Tag Archives: first remuneration

Niharika: నిహారిక ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా… దానితో ఏం చేసిందంటే?

Niharika: మెగా డాటర్ నిహారిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు యాంకర్ గా ఇండస్ట్రీకి పరిచయమైనటువంటి నిహారిక ప్రస్తుతం హీరోయిన్ గాను నిర్మాతగాను కొనసాగుతూ ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇలా కెరియర్ పరంగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నటువంటి నిహారిక ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు..ఈ ఇంటర్వ్యూ సందర్భంగా నిహారిక తనకు సంబంధించిన ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకున్నారు.

నిహారిక తన తండ్రి నాగబాబు సపోర్టుతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. అయితే కెరియర్ మొదట్లో ఈమె ఈటీవీలో ప్రసారమవుతున్నటువంటి ఢీ డాన్స్ షో కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఇలా పలు సీజన్లకు నిహారిక యాంకర్ గా వ్యవహరిస్తూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

ఇక తాజాగా ఈ ఇంటర్వ్యూ సందర్భంగా తన ఫస్ట్ రెమ్యూనరేషన్ గురించి ఈమె ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తాను ఈ కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరిస్తున్న సమయంలో ఒక్కో ఎపిసోడ్ కి 20వేల రూపాయల వరకు తనుకు రెమ్యూనరేషన్ ఇచ్చే వారని తెలిపారు. అప్పట్లో ఆ రెమ్యూనరేషన్ అంటే తక్కువ ఏం కాదని చెప్పాలి.

అమ్మానాన్నలకు గిఫ్ట్…
ఇలా ఇచ్చిన రెమ్యూనరేషన్ నేను నాన్నకు ఇచ్చే దానిని నాన్న వాటిని డిపాజిట్ చేసి పెట్టారని నిహారిక తెలిపారు. ఇక నాకు వచ్చినటువంటి మొదటి రెమ్యూనరేషన్ తో అమ్మానాన్నలకు కూడా గిఫ్ట్ ఇచ్చానని ఈమె తెలిపారు నాన్నకు పాటలు వినడం అంటే చాలా పిచ్చి అందుకే నాన్న కోసం హెడ్ ఫోన్స్ కొన్నానని ఆయన మొబైల్ లో పాటలు వింటూ రిలాక్స్ అయ్యే వారిని తెలిపారు. అమ్మకు ముక్కు పుడక అంటే చాలా ఇష్టం కావడంతో తనకు గోల్డ్ ముక్కుపుడక గిఫ్ట్ గా ఇచ్చానని నిహారిక తెలిపారు.

Rakul Preeth singh: రకుల్ ప్రీత్ సింగ్ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

Rakul Preeth singh: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి వారిలో నటి రకుల్ ప్రీతి సింగ్ ఒకరు. ఈమె కెరటం సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమై వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమా ద్వారా మంచి సక్సెస్ అందుకున్నారు. ఇలా వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమా తర్వాత ఈమెకు తెలుగులో స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలు వచ్చాయి.

ఈ విధంగా స్టార్ హీరోలు అందరి సరసన నటిస్తూ ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి రకుల్ కేవలం తెలుగు సినిమాలో మాత్రమే కాకుండా తమిళ్ కన్నడ బాలీవుడ్ సినిమాలలో కూడా అవకాశాలను అందుకుంటు స్టార్ హీరోయిన్గా సక్సెస్ అయ్యారు. ఇకపోతే రకుల్ తాజాగా కొత్త జీవితంలోకి అడుగు పెట్టబోతున్న సంగతి మనకు తెలిసిందే. గత రాత్రి నుంచి ఈమె పెళ్లి వేడుకలు గోవాలో ఎంతో ఘనంగా ప్రారంభమయ్యాయి.

బాలీవుడ్ నటుడు నిర్మాత జాకీ భగ్నానితో రకుల్ వివాహం ఎంతో అంగరంగ వైభవంగా జరగబోతోంది ప్రస్తుతం ఈమె పెళ్లి వేడుకలు ప్రారంభమయ్యాయి అని తెలుస్తుంది. ఇదిలా ఉండగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి రకుల్ తన రెమ్యూనరేషన్ గురించి చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. రకుల్ ప్రస్తుతం ఒక్కో సినిమాకు సుమారు 3 కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటున్నారు.

ఈ స్థాయికి రావడానికి వారే కారణం..

