Ram Charan: దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమాలోని నాటు నాటు పాట ది ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో భాగంగా ఆస్కార్ అవార్డు అందుకున్న విషయం మనకు తెలిసిందే.ఇలా ఈ పాట నామినేషన్ లో నిలవడంతో గత 15 రోజులుగా చిత్ర బృందం అమెరికాలో వెళ్లి పెద్ద ఎత్తున సందడి చేశారు.
ఇలా ఈ సినిమాకు ఎంత ప్రమోషన్ చేయాలో అంత ప్రమోషన్ చేశారు. చివరికి ఈ సినిమా అనుకున్న విధంగానే ఆస్కార్ అవార్డును సాధించడమే, తెలుగు చిత్ర పరిశ్రమకు అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతలను సాధించి పెట్టింది. ఇక ఆస్కార్ వేడుకలలో భాగంగా చిత్ర బృందం పాల్గొన్న విషయం మనకు తెలిసిందే.
ఈ క్రమంలోనే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రత్యేకంగా డిజైన్ చేసిన దుస్తులను ధరించి ఎంతో స్టైలిష్ లుక్ లో కనిపించారు. ఇక ఈ వేడుకలలో భాగంగా రామ్ చరణ్ ధరించిన వాచ్ పై అందరి దృష్టిపడింది. ఈ క్రమంలోనే చరణ్ ధరించిన ఆ వాచ్ ఏ బ్రాండ్ కు సంబంధించినది ఆ వాచ్ ఖరీదు ఎంత అనే విషయం గురించి పెద్ద ఎత్తున ఆరా తీస్తున్నారు.
ఈ క్రమంలోనే చరణ్ ఆస్కార్ వేడుకలలో భాగంగా ధరించిన వాచ్ Patek Phillipe Nautilus Travel Time (5980/1R) – దీని ధర అక్షరాలా రూ. 89, 57,963/- (108,820 డాలర్స్). ఇలా చేయడం ధరించిన ఈ వాచ్ ఏకంగా 90 లక్షల విలువ చేస్తుందని తెలియడంతో అభిమానులు ఒక్కసారిగా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఎంతో క్రేజ్ ఉన్నటువంటి సెలెబ్రిటీలు ఇలా బ్రాండెడ్ వస్తువులను ధరించడం సర్వసాధారణం.ప్రస్తుతం చరణ్ సినిమాల విషయానికొస్తే ఈయన శంకర్ దర్శకత్వంలో రాబోతున్న సినిమాతో బిజీగా ఉన్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…