Niharika: మెగా డాటర్ నిహారిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు యాంకర్ గా ఇండస్ట్రీకి పరిచయమైనటువంటి నిహారిక ప్రస్తుతం హీరోయిన్ గాను నిర్మాతగాను కొనసాగుతూ ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇలా కెరియర్ పరంగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నటువంటి నిహారిక ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు..ఈ ఇంటర్వ్యూ సందర్భంగా నిహారిక తనకు సంబంధించిన ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకున్నారు.
నిహారిక తన తండ్రి నాగబాబు సపోర్టుతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. అయితే కెరియర్ మొదట్లో ఈమె ఈటీవీలో ప్రసారమవుతున్నటువంటి ఢీ డాన్స్ షో కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఇలా పలు సీజన్లకు నిహారిక యాంకర్ గా వ్యవహరిస్తూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
ఇక తాజాగా ఈ ఇంటర్వ్యూ సందర్భంగా తన ఫస్ట్ రెమ్యూనరేషన్ గురించి ఈమె ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తాను ఈ కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరిస్తున్న సమయంలో ఒక్కో ఎపిసోడ్ కి 20వేల రూపాయల వరకు తనుకు రెమ్యూనరేషన్ ఇచ్చే వారని తెలిపారు. అప్పట్లో ఆ రెమ్యూనరేషన్ అంటే తక్కువ ఏం కాదని చెప్పాలి.
అమ్మానాన్నలకు గిఫ్ట్…
ఇలా ఇచ్చిన రెమ్యూనరేషన్ నేను నాన్నకు ఇచ్చే దానిని నాన్న వాటిని డిపాజిట్ చేసి పెట్టారని నిహారిక తెలిపారు. ఇక నాకు వచ్చినటువంటి మొదటి రెమ్యూనరేషన్ తో అమ్మానాన్నలకు కూడా గిఫ్ట్ ఇచ్చానని ఈమె తెలిపారు నాన్నకు పాటలు వినడం అంటే చాలా పిచ్చి అందుకే నాన్న కోసం హెడ్ ఫోన్స్ కొన్నానని ఆయన మొబైల్ లో పాటలు వింటూ రిలాక్స్ అయ్యే వారిని తెలిపారు. అమ్మకు ముక్కు పుడక అంటే చాలా ఇష్టం కావడంతో తనకు గోల్డ్ ముక్కుపుడక గిఫ్ట్ గా ఇచ్చానని నిహారిక తెలిపారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…