Tag Archives: guntur district

Balakrishna: ఒక్కసారి మూడో కన్ను తెరిచానా అంతే…. ఆ ఎమ్మెల్యేకు బాలయ్య స్ట్రాంగ్ వార్నింగ్!

Balakrishna: నందమూరి నటసింహం బాలకృష్ణ వ్యక్తిత్వం గురించి ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఆయన ఏ విషయాన్ని మనసులో దాచుకోరు. అది మంచైనా చెడైనా కోపం అయినా ప్రేమైనా మొహం మీద చెప్పేయడం బాలకృష్ణ నైజం.ఇలా ఉన్నది ఉన్నట్టు మాట్లాడటం వల్ల ఈయన పలుమార్లు వివాదాలలో కూడా చికుకున్న సందర్భాలు ఉన్నాయి.

ఇలా ఏ విషయాన్ని ముక్కు సూటిగా మాట్లాడే బాలకృష్ణ తాజాగా అధికార పార్టీ ఎమ్మెల్యే పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇంతకీ ఏం జరిగిందనే విషయానికి వస్తే…ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా తెనాలిలోఎన్టీఆర్ శతజయంతి దినోత్సవాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బాలకృష్ణ ముఖ్య అతిథిగా వచ్చారు. ఈ కార్యక్రమంలో మహానటి సావిత్రి కుమార్తె అలాగే నాగిరెడ్డి కుమారుడు విశ్వనాథ్ రెడ్డిని ఎన్టీఆర్ అవార్డులతో సత్కరించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా బాలకృష్ణ మహానటి సావిత్రి గురించి అలాగే నాగిరెడ్డి గురించి ఎంతో గొప్పగా మాట్లాడారు అలాగే అధికార పార్టీ ఎమ్మెల్యే అయినటువంటి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి తనదైన స్టైల్ లో వారిని ఇచ్చారు. ఒక పబ్లిక్ ఈవెంట్లో భాగంగా వైయస్సార్సీపి కార్యకర్త భాస్కర్ రెడ్డి బాలకృష్ణ పాట పెట్టడంతో ఎమ్మెల్యే శ్రీనివాస రెడ్డి బాలయ్య పాట పెడతావా అంటూ తనని అవమానించారు దీంతో మనస్థాపానికి గురైన భాస్కర్ రెడ్డి ఆత్మహత్యాయత్నం చేశారు. అయితే అతనికి అందరూ నచ్చజెప్పి పంపించారు.

Balakrishna: చిటికేస్తే చాలు… జాగ్రత్తగా ఉండు

నరసరావుపేటలో నా పాట వేసారని వైసీపీ ఎమ్మెల్యే ఆ అభ్యర్థిని చానా ఇబ్బందులకు గురి చేశాడు. రాజకీయాలకు సినిమాలకు ముడి పెట్టద్దు.. సినిమాలను అన్ని పార్టీల వారు ఆదరిస్తున్నారు. అన్ని పార్టీల వాళ్ళు సినిమా చూస్తున్నారు అంటూ మాట్లాడటమే కాకుండా మధ్యలో ఒక్కసారి నేను మూడో కన్ను తెరిచానా…నా అభిమానులు ఒక్క చిటిక వేస్తే చాలు జాగ్రత్తగా ఉండు అంటూ ఎమ్మెల్యే శ్రీనివాస రెడ్డి పేరు ప్రస్తావించకుండా బాలయ్య తనదైన స్టైల్ లో తనకు వార్నింగ్ ఇచ్చారు.

Mehaboob Dil Se: గుంటూరులో మెహబూబ్‌ హోమ్‌ టూర్‌.. ! ఇల్లు ఎంత అద్భుతంగా ఉందో.. వీడియో వైరల్!

Mehaboob Dil Se: బిగ్ బాస్ షో అప్పటి వరకు కొంత మందికి తెలిసిన వ్యక్తులను ఏకంగా సెలబ్రెటీలుగా.. ఓవర్ నైట్ స్టార్లను చేస్తోంది. బిగ్ బాస్ ఇచ్చిన కిక్ తో వరసగా సినిమా, సీరియల్, రియాలిటీ షో ఆఫర్లు దక్కతున్నాయి. ఇప్పటికే వీజే సన్నీ.. సకలగుణాభిరామ పేరుతో ఓ సినిమా కూడా చేశారు.

