Movie News

Bigg Boss6: నాగార్జున గారు బిగ్ బాస్ పై చూపే శ్రద్ధ సినిమాలపై పెట్టండి… అక్కినేని ఫ్యాన్స్ హెచ్చరిక!

Bigg Boss6: తెలుగు బుల్లితెరపై అత్యధిక రేటింగ్ సొంతం చేసుకొని ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్న కార్యక్రమాలలో బిగ్ బాస్ రియాలిటీ షో ఒకటి. ఈ కార్యక్రమం తెలుగులో ఇప్పటికే ఐదు సీజన్లను పూర్తి చేసుకొని ఆరవ సీజన్ ప్రసారమవుతుంది. ఇకపోతే ఈ కార్యక్రమం గురించి మొదటి నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్న విషయం మనకు తెలిసిందే.

ఈ షో నిలిపివేయాలని ఇలాంటి కార్యక్రమాల వల్ల ఎవరికి పెద్దగా ప్రయోజనం లేదంటూ ఈ కార్యక్రమం పై తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. అందుకే ఈ కార్యక్రమాన్ని నిలిపివేయాలంటూ ప్రతి సీజన్లోనూ పెద్ద ఎత్తున పలువురు విమర్శలు చేస్తూ నిర్వాహకులను హెచ్చరిస్తున్నారు.ఇక సీజన్ సిక్స్ అయితే మరింత ఘోరంగా ఉంది. ఏమాత్రం ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయలేకపోతుందని అభిమానులు భావిస్తున్నారు.

ఇక ఈ కార్యక్రమంలో ప్రతి టాస్కులలో ఎవరు గెలుస్తారు? ఎవరెవరు ఎలిమినేట్ అవుతారు?కెప్టెన్ గా ఎవరు ఎంపిక అవుతారనే విషయాలు ముందుగానే తెలుసుకోవడం వల్ల పెద్దగా థ్రిల్ అనిపించడం లేదు అంటూ చాలామంది ఈ కార్యక్రమం పై విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగా అక్కినేని అభిమానులు నాగార్జునకు చిన్నపాటి హెచ్చరికలను కూడా జారీ చేస్తున్నారు.

Bigg Boss6: అన్ని ముందే లీక్ అయితే థ్రిల్ ఏముంటుంది…

సినిమా ఇండస్ట్రీలో ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నాగార్జున ఇలాంటి కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరిస్తూ పెద్ద ఎత్తున విమర్శల పాలవడం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలోనే ఇలాంటి చెత్త షోలకు యాంకర్ గా వ్యవహరించడం కన్నా ఈ షోపై పెట్టే దృష్టి సినిమాలపై పెట్టండి అంటూ నాగార్జునకు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి షో వల్ల ఎవరికి పెద్దగా ఉపయోగం లేదని ఈ షో పట్ల అక్కినేని అభిమానులు సైతం ఎంతో నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 weeks ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 weeks ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 weeks ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 weeks ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 weeks ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

4 weeks ago