ఇలా ఒక్కో సినిమాకు మూడు కోట్లకు పైగా రెమ్యూనరేషన్ తీసుకునే రకుల్ తన కెరియర్ మొదట్లో ఐదు వేల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్నారని తెలుస్తుంది. ఈమె హీరోయిన్ కాకముందు మోడలింగ్ రంగంలో అడుగు పెట్టారు ఇలా మోడల్ గా కొనసాగుతున్న సమయంలో తనకు 5000 రూపాయల రెమ్యూనరేషన్ ఇచ్చారని అదే తన ఫస్ట్ రెమ్యూనరేషన్ అని తెలిపారు. ఇలా 5000 నుంచి ఈ స్థాయికి చేరుకున్నాను అంటే అందుకు కారణం నా తల్లితండ్రులు స్నేహితులు ప్రేక్షకులు అంటూ రకుల్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

చిన్న వయస్సులో తండ్రి చనిపోతే కన్నీళ్లు రాలేదు.. అమ్మ, అక్కని ఎలా చూసుకోవాలనే ఆలోచించా.. : ఎస్.ఎస్.తమన్

ఎస్.ఎస్.తమన్ ఈ పేరు గురించి తెలియని వారు ఎవరూ ఉండరు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన సినిమాలకు సంగీతం అందిస్తూ ప్రస్తుతం ఎంతో బిజీగా ఉన్న బాలకృష్ణ నటించిన అఖండ సినిమాతో అద్భుతమైన విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. అఖండ సినిమా సూపర్ హిట్ అవడానికి గల కారణం తమన్ పాత్ర కూడా ఎంతో ఉందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

ఈ సినిమా కోసం ఆయన అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ప్రతి ఒక్క ప్రేక్షకుడిలో పూనకాలు తెప్పించే విధంగా ఉన్నాయి. ఇదిలా ఉండగా తాజాగా ఎస్.ఎస్.తమన్ ఆలీతో సరదాగా కార్యక్రమంలో పాల్గొని తన గురించి ఎన్నో విషయాలను పంచుకున్నారు. ఈ క్రమంలోనే ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేయడంతో ఇది కాస్త వైరల్ గా మారింది.

ఈ క్రమంలోనే అలీ ఎన్నో ప్రశ్నలు అడుగుతూ అతని దగ్గర నుంచి సమాధానాలు రాబట్టారు. ఎస్.ఎస్.తమన్ కేవలం ఆరవ తరగతి వరకు మాత్రమే చదువుకున్నారని అప్పటికే తన తండ్రి చనిపోవడంతో తన కంటి నుంచి ఒక కన్నీటి చుక్క కూడా రాలేదని తన తల్లి, అక్కను ఎలా చూసుకోవాలనేది తన మైండ్లో నిలిచిపోయిందని ఈ సందర్భంగా చెప్పారు. ఇక అప్పుడు తన తండ్రి ఎల్ఐసి పాలసీ ద్వారా 60000 రావడంతో ఆ డబ్బుతో డ్రమ్స్ కొనుక్కొని ఇలా ఇండస్ట్రీ వైపు అడుగులేసాను అని తెలిపారు.

చిన్నప్పటి నుంచి తనకు సంగీతం అంటే ఎంతో ఇష్టమని స్కూల్లో కూడా ఎప్పుడు డ్రమ్స్ కొడుతూ ఉంటే టీచర్స్ ఎక్కువగా నన్ను బయట నీల్ డౌన్ చేయించేవారని తెలిపారు. అదే సమయంలో నాన్న చనిపోవడంతో చదువు పూర్తిగా పక్కన పెట్టి సంగీతం వైపు వెళ్లానని బాలకృష్ణ నటించిన భైరవ ద్వీపం సినిమాకు డ్రమ్స్ వాయించానని ఈ సందర్భంగా తమన్ తెలిపారు. ఈ సినిమాలో చేసినందుకు తనకు 30 రూపాయలు శాలరీ ఇచ్చేవారని ఈ కార్యక్రమంలో తన మొదటి పారితోషికం గురించి తెలిపారు. అలా 2002లో బాలకృష్ణ భైరవద్వీపం ద్వారా పరిచయమయ్యి తిరిగి 20 సంవత్సరాలకు తనతో అఖండ సినిమా చేసే అవకాశం లభించిందని తెలిపారు.