Akkineni Akhil: ఎస్.ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమా లోని నాటు నాటు పాటకు గాను ఆస్కార్ అవార్డు రావడంతో ప్రతి ఒక్కరు కూడా చిత్ర బృందాన్ని ప్రశంసిస్తూ శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ క్రమంలోనే అక్కినేని అఖిల్ సైతం ఈ విషయంపై స్పందిస్తూ దర్శక ధీరుడు రాజమౌళి కుమారుడు ఎస్ఎస్ కార్తికేయకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా అఖిల్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. అందరికంటే ముందుగా కార్తికేయ పేరును సంబోధిస్తూ అతిపెద్ద ఘనత సాధించినందుకు మై బ్రదర్ కార్తికేయకు బిగ్ షౌటౌట్ అంటూ తర్వాత మిగతా వారి పేర్లు పెట్టాడు.. ఇలా అఖిల్ చేసిన ట్వీట్ కి కార్తికేయ రిప్లై ఇచ్చారు. అయితే ఇది చూసిన అక్కినేని ఫ్యాన్స్ కొంత పాటి అసహనం వ్యక్తం చేశారు.
అఖిల్ బ్రో అంటూ సంబోధిస్తూ ట్వీట్ చేయగా కార్తికేయ మాత్రం థ్యాంక్యూ రా!.. లవ్ యూ అంటూ హార్ట్ సింబల్స్‌తో రీ ట్వీట్ చేశాడు కార్తికేయ..అయితే అభిమానులు మాత్రం కార్తికేయ చేసిన ట్వీట్ పై కాస్త అసహనం వ్యక్తం చేస్తున్నారు. అఖిల్ మిమ్మల్ని బ్రో అని పిలిస్తే మీరు మాత్రం రా అని పిలుస్తున్నారు ఎంత ఫ్రెండ్షిప్ ఉంటే మాత్రం ఇలా పిలవడం ఏంటి సారు అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇక ఈ విషయం గురించి సోషల్ మీడియాలో కొంత పాటి చర్చలు కూడా జరుగుతున్నాయి. అఖిల్ వయసులో కార్తికేయ కన్నా చిన్నవాడు అంతేకాకుండా ఇద్దరి మధ్య చాలా మంచి స్నేహబంధం ఉంది ఆ స్నేహబంధం కారణంగానే తనని రా అని పిలిచి ఉంటాడు.ఇందులో తప్పు పట్టాల్సిన అంశం ఏమాత్రం లేదంటూ మరికొందరు కార్తికేయ పోస్టుకు మద్దతు తెలుపుతున్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…