Rakul Preeth singh: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి వారిలో నటి రకుల్ ప్రీతి సింగ్ ఒకరు. ఈమె కెరటం సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమై వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమా ద్వారా మంచి సక్సెస్ అందుకున్నారు. ఇలా వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమా తర్వాత ఈమెకు తెలుగులో స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలు వచ్చాయి.
ఈ విధంగా స్టార్ హీరోలు అందరి సరసన నటిస్తూ ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి రకుల్ కేవలం తెలుగు సినిమాలో మాత్రమే కాకుండా తమిళ్ కన్నడ బాలీవుడ్ సినిమాలలో కూడా అవకాశాలను అందుకుంటు స్టార్ హీరోయిన్గా సక్సెస్ అయ్యారు. ఇకపోతే రకుల్ తాజాగా కొత్త జీవితంలోకి అడుగు పెట్టబోతున్న సంగతి మనకు తెలిసిందే. గత రాత్రి నుంచి ఈమె పెళ్లి వేడుకలు గోవాలో ఎంతో ఘనంగా ప్రారంభమయ్యాయి.
బాలీవుడ్ నటుడు నిర్మాత జాకీ భగ్నానితో రకుల్ వివాహం ఎంతో అంగరంగ వైభవంగా జరగబోతోంది ప్రస్తుతం ఈమె పెళ్లి వేడుకలు ప్రారంభమయ్యాయి అని తెలుస్తుంది. ఇదిలా ఉండగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి రకుల్ తన రెమ్యూనరేషన్ గురించి చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. రకుల్ ప్రస్తుతం ఒక్కో సినిమాకు సుమారు 3 కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటున్నారు.
ఈ స్థాయికి రావడానికి వారే కారణం..
ఇలా ఒక్కో సినిమాకు మూడు కోట్లకు పైగా రెమ్యూనరేషన్ తీసుకునే రకుల్ తన కెరియర్ మొదట్లో ఐదు వేల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్నారని తెలుస్తుంది. ఈమె హీరోయిన్ కాకముందు మోడలింగ్ రంగంలో అడుగు పెట్టారు ఇలా మోడల్ గా కొనసాగుతున్న సమయంలో తనకు 5000 రూపాయల రెమ్యూనరేషన్ ఇచ్చారని అదే తన ఫస్ట్ రెమ్యూనరేషన్ అని తెలిపారు. ఇలా 5000 నుంచి ఈ స్థాయికి చేరుకున్నాను అంటే అందుకు కారణం నా తల్లితండ్రులు స్నేహితులు ప్రేక్షకులు అంటూ రకుల్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…