Featured

Janardhan rao : తనికెళ్ళ భరణిని చూస్తే ఈర్ష్య ఏడుపు వచ్చేది… ఎల్బి శ్రీరామ్ తో కలిసి పర్లేదంటారా : జనార్దన్ రావు

Janardhan rao : తెలుగు సినిమాల్లో కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో నటించిన పోలాప్రగఢ జనార్దన్ రావు గారు తన సినిమా విశేషాలను ఇటీవల ఇంటర్వ్యూలో పంచుకున్నారు. జెన్నీ గా బాగా ప్రచుర్యం పొందిన ఈయన సినిమాలే కాకుండా పలు సీరియల్స్ లో కూడా నటించారు. ECIL లో  అసిస్టెంట్ డైరెక్టర్ గా, పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్సు లో కూడా పని  చేసారు. ఒక 3 నెలల పాటు యాక్టింగ్ కోర్స్ కుడా చేసిన ఈయన ఆ అనుభవంతో ఎన్నో చిత్రాలలో, సీరియల్స్ లో మరియు ఎన్నో వేల స్వదేశీ, విదేశీ సినిమా కార్యక్రమాలలో పాల్గొన్నారు. అనేక నాటకాలో నటించి పేరు తెచ్చుకున్న జెన్నీ గారు నంది అవార్డ్స్ జ్యురిలో మెంబెర్ గా కూడా పనిచేశారు.

తనికెళ్ళ భరణి అంటే ఈర్ష్య వచ్చేది…

ఉద్యోగం చేస్తూనే జ్యోతిర్మయి అనే నాటక సంఘం లో ఉండి నాటకాలను వేసేవారట జెన్నీ గారు. అయన సహా ఉద్యోగులు అదే సమయంలో తనికెళ్ళ భరణి గారు రాళ్లపల్లి గారు స్థాపించిన నాటక సంఘం ద్వారా నాటకాలను వేసేవారట. నాటక పోటీలను నిర్వహించే కళాభారతి లో నాటకాల పోటీలకు వెళితే తనికెళ్ళ భరణి వాళ్ళ గ్రూప్ కి అన్ని బహుమతులు రావడం వల్ల ఈర్ష్య, దుఃఖం కలిగేవి అంటూ అయన తాజాగా ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు. అందుకే రాళ్లపల్లి గారి నాటకాలు సంఘంలో చేరి దగ్గరగా తనికెళ్ళ భరణి వాళ్ళ గ్రూప్ నటన చూసి నేర్చుకోవచ్చు అని అక్కడే చేరి ఎన్నో వందల నాటకాలను వేశాను అంటూ చెప్పారు.

ఎల్బి శ్రీరామ్ గారు కథలను రాయినుంచేవారు…

అనేక రచనల ఆధారంగా ఎల్బి శ్రీరామ్ గారు కథలను రాసేవారు. ఇప్పటికే వందల షార్ట్ స్టోరీస్ రాసిన ఆయన ఎపుడైనా నన్ను కథ రాయమనేవారు. నాకు స్క్రిప్ట్ రాయడం రాదంటే నువ్వు కథ రాసి ఇవ్వు నేను మిగతాది చూసుకుంటా, నేనే కథ రాస్తే అందులో నా పాత్రకు ఎక్కువ ప్రముఖ్యత తెలియకుండానే ఇస్తాను అందుకే నువ్వు రాయి అని చెప్పేవారట. అలా ఒకసారి ఎల్బి శ్రీరామ్ గారి సొంతూరు లో ఒక నాటకం ప్రదర్శించాలి అనుకున్నారు. అనకాపల్లి దగ్గర ఆయన స్వస్థలం, ఆయన తండ్రి వేద పండితులు కావడం వల్ల ఆయన మరణించాక అక్కడ ప్రతిఏడాది వేద పండితులను సన్మానిస్తారు. అలా ఆ సందర్బంగా నాటకం వేయాలనుకున్నపుడు ఆ ఊర్లో ధనవంతుడైన ఒక పెద్ద మనిషికి నాటక పిచ్చి ఉండటం వల్ల ఆయనకు ఒక పాత్ర సృష్టించమని అడిగారు. నాకు ఎలా రాయాలో తెలియడం లేదు అంటే నేను సూచనలు ఇస్తాను నువ్వు రాయి అని చెప్పి ఆ దొరబాబు గారి ఊతపదం పర్లేదంటారా అన్న పదాన్ని వాడుతూ రాసాను. అలా ఆయన నా చేత కథలను రాయించేవారు. హలో బ్రదర్ వంటి సినిమాలకు ఆయనే రైటర్ అంటూ జెన్నీ చెప్పారు.

Bhargavi

Recent Posts

నడుము నొప్పి బాధిస్తుందా? గంటల తరబడి కూర్చోవడం ప్రమాదం.. బ్యాక్ పెయిన్ తగ్గించే సింపుల్ టిప్స్!

నేటి వేగవంతమైన జీవనశైలిలో నడుము నొప్పి ఒక సాధారణ సమస్యగా మారుతోంది. ముఖ్యంగా రోజంతా కంప్యూటర్ ముందు కూర్చుని పనిచేసే…

3 hours ago

డెంగీ నుంచి రక్షణకు సింపుల్ టిప్స్.. ప్రతి ఇంటికి అవసరమైన అవగాహన!

నేటి పట్టణ జీవనశైలిలో డెంగీ ప్రమాదం కొత్త రూపం దాల్చుతోంది. ఒకప్పుడు మురుగు నీరు, చెత్త ప్రదేశాలు ప్రధాన కారణాలుగా…

4 hours ago

సాయికుమార్ తల్లి డైరీలో షాకింగ్ విషయం.. రాజశేఖర్ ఎమోషనల్..!

సీనియర్ నటుడు రాజశేఖర్ తన సినీ ప్రయాణం, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అనేక ఆసక్తికర విషయాలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో…

4 hours ago

వేసవిలో బెస్ట్ కూర ఇదే.. శరీరానికి చల్లదనం, రుచికి అదిరిపోయే టేస్ట్!

ఇంటి వంటల్లో రుచితో పాటు ఆరోగ్యం కూడా కలగాలంటే సీజనల్ కూరగాయలతో తయారయ్యే వంటకాలకు ప్రాధాన్యం ఇవ్వాలని పోషకాహార నిపుణులు…

4 hours ago

జయంతి వేడుకలతో విజయవాడలో భక్తి వాతావరణం.. ఆలయానికి భారీగా తరలి వచ్చిన భక్తులు!

ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలో జగద్గురు ఆదిశంకరుల జయంతి ఉత్సవాలు మంగళవారం వైభవంగా నిర్వహించబడ్డాయి. వైశాఖ…

4 hours ago

పడుకునే ముందు ఈ నీళ్లు తాగితే ఆరోగ్యంలో మార్పులు స్పష్టమే!

ప్రస్తుత జీవనశైలిలో ఆరోగ్య సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో సహజ పదార్థాలపై మళ్లీ దృష్టి పెడుతున్నారు చాలా మంది. మన వంటింట్లో…

4 hours ago