Tag Archives: environment pollution

Allu Arjun: మొక్కలకు నీళ్లు పోస్తూ పర్యావరణాన్ని కాపాడుకుందాం అంటున్న బన్నీ… ఫోటో వైరల్!

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప2 సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా ఈ సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈయన నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం కావడంతో ఇంట్లో మొక్కలను నాటి మొక్కలకు నీళ్లు పడుతూ అందరికీ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయడమే కాకుండా పర్యావరణాన్ని కాపాడాలంటూ ఈయన సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.

అల్లు అర్జున్ సినిమాల పరంగా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ కొన్ని ప్రత్యేకమైన రోజుల పట్ల ఆయన స్పందిస్తూ ఇలా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే జూన్ 5వ తేదీ ప్రపంచ పర్యావరణ దినోత్సవం కావడంతో అల్లు అర్జున్ తన ఇంటి ఆవరణంలో కొత్త మొక్కలను నాటడమే కాకుండా ఆ మొక్కలకు నీళ్లు పడుతూ ఉన్నటువంటి ఫోటోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.

ఈ విధంగా అల్లు అర్జున్ ఈ ఫోటోని షేర్ చేస్తూ హ్యాపీ ఎన్విరాన్మెంట్ డే అని శుభాకాంక్షలు చెబుతూ…మనమందరం మన బాధ్యతగా పర్యావరణాన్ని కాపాడుకుందాం అంటూ అందరికీ స్ఫూర్తిని కలిగించేలా ఈ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇలా కొన్ని ప్రత్యేకమైన రోజులలో అల్లు అర్జున్ స్పందించడమే కాకుండా ఇదే అలవాట్లను తన పిల్లలకు కూడా తెలియజేస్తూ వారిని కూడా అలాగే పెంచారు.

Allu Arjun: ప్రకృతిని కాపాడుకుందాం…’


ఇక పలు సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నప్పటికీ ఈయన మాత్రం షూటింగ్ సమయంలో ఏమాత్రం విరామం దొరికిన తన భార్య పిల్లలతో కలిసి ఆ సమయాన్ని గడపడానికి ఎంతో ఇష్టపడుతుంటారు.ఇలా తన ఫ్యామిలీతో సరదాగా గడుపుతున్నటువంటి ఆ మధురమైన క్షణాలన్నింటిని కూడా ఈయన సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకోవడంతో ఈయనకు సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయిందనే చెప్పాలి.

కాలుష్యం ఎఫెక్ట్.. 9 ఏళ్ళ బాలిక మృతి..?

సాధారణంగా ప్రతి రోజూ మనం ఎన్నో మరణవార్తను గురించి వినే ఉంటాం. అందులో అనారోగ్య సమస్యల వల్ల, ఆర్థిక ఇబ్బందుల వల్ల, కుటుంబ సమస్యల కారణంగా ఎంతోమంది మరణించిన సంఘటనలు ఎన్నో చూసాం. కానీ ఇంగ్లాండ్ లో మాత్రం వింత మరణం సంభవించింది. కేవలం కాలుష్యం కారణంగా 9 సంవత్సరాల బాలిక తన ప్రాణాలను కోల్పోయినట్లు దర్యాప్తులో తేలింది.పూర్తి వివరాలతో వెళ్తే…

 

ఇంగ్లండ్‌లో ఓ బిజీ రోడ్డు పక్కనే ఉన్న ఇంట్లో నివసించే అడూ కిస్సి డెబ్రా అనే 9ఏళ్ల బాలిక కాలుష్యం కారణంగా మృతి చెందినట్లు స్థానిక కరోనర్ అధికారి  లెలిపారు. తాను నివాసముండే ఇల్లు రోడ్డు పక్కనే ఉండడంతో ఎప్పుడూ ఎంతో రద్దీగా ఉండే ఆ రోడ్డు నుంచి వెళ్లే వాహనాల ద్వారా ఎక్కువ కాలుష్యం అవడంతో తరచూ డెబ్రా ఆస్తమాకు గురయ్యేది. ఆస్తమాతో బాధపడుతున్న తనను ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. కానీ ఆ బాలికకు ఎందుకు అలా అవుతుందో అనే విషయం గురించి ఎవరు ఆరా తీయకపోవడంతో చివరికి తాను మరణించింది.

2013లో డెబ్రాకు ఆస్తమా ఎటాక్ రావడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆసుపత్రికి వెళ్లినప్పటికీ కూడా ఎలాంటి ఫలితం లేకపోవడంతో డెబ్రా మరణించింది. ఆ బాలిక మృతిపై దర్యాప్తు చేస్తున్న అధికారులు కాలుష్యం కారణంగా ఆమె మృతి చెందినట్లు దర్యాప్తులో వెల్లడించారు.చరిత్రలోనే తొలిసారిగా ఇలా కాలుష్యం కారణంగా మరణించినట్లు తేలడంతో కాలుష్యం పై ఎన్నో ఉద్యమ సంఘాలు దండెత్తి ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు వాయు కాలుష్యం పై చర్యలు చేపట్టాలని అధికారులను డిమాండ్ చేశారు.

డెబ్రా నివసించే ప్రాంతంలో వాహనాలు ఎక్కువగా తిరగడం వల్ల, వాహనాల నుంచి వెలువడే నైట్రోజన్ వాయువులు పీల్చుకోవడం ఆ బాలిక మృతి చెందినట్లు పేర్కొన్నారు. ఈ వాయు కాలుష్యం వల్ల డెబ్రావంటి ఎంతోమంది ఆస్తమా పేషెంట్లకు తీవ్ర సమస్యలు తలెత్తుతాయని ఇప్పటికైనా అధికారులు మేల్కోవాలి అని పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు.