Movie News

Neelima Guna: ఘనంగా నిశ్చితార్థం జరుపుకున్న గుణశేఖర్ కుమార్తె నీలిమ గుణ.. వైరల్ అవుతున్న ఫోటో!

Neelima Guna: టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడిగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు గుణశేఖర్. పౌరాణిక చిత్రాలను తెరకెక్కించడంలో గుణశేఖర్ దిట్ట. ఇలా గుణశేఖర్ దర్శకత్వంలో ఎన్నో అద్భుతమైన సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇకపోతే ఈయన దర్శకత్వం వహించే సినిమాలకు ఈయన పెద్ద కుమార్తె నీలిమ గుణ నిర్మాతగా వ్యవహరించారు.

నీలిమ గుణ ఇదివరకే రుద్రమదేవి సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు. ఇక తాజాగా సమంత నటించిన శాకుంతలం సినిమాకి కూడా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.ఇలా ఇండస్ట్రీలో నిర్మాతగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నీలిమ గుణ సరికొత్త బంధంలోకి అడుగుపెట్టబోతుందని తెలుస్తోంది.

ఈ క్రమంలోనే ఈమె నిశ్చితార్థం ఎంతో ఘనంగా జరిగినట్లు తెలుస్తోంది.తన నిశ్చితార్థ ఫోటోలను నీలిమ గుణ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకొని జీవితాంతం సాగే కొత్త ప్రయాణం మొదలైంది అంటూ క్యాప్షన్ జోడించారు.ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో నీలిమ గుణ పెళ్లి చేసుకోబోయే వ్యక్తి ఎవరు అనే విషయంపై అభిమానులు పెద్ద ఎత్తున చర్చలు జరుపుతున్నారు.

Neelima Guna:  త్వరలోనే పెళ్లి తేదీ ప్రకటన..

ఇక నీలిమ గుణ పెళ్లి చేసుకోబోయే వ్యక్తి పేరు రవి ప్రఖ్యా అని మాత్రమే తెలుస్తుంది. ఆయన ఏం చేస్తారు తన ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ ఏంటి అనే విషయాలు మాత్రం తెలియడం లేదు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది నెటిజన్లు కాబోయే దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక త్వరలోనే వీరి పెళ్లి తేదీని కూడా ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది.నీలిమ గుణ నిర్మాతగా వ్యవహరించిన శాకుంతలం సినిమా నవంబర్ 4వ తేదీ విడుదల కానున్నట్లు ప్రకటించారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

రాజకీయాల్లోకి రాఘవ లారెన్స్.. తమిళనాడులో కొత్త చర్చకు తెర..

తమిళ సినీ పరిశ్రమలో నటుడు, దర్శకుడు, కొరియోగ్రాఫర్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రాఘవ లారెన్స్ ఇప్పుడు రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నట్లు ప్రకటించడం…

17 minutes ago

బంగారం కొనాలనుకునేవారికి షాక్.. ఒక్కరోజులోనే భారీ పెరుగుదల!

హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు మరోసారి పెరగడంతో కొనుగోలుదారులు ఆందోళన చెందుతున్నారు. గత కొద్ది రోజులుగా తగ్గుదల దిశగా…

24 minutes ago

రెండేళ్ల జ్ఞానేశ్వరి ఎక్కడ? తునిలో మిస్టరీగా మారిన చిన్నారి అదృశ్యం..

కాకినాడ జిల్లాలోని తుని మండలం సీహెచ్ అగ్రహారంలో అదృశ్యమైన రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి కేసు రోజురోజుకూ మరింత ఉత్కంఠ రేపుతోంది.…

36 minutes ago

వేప ఆకులకే కాదు.. వేప పండుకూ ఔషధ గుణాల ఖజానా.!

భారతీయ సంప్రదాయ వైద్యంలో వేప చెట్టుకు ప్రత్యేక స్థానం ఉంది. తరతరాలుగా వేప ఆకులు, పువ్వులు, బెరడు, గింజలను అనేక…

23 hours ago

సిజేరియన్ తర్వాత కిడ్నీ ఫెయిల్యూర్.. అసలు కారణం ఇదేనా?

దేశవ్యాప్తంగా ఇటీవల సిజేరియన్ ప్రసవాలకు సంబంధించిన కొన్ని ఘటనలు చర్చనీయాంశంగా మారాయి. రాజస్థాన్‌లోని కొన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం అనంతరం…

23 hours ago

జూన్ 17 తర్వాత ధనయోగం జోరు.. ఈ రాశుల జీవితంలో భారీ మార్పు!

జూన్ నెలలో గ్రహాల సంచారాలు జ్యోతిష్య పరంగా ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ముఖ్యంగా జూన్ 17న చంద్రుడు కర్కాటక రాశిలోకి…

2 days ago