Tag Archives: healthy tips

ఉదయాన్నే కరివేపాకును తినడంతో.. ఆ వ్యాధులకు చెక్ పెట్టవచ్చు!

మనం వండే వంటకాల్లో కరివేపాకు ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటుంది. ఎందుకంటే ఏ కూర తాలింపు వేసినా కరివేపాకు కచ్చితంగా ఉండాల్సిందే. అలాంటి ప్రత్యేకత ