Mokshagna: టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఈయనతో పాటు హీరోలుగా ఇండస్ట్రీలో కొనసాగిన పలువురు హీరోల కుమారులు ఇప్పటికే ఇండస్ట్రీలోకి వారసులుగా ఎంట్రీ ఇచ్చారు.ఈ క్రమంలోనే నందమూరి అభిమానులు మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
ఇదిగో అదిగో అంటూ మోక్షజ్ఞ సినీ ఎంట్రీ గురించి ఊరిస్తున్నారు తప్ప ఈయన సినిమాల గురించి ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఇకపోతే తాజాగా ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి మోక్షజ్ఞ సినీ ఎంట్రీ గురించి చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే ఎంతోమంది సినీ సెలబ్రిటీల జీవితాల గురించి కామెంట్స్ చేసిన వేణు స్వామి తాజాగా మోక్షజ్ఞ సినీ పొలిటికల్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఈ సందర్భంగా వేణు స్వామి మాట్లాడుతూ.. తాను మోక్షజ్ఞ జాతకం చూశానని, ఈయన జాతకం ప్రకారం ఇండస్ట్రీలో తన కెరియర్ ఎంతో అద్భుతంగా ఉంటుందని తెలిపారు. తన కెరీర్ మొత్తం ఇండస్ట్రీలోనే కొనసాగుతుందని,అయితే ఈయన ఇండస్ట్రీలోకి అడుగు పెట్టడానికి మరో మూడు సంవత్సరాల సమయం పడుతుందంటూ వేణు స్వామి తెలిపారు.
సినిమా ఇండస్ట్రీలో ఆయన కెరియర్ ఎంతో అద్భుతంగా ఉంటుంది అయితే ఈయన జాతకం ప్రకారం ఈయనకు రాజకీయ యోగం లేదని ఇతను రాజకీయాలకు దూరంగా ఉంటారని వేణు స్వామి తెలిపారు.ఇలా మోక్షజ్ఞ గురించి ఈయన చేసినటువంటి కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి మోక్షజ్ఞ విషయంలో ఈయన జాతకం ఎంతవరకు నిజమవుతుంది అనేది తెలియాల్సి ఉంది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…