Pruthvi : సినిమాలతో మొదలు పెట్టి సీరియల్స్ లోకి వెళ్లి తమిళ సీరియల్స్ తో బాగా ఫేమస్ అయిన పృథ్వీ తెలుగులో మాత్రం పెళ్లి సినిమాతో వచ్చిన ఫేమ్ వల్ల పెళ్లి పృథ్వీగా పేరు తెచ్చుకున్నాడు. పెళ్లి సినిమా కంటే ముందే పృథ్వీ తెలుగులో సినిమాలు చేసినా మళ్ళీ సమర సింహ రెడ్డి, మన్మధుడు, చెన్నకేశవ రెడ్డి వంటి సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్నాడు. హీరోగానే నటించాలనే నియమేమి పెట్టుకోకుండా ఇతర హీరోల సినిమాలలో కూడా నటించాడు పృథ్వీ. ఇక వ్యాపారల్లో, సినిమా ప్రొడక్షన్ లో వేలు పెట్టి చాలా డబ్బు నష్టపోయానని ఆయన అనుభవాలను ఇటీవల ఇంటర్వ్యూల్లో పంచుకున్నారు.
శంభో శివ శంభో తో హిట్ కొట్టాడు…
పెళ్లి సినిమాతో తెలుగులో కూడా మంచి స్టార్ డమ్ తెచ్చుకున్న పృథ్వీ ఆ తరువాత వెనక్కి తిరిగి చూసుకోలేదు అప్పటి వరకు బబ్లు పృథ్వీ గా ఉన్న పృథ్వీ పెళ్లి పృథ్వీ గా పేరు మారిపోయింది. రఘువరన్, సముద్ర ఖని వంటి స్నేహితులు మొదట్నుంచి పృథ్వీ రాజ్ కు ఉన్నారు. ఇక సముద్ర ఖని అప్పటికే సీరియల్స్ కి డైరెక్టర్ గా ఉండగా ఆయనతో సినిమా చేశాడు. అయితే ఆ సినిమా కాస్తా డిజాస్టర్ అయింది. అయితే సముద్ర ఖని అలా నాలుగు సినిమాలను ఫ్లాప్ చేసాక ఐదో సినిమాగా తీసిన ‘శంభో శివ శంభో’ సూపర్ హిట్ అయింది. ఆ నాలుగు సినిమాలు తీసిన తాను పెద్ద డైరెక్టర్ అనుకోకుండా మళ్ళీ అసిస్టెంట్ డైరెక్టర్ గా వెళ్లి సినిమా మీద పట్టు పెంచుకుని శంభో శివ శంభో సినిమా తీసాడు అంటూ సముద్ర ఖని గురించి పృథ్వీ చెప్పారు.
బాలచందర్ పని చేసిన చేయకున్నా కొట్టేవాడు…
కే బాలచందర్ గారి సినిమాలో నటించిన ఎవరైనా చెప్పే మాట ఆయన కొడతాడు అని అలానే పృథ్వీ గారు కూడా కొట్టించుకున్నారట. సినిమా షూటింగ్ సమయంలో ఆయన చెబుతుంటే దాన్ని అర్థం చేసుకుని చేస్తూ ఉండాలి, డైలాగు ఒక వైపు మర్చిపోకూడదు. అలానే మన కదలికలు ఇలానే ఉండాలని చెబుతారు అది అలానే ఉండాలి. ఇక ముఖం లోని హావభావాలు సరిగ్గా ఉండాలి టేక్ తీసుకున్నప్పుడు అంతా వచ్చి కొడుతూ బాగా చేయి అని చెప్తారు. ఒకవేళ బాగా చేసినా వచ్చి కొట్టి బాగా చేసావ్ రా అని అంటారు. కానీ ఆయన కొట్టినపుడు మనకు చిన్నతనంగా అవమానంగా అనిపించదు బాగా చేయాలనే కసి మాత్రమే పెరుగుతుంది. ఆయన ఒకరిని కించపరిచేలా మాట్లాడరు కేవలం మన నుండి ఆయనకు కావాల్సిన అవుట్ పుట్ మాత్రమే తెచ్చుకుంటారు అంతే అని పృథ్వీ గారు బాలచందర్ గారి గురించి చెప్పారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…