Mehaboob Dil Se: గుంటూరులో మెహబూబ్‌ హోమ్‌ టూర్‌.. ! ఇల్లు ఎంత అద్భుతంగా ఉందో.. వీడియో వైరల్!

ఇక సోహెల్ కూడా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇస్తున్నాడు. ఇదిలా ఉంటే చాలా రోజులు కష్టాల్లో ఉన్నవారికి బిగ్ బాస్ ఉపశమనాన్ని ఇచ్చింది. వాళ్ల కలలకు రెక్కలు తొడిగింది. ఇలా తన కలను నెరవేర్చుకున్నాడు బిగ్ బాస్ కంటెస్టెంట్ మెహబూబ్ దిల్ సే.

Mehaboob Dil Se: గుంటూరులో మెహబూబ్‌ హోమ్‌ టూర్‌.. ! ఇల్లు ఎంత అద్భుతంగా ఉందో.. వీడియో వైరల్!

మెహబూబ్ కేవలం యూట్యూబర్ కే కాకుండా.. టాలెంటెడ్ యాక్టర్, డ్యాన్సన్ కూడా.  ఇల్లు కట్టుకోవాలనే తన కలను నెరవేర్చుకున్నాడు. బిగ్ బాస్ షో అతని కలకు పునాది వేసింది. దీనికి తోడు తనగా కుటుంబ కష్టార్జితం తోడు కావడంతో సొంతిళ్లును కట్టుకున్నాడు.

దుకాణాల కోసం రెంట్ కు ఇచ్చే విధంగా..

గుంటూర్ లో ఉన్న తన ఇళ్లును చూపిస్తూ హోం టూర్ చేశాడు. ఈ ఇల్లు కట్టడానికి 16 నెలలు పట్టిందని… కరోనా కారణంగా పనులు ఆలస్యం అయ్యాయని చెప్పుకొచ్చాడు. ఇంటి గ్రౌండ్ ఫ్లోర్ లో మూడు గదులు ఏర్పాటు చేసి దుకాణాల కోసం రెంట్ కు ఇచ్చే విధంగా నిర్మించారు. దీంతో గ్రౌండ్ ఫ్లోర్ లో చిన్న హాల్, కిచెన్, సింగిల్ బెడ్రూం మాత్రమే ఉన్నాయి. మొదటి అంతస్తులో కిచెన్, హాల్ తో పాటు విశాలమైన రెండు డబుల్ బెడ్రూంలను నిర్మించారు. మెహబూబ్ తన అభిరుచికి తగనట్లు కబోర్డ్, వాల్ పేపర్లను డిజైన్ చేయించుకున్నాడు.

మహిళపై సామూహిక అత్యాచారం.. వివాహానికి వెళ్లి తిరిగి వస్తుండగా దారుణం..

గుంటూరు జిల్లాలో మహిళపై సామూహిక అత్యాచారం జరిగింది. సత్తెనపల్లి మండలానికి చెందిన దంపతులు గుంటూరులో ఓ వివాహానికి హాజరై బైక్‌పై తిరిగి ఇంటికి వెళుతుండగా మేడికొండూరు అడ్డురోడ్డు సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దంపతులను అడ్డగించిన కొందరు దుండగులు భర్తపై దాడిచేసి ఆ తర్వాత కత్తులతో బెదిరించి మహిళను పొలాల్లోకి తీసుకుని వెళ్లి అక్కడ సామూహిక అత్యాచారం చేశారు.

ఈ సంఘటనపై బాధిత మహిళ అర్ధరాత్రి సత్తెనపల్లి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేయలేదు. అస్సలు ఈ విషయం గురించే పట్టించుకోలేదు. ఎందుకు ఫిర్యాదు తీసుకోరని సదరు మహిళ ప్రశ్నించగా.. ఘటన జరిగిన ప్రదేశం గుంటూరు అర్బన్‌ ఎస్పీ పరిధిలోకి వస్తుందని తమ పోలీస్‌స్టేషన్‌ గుంటూరు రూరల్‌ పరిధిలో ఉంటుందన్నారు. ఈ మాట విన్న సదరు మహిళకు ఎం చేయాలో అర్థం కాలేదు. ఈ విషయం తెలిసిన వారు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఘటన ఎక్కడ జరిగినా జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి.. కేసును సంబంధిత పోలీస్‌స్టేషన్‌కు బదిలీ చేస్తారు. ఇటువంటివి సినిమాల్లో.. నిజ జీవితంతో కూడా ఎన్నో ఘటనలు జరిగాయి. వార్తాలు కూడా వచ్చాయి. కానీ ఆ పోలీసులకు ఇలాంటి చిన్న విషయం కూడా తెలియకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని అని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనతో పోలీసులకు సెక్షన్లపై అవగాహన లేదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతన్నాయి. కష్టకాలంలో ఉన్న మహిళ వచ్చి ఫిర్యాదు చేస్తే.. తమ పరిధిలో కాదంటూ చెప్పడం కరెక్ట్ కాదని.. సాటి మనిషిగా కూడా ఆ సమయంలో సహాయం చేయాలనే ఆలోచన రావాలి.

అలాంటప్పుడే మనవత్వానికి విలువ ఉంటుంది. అలా కాకుండా.. ఫిర్యాదు తీసుకోకుండా.. ఆమె చెప్పే విషయాలను పట్టించుకోకుండా ఉండటంతో ఆ పోలీసుల తీరుపై విమర్శలు వస్తున్నాయి. జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేయాలన్న అవగాహన కూడా లేకుండా ఎలా విధులు నిర్వర్తసున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

భార్యాభర్తల మధ్య గొడవలో తల దూర్చాడు.. పాపం చివరకు ఇలా అయ్యింది..

మనం చిన్నతనం నుంచి పెద్దలు ఓ మాట చెబుతూ ఉంటారు.. అదేంటంటే.. భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి తలదూర్చకూడదని.. అలా చేస్తే.. చివరకు నష్టపోయేది మూడో వ్యక్తే. కానీ ఇక్కడ అతడికి ఈ విషయం తెలుసో.. లేక తెలిసే వాళ్లిద్దరి గొడవ మధ్యలో తల దూర్చాడో తెలియదు కానీ.. పాపం ప్రాణాలను కోల్పోయాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

గుంటూరు జిల్లాలోని మంగళదాస్‌నగర్‌ లో 2వ లైను చెందిన గోగులపాటి బెన్ని తన భార్యను తాగి వచ్చి ఎప్పుడూ వేధిస్తుండేవాడు. తాగి వచ్చి తన భార్యను విపరీతంగా.. ఎక్కడ పడితే అక్కడ కొడుతుంటాడు. ఇలా ఓ రోజు తాగుడు బంద్ చేయండంటూ తన భార్య నిలదీసింది. దీంతో తీవ్రంగా కోపం తెచ్చుకున్న అతడు ఆమెను ఇంకా ఎక్కువగా కొట్టడం మొదలు పెట్టాడు.

ఆ గొడవ అతి పెద్దదిగా తయారైంది. దీంతో ఆ గొడవను సరిదిద్దేందుకు ఇంటి పక్కనే ఉన్న శ్యాంసన, పక్కనే ఉన్న ఏచూరి సత్యనారాయణ(48)లు అక్కడకు వెళ్లారు. బెన్నీకి ఒక కుమారుడు జాన ఉన్నాడు. ఈ గొడవ జరుగుతుండగా అతడు అక్కడే ఉండి చూస్తున్నాడు. దీంతో గొడవ మధ్యలోకి వచ్చిన వాళ్లిద్దరిని అతడు తీవ్రంగా దూషించాడు. మా కుంటుం గొడవలోకి మీరెందుకు వచ్చారంటూ.. వాళ్లను తిట్టాడు. తల్లిదండ్రులు కొట్టుకుంటుంటే.. బొమ్మలా నిలబడి చూస్తున్నావా అంటూ వాళ్లు అతడిని నిలదీశారు.

దీంతో అతడికి కోపం వచ్చింది. ఇంట్లోకి వెళ్లి.. కత్తి పట్టుకొని వచ్చి క్షణికావేశంలో సత్యనారాయణను అతికిరాతంగా పొడిచాడు. దీంతో అతడిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అతడు అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూశాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని జానను అదుపులోకి తీసుకున్నారు.