Balakrishna: నందమూరి నటసింహం బాలకృష్ణ వ్యక్తిత్వం గురించి ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఆయన ఏ విషయాన్ని మనసులో దాచుకోరు. అది మంచైనా చెడైనా కోపం అయినా ప్రేమైనా మొహం మీద చెప్పేయడం బాలకృష్ణ నైజం.ఇలా ఉన్నది ఉన్నట్టు మాట్లాడటం వల్ల ఈయన పలుమార్లు వివాదాలలో కూడా చికుకున్న సందర్భాలు ఉన్నాయి.
ఇలా ఏ విషయాన్ని ముక్కు సూటిగా మాట్లాడే బాలకృష్ణ తాజాగా అధికార పార్టీ ఎమ్మెల్యే పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇంతకీ ఏం జరిగిందనే విషయానికి వస్తే…ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా తెనాలిలోఎన్టీఆర్ శతజయంతి దినోత్సవాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బాలకృష్ణ ముఖ్య అతిథిగా వచ్చారు. ఈ కార్యక్రమంలో మహానటి సావిత్రి కుమార్తె అలాగే నాగిరెడ్డి కుమారుడు విశ్వనాథ్ రెడ్డిని ఎన్టీఆర్ అవార్డులతో సత్కరించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా బాలకృష్ణ మహానటి సావిత్రి గురించి అలాగే నాగిరెడ్డి గురించి ఎంతో గొప్పగా మాట్లాడారు అలాగే అధికార పార్టీ ఎమ్మెల్యే అయినటువంటి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి తనదైన స్టైల్ లో వారిని ఇచ్చారు. ఒక పబ్లిక్ ఈవెంట్లో భాగంగా వైయస్సార్సీపి కార్యకర్త భాస్కర్ రెడ్డి బాలకృష్ణ పాట పెట్టడంతో ఎమ్మెల్యే శ్రీనివాస రెడ్డి బాలయ్య పాట పెడతావా అంటూ తనని అవమానించారు దీంతో మనస్థాపానికి గురైన భాస్కర్ రెడ్డి ఆత్మహత్యాయత్నం చేశారు. అయితే అతనికి అందరూ నచ్చజెప్పి పంపించారు.
నరసరావుపేటలో నా పాట వేసారని వైసీపీ ఎమ్మెల్యే ఆ అభ్యర్థిని చానా ఇబ్బందులకు గురి చేశాడు. రాజకీయాలకు సినిమాలకు ముడి పెట్టద్దు.. సినిమాలను అన్ని పార్టీల వారు ఆదరిస్తున్నారు. అన్ని పార్టీల వాళ్ళు సినిమా చూస్తున్నారు అంటూ మాట్లాడటమే కాకుండా మధ్యలో ఒక్కసారి నేను మూడో కన్ను తెరిచానా…నా అభిమానులు ఒక్క చిటిక వేస్తే చాలు జాగ్రత్తగా ఉండు అంటూ ఎమ్మెల్యే శ్రీనివాస రెడ్డి పేరు ప్రస్తావించకుండా బాలయ్య తనదైన స్టైల్ లో తనకు వార్నింగ్ ఇచ్చారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…