Tammareddy Bharadwaj: బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన చిత్రం ఆది పురుష్ ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ విడుదల చేయగా ఈ టీజర్ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో విమర్శలకు కారణమైంది. ఈ సినిమా గ్రాఫిక్స్ ఏమాత్రం బాగాలేవని ఈ టీజర్ కన్నా కార్టూన్ ఛానల్ ఏంతో అద్భుతంగా ఉందంటూ చాలామంది ఈ సినిమా టీజర్ పై విమర్శలు చేశారు.
ప్రభాస్ అభిమానులు సైతం ఈ టీజర్ చూసి ఇందులో ప్రభాస్ గెటప్ చూసి ఏమాత్రం జీర్ణించుకోలేకపోయారు. అయితే కొంతమంది సినీ సెలబ్రిటీలు ఈ టీజర్ పై స్పందిస్తూ విమర్శలు చేయడం మరికొందరు మాత్రం కొన్ని సినిమాలు బిగ్ స్క్రీన్ లోనే అద్భుతంగా ఉంటాయని ఆ ఎక్స్పీరియన్స్ చేసినప్పుడే బాగుంటాయని తెలిపారు.మరో 20 రోజులలో ఈ సినిమా నుంచి ఇంకొక టీజర్ విడుదల చేస్తామని తప్పకుండా ప్రతి ఒక్కరూ ఈ టీజర్ చూసి సంతోష పడతారు అంటూ తెలియచేశారు .
ఇకపోతే ఈ టీజర్ పై ప్రముఖ నిర్మాత నటుడు తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు. ఆది పురుష్ టీజర్ చూశాను. ప్రభాస్ సినిమా అంటే వాడి వేడిగా ఉంటుంది పైగా 500కోట్ల బడ్జెట్ అంటే సినిమా భారీ స్థాయిలో ఉంటుందని ఊహించాను అయితే ఈ సినిమా ఒక యానిమేషన్ సినిమా లాగా ఉందని ఈయన తెలియజేశారు. ఈ సినిమా టీజర్ పై వస్తున్న విమర్శలపై ఇప్పటికే చిత్ర బృందం స్పందించారు.
ఇదివరకే చిత్ర బృందం ప్రెస్‌మీట్ ప్రొడ్యూసర్, డైరెక్టర్, హీరో సినిమాని 3డీలో చూడాలని చెబుతున్నారు. 3డీ అయినా ఫోర్ డి అయిన యానిమేషన్ కి లైవ్ కి చాలా తేడా ఉంటుంది. రాముడిని దేవుడిలా భావించే ఈ దేశంలో రాముడి గెటప్ మార్చేయడం చాలా విచిత్రంగా ఉంది. రావణాసురుడు కూడా బ్రాహ్మణుడు ఆయనకు కూడా మన భారతదేశంలో దేవాలయాలు ఉన్నాయి.20 రోజులలో మొత్తం మారుతుందని చిత్ర బృందం చెబుతున్నారు నిజంగానే ఆ మార్పులు చేసి సినిమాని మంచిగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ఈయన తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ చిత్ర బృందానికి ఆల్ ద బెస్ట్ తెలియజేశారు
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…