గుంటూరు జిల్లాలో మహిళపై సామూహిక అత్యాచారం జరిగింది. సత్తెనపల్లి మండలానికి చెందిన దంపతులు గుంటూరులో ఓ వివాహానికి హాజరై బైక్‌పై తిరిగి ఇంటికి వెళుతుండగా మేడికొండూరు అడ్డురోడ్డు సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దంపతులను అడ్డగించిన కొందరు దుండగులు భర్తపై దాడిచేసి ఆ తర్వాత కత్తులతో బెదిరించి మహిళను పొలాల్లోకి తీసుకుని వెళ్లి అక్కడ సామూహిక అత్యాచారం చేశారు.
ఈ సంఘటనపై బాధిత మహిళ అర్ధరాత్రి సత్తెనపల్లి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేయలేదు. అస్సలు ఈ విషయం గురించే పట్టించుకోలేదు. ఎందుకు ఫిర్యాదు తీసుకోరని సదరు మహిళ ప్రశ్నించగా.. ఘటన జరిగిన ప్రదేశం గుంటూరు అర్బన్ ఎస్పీ పరిధిలోకి వస్తుందని తమ పోలీస్‌స్టేషన్ గుంటూరు రూరల్ పరిధిలో ఉంటుందన్నారు. ఈ మాట విన్న సదరు మహిళకు ఎం చేయాలో అర్థం కాలేదు. ఈ విషయం తెలిసిన వారు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఘటన ఎక్కడ జరిగినా జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి.. కేసును సంబంధిత పోలీస్‌స్టేషన్‌కు బదిలీ చేస్తారు. ఇటువంటివి సినిమాల్లో.. నిజ జీవితంతో కూడా ఎన్నో ఘటనలు జరిగాయి. వార్తాలు కూడా వచ్చాయి. కానీ ఆ పోలీసులకు ఇలాంటి చిన్న విషయం కూడా తెలియకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని అని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనతో పోలీసులకు సెక్షన్లపై అవగాహన లేదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతన్నాయి. కష్టకాలంలో ఉన్న మహిళ వచ్చి ఫిర్యాదు చేస్తే.. తమ పరిధిలో కాదంటూ చెప్పడం కరెక్ట్ కాదని.. సాటి మనిషిగా కూడా ఆ సమయంలో సహాయం చేయాలనే ఆలోచన రావాలి.
అలాంటప్పుడే మనవత్వానికి విలువ ఉంటుంది. అలా కాకుండా.. ఫిర్యాదు తీసుకోకుండా.. ఆమె చెప్పే విషయాలను పట్టించుకోకుండా ఉండటంతో ఆ పోలీసుల తీరుపై విమర్శలు వస్తున్నాయి. జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేయాలన్న అవగాహన కూడా లేకుండా ఎలా విధులు నిర్వర్తసున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…