Adipurush: బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ డమ్ సొంతం చేసుకున్నటువంటి ప్రభాస్ తన తదుపరి సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ఇలా ఈయన నటిస్తున్నటువంటి సినిమాలలో ఆది పురుష్ ఒకటి. అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా రామాయణం బ్యాక్ డ్రాఫ్ లో తెరకేక్కుతున్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అయితే ఇప్పటికే ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తుంది.
ఇకపోతే ఈ సినిమా నుంచి ఇదివరకే ఒక వీడియో విడుదల చేయగా ఇది కాస్త పెద్ద ట్రోలింగ్ కు గురైంది. 500 కోట్ల బడ్జెట్ కేటాయించి డైరెక్టర్ ఓం రౌత్ బొమ్మల సినిమాలు చూపిస్తున్నారని కార్టూన్ ఛానల్ చూస్తున్నాం అనే భావన కలుగుతుంది అంటూ పెద్ద ఎత్తున విమర్శలు చేశారు అయితే తాజాగా శ్రీరామనవమి పండుగను పురస్కరించుకొని ఈ సినిమా నుంచి మరొక పోస్టర్ విడుదల చేశారు.
ఇందులో సీతారామ లక్ష్మణులతో పాటు ఆంజనేయుడు ఉన్నారు. అయితే తాజాగా ఈ పోస్టర్ పై కూడా పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ పోస్టర్ లో భాగంగా లక్ష్మణుడు గడ్డంతో కనిపించడం,సీతమ్మ మెడలో తాళి లేకపోవడం కాలికి మెట్టలు లేకపోవడం వంటి వాటిని గుర్తించి సీతమ్మ మెడలో తాళి ఎక్కడ డైరెక్టర్ గారు అంటూ పెద్ద ఎత్తున డైరెక్టర్ ను ప్రశ్నిస్తూ ట్రోల్ చేస్తున్నారు.
ఇలా ఈ సినిమా విడుదల కాకముందే ఎన్నో విమర్శలను ఎదుర్కొంటుంది. మరి విడుదలైన తర్వాత ఈ సినిమా ఎలాంటి ఫలితాలను అందుకుంటుందో తెలియాల్సి ఉంది. ఇకపోతే ఈ సినిమాని జూన్ 16 న ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషలలో విడుదల కానుంది మరి ఈ సినిమా విడుదల అయ్యి ఎలాంటి ఆదరణ పొందుతుందో తెలియాల్సి ఉంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…