Tag Archives: director Om Raut

Adipurush: అరుదైన గౌరవాన్ని అందుకున్న ప్రభాస్ ఆదిపురుష్… సంతోషంలో తేలిపోతున్న డైరెక్టర్?

Adipurush: ప్రభాస్ హీరోగా పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం ఆదిపురుష్.రామాయణం ఇతిహాసం నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో సందడి చేయగా కృతి సనన్ సీతమ్మ పాత్రలో నటిస్తున్నారు. ఇక బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ రావణాసురుడి పాత్రలో నటిస్తున్నారు. ఇలా ఈ సినిమా ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా కొన్ని పనుల కారణంగా వాయిదా పడతా వస్తుంది.

ఇక ఈ సినిమా వచ్చేయడాది సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలకు సిద్ధమవుతుంది. అయితే ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసినటువంటి వీడియోలో పోస్టర్లు పెద్ద ఎత్తున వివాదానికి కారణమయ్యాయి.అసలు రాముడికి గడ్డం మీసాలు పెట్టడం ఏంటి హిందువుల పవిత్రంగా భావించే శ్రీరాముడిని ఇలా రూపురేఖలు మార్చి చూపించడంతో చాలామంది విమర్శలు చేశారు.

ఇలా ఎన్నో విమర్శలను ఎదుర్కొన్నటువంటి ఈ చిత్రం మరొక అరుదైన గౌరవాన్ని అందుకుంది. ట్రిబెకా ఫిలిం ఫెస్టివల్ ఈ సినిమా ప్రదర్శనకు ఎంపిక కావడంతో ఈ విషయాన్ని డైరెక్టర్ ఓం రౌత్ సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. సంతోషాన్ని మించిన విషయం ఇది 2023 జూన్ 13వ తేదీ న్యూయార్కులో జరగనున్న ట్రిబెకా ఫిలిం ఫెస్టివల్ లో మన సినిమా ప్రదర్శన కానుండడం ఎంతో సంతోషంగా ఉంది.


Adipurush: సంతోషంలో ప్రభాస్ ఫ్యాన్స్…

ఈ ఫిలిం ఫెస్టివల్ కు ఆది పురుష్ సినిమాను ఎంపిక చేసిన ట్రిబెకా జ్యూరీ సభ్యులకు కృతజ్ఞతలు అలాగే ఆది పురుష్ టీం అందరికీ ధన్యవాదాలు అంటూ ఈయన తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇలా ఈ సినిమా విడుదల కాకముందు ఎన్నో విమర్శలను ఎదుర్కొంది అయితే విడుదల కాకముందు కూడా ఈ సినిమా ఇలాంటి గుర్తింపు అందుకోవడంతో ప్రభాస్ అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Adipurush: సీతమ్మ మెడలో తాళి ఎక్కడ… మరోసారి విమర్శలకు గురైన ఆది పురుష్ డైరెక్టర్?

Adipurush: బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ డమ్ సొంతం చేసుకున్నటువంటి ప్రభాస్ తన తదుపరి సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ఇలా ఈయన నటిస్తున్నటువంటి సినిమాలలో ఆది పురుష్ ఒకటి. అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా రామాయణం బ్యాక్ డ్రాఫ్ లో తెరకేక్కుతున్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అయితే ఇప్పటికే ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తుంది.

ఇకపోతే ఈ సినిమా నుంచి ఇదివరకే ఒక వీడియో విడుదల చేయగా ఇది కాస్త పెద్ద ట్రోలింగ్ కు గురైంది. 500 కోట్ల బడ్జెట్ కేటాయించి డైరెక్టర్ ఓం రౌత్ బొమ్మల సినిమాలు చూపిస్తున్నారని కార్టూన్ ఛానల్ చూస్తున్నాం అనే భావన కలుగుతుంది అంటూ పెద్ద ఎత్తున విమర్శలు చేశారు అయితే తాజాగా శ్రీరామనవమి పండుగను పురస్కరించుకొని ఈ సినిమా నుంచి మరొక పోస్టర్ విడుదల చేశారు.

ఇందులో సీతారామ లక్ష్మణులతో పాటు ఆంజనేయుడు ఉన్నారు. అయితే తాజాగా ఈ పోస్టర్ పై కూడా పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ పోస్టర్ లో భాగంగా లక్ష్మణుడు గడ్డంతో కనిపించడం,సీతమ్మ మెడలో తాళి లేకపోవడం కాలికి మెట్టలు లేకపోవడం వంటి వాటిని గుర్తించి సీతమ్మ మెడలో తాళి ఎక్కడ డైరెక్టర్ గారు అంటూ పెద్ద ఎత్తున డైరెక్టర్ ను ప్రశ్నిస్తూ ట్రోల్ చేస్తున్నారు.

Adipurush: భారీ విమర్శలను ఎదుర్కొంటున్న డైరెక్టర్..


ఇలా ఈ సినిమా విడుదల కాకముందే ఎన్నో విమర్శలను ఎదుర్కొంటుంది. మరి విడుదలైన తర్వాత ఈ సినిమా ఎలాంటి ఫలితాలను అందుకుంటుందో తెలియాల్సి ఉంది. ఇకపోతే ఈ సినిమాని జూన్ 16 న ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషలలో విడుదల కానుంది మరి ఈ సినిమా విడుదల అయ్యి ఎలాంటి ఆదరణ పొందుతుందో తెలియాల్సి ఉంది.

Tammareddy Bharadwaj: రాముడి గెటప్ మార్చేయడం విచిత్రంగా ఉంది.. ఆది పురుష్ టీజర్ పై తమ్మారెడ్డి షాకింగ్ కామెంట్స్!

Tammareddy Bharadwaj: బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన చిత్రం ఆది పురుష్ ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ విడుదల చేయగా ఈ టీజర్ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో విమర్శలకు కారణమైంది. ఈ సినిమా గ్రాఫిక్స్ ఏమాత్రం బాగాలేవని ఈ టీజర్ కన్నా కార్టూన్ ఛానల్ ఏంతో అద్భుతంగా ఉందంటూ చాలామంది ఈ సినిమా టీజర్ పై విమర్శలు చేశారు.

ప్రభాస్ అభిమానులు సైతం ఈ టీజర్ చూసి ఇందులో ప్రభాస్ గెటప్ చూసి ఏమాత్రం జీర్ణించుకోలేకపోయారు. అయితే కొంతమంది సినీ సెలబ్రిటీలు ఈ టీజర్ పై స్పందిస్తూ విమర్శలు చేయడం మరికొందరు మాత్రం కొన్ని సినిమాలు బిగ్ స్క్రీన్ లోనే అద్భుతంగా ఉంటాయని ఆ ఎక్స్పీరియన్స్ చేసినప్పుడే బాగుంటాయని తెలిపారు.మరో 20 రోజులలో ఈ సినిమా నుంచి ఇంకొక టీజర్ విడుదల చేస్తామని తప్పకుండా ప్రతి ఒక్కరూ ఈ టీజర్ చూసి సంతోష పడతారు అంటూ తెలియచేశారు .

ఇకపోతే ఈ టీజర్ పై ప్రముఖ నిర్మాత నటుడు తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు. ఆది పురుష్ టీజర్ చూశాను. ప్రభాస్ సినిమా అంటే వాడి వేడిగా ఉంటుంది పైగా 500కోట్ల బడ్జెట్ అంటే సినిమా భారీ స్థాయిలో ఉంటుందని ఊహించాను అయితే ఈ సినిమా ఒక యానిమేషన్ సినిమా లాగా ఉందని ఈయన తెలియజేశారు. ఈ సినిమా టీజర్ పై వస్తున్న విమర్శలపై ఇప్పటికే చిత్ర బృందం స్పందించారు.

Tammareddy Bharadwaj: రావణుడు కూడా బ్రాహ్మణుడే..

ఇదివరకే చిత్ర బృందం ప్రెస్‌మీట్‌ ప్రొడ్యూసర్, డైరెక్టర్, హీరో సినిమాని 3డీలో చూడాలని చెబుతున్నారు. 3డీ అయినా ఫోర్ డి అయిన యానిమేషన్ కి లైవ్ కి చాలా తేడా ఉంటుంది. రాముడిని దేవుడిలా భావించే ఈ దేశంలో రాముడి గెటప్ మార్చేయడం చాలా విచిత్రంగా ఉంది. రావణాసురుడు కూడా బ్రాహ్మణుడు ఆయనకు కూడా మన భారతదేశంలో దేవాలయాలు ఉన్నాయి.20 రోజులలో మొత్తం మారుతుందని చిత్ర బృందం చెబుతున్నారు నిజంగానే ఆ మార్పులు చేసి సినిమాని మంచిగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ఈయన తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ చిత్ర బృందానికి ఆల్ ద బెస్ట్ తెలియజేశారు