈ విధంగా కన్నీరు కారుతుంటాయి. అయితే నవ్వడం వల్ల మనకు ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో.. ఏడవడం, మన కంటిలో నుంచి నీరు బయటకు రావడం వల్ల కూడా మనకు అనేక ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. మరి ఏడవడం ద్వారా ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇక్కడ తెలుసుకుందాం…

సాధారణంగా మనం ఏదైనా బాధ కలిగినప్పుడు పదేపదే ఆ విషయం గురించి ఆలోచిస్తూ ఏడుస్తూ ఉంటాము. ఈ విధంగా ఒక విషయం గురించి ఎక్కువగా ఆలోచించడం వల్ల మన మెదడులో ఆక్సిటోసిన్, ఎండార్ఫిన్‌ అనే ఫీల్‌ గుడ్‌ రసాయనాలు విడుదల అవుతాయి. ఇలా రసాయనాలు విడుదలైనప్పుడు మనలో శారీరక మానసిక భావోద్వేగాలకు సంబంధించిన మార్పులు జరుగుతాయి.

మనం బాగా ఏడవడం వల్ల మన మెదడులో ఉష్ణోగ్రతలు సాధారణ స్థితిలో ఉండిపోతాయి. ఈ విధంగా మెదడు ఉష్ణోగ్రతలు ఉండటం వల్ల మనం ఏ విషయం అయినా ఎంతో సమన్వయంతో ఆలోచించగలగతాము. ఈ విధంగా అప్పుడప్పుడు ఏడవటం వల్ల కళ్ల నుంచి నీరు బయటకు కారి మన శరీరంలో రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. ఈ క్రమంలోనే గుండెజబ్బులు వచ్చే అవకాశాలు పూర్తిగా తగ్గిపోతాయి.

సాధారణంగా మన కన్నీళ్లు మూడు రకాలుగా ఉంటాయి. 1 బాసిల్ టియర్స్: ఈ కన్నీళ్ళు నిమిషానికి ఒకటి నుంచి రెండు మైక్రో లీటర్లు ఉత్పత్తి అవుతాయి. ఈ కన్నీళ్లు మన కంటిని ఎల్లప్పుడూ తేమగా ఉంచడమే కాకుండా కంటికి వచ్చే ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది.
రిఫ్లెక్స్ టియర్స్: ఇలాంటి కన్నీళ్లు మనం ఉల్లిపాయలు కోసేటప్పుడు వస్తాయి.అదేవిధంగా కళ్లల్లో దుమ్ము ధూళి పడినప్పుడు కళ్ళు మంటను తగ్గించడానికి ఈ విధమైనటువంటి కన్నీళ్లు వస్తాయి.
ఎమోషనల్ టియర్స్: ఈ విధమైనటువంటి కన్నీళ్లు మనం ఎంతో భావోద్వేగానికి గురైనప్పుడు కంటి నుంచి కన్నీళ్లు వస్తాయి. ఈ విధమైనటువంటి కన్నీళ్లు రావడం వల్ల ఇవి మానసిక బాధలను తగ్గిస్తాయి. కనుక నవ్వడమే కాకుండా అప్పుడప్పుడు ఏడవడం వల్ల కూడా మనం ఎంతో ఆరోగ్యాన్ని పొందవచ్చు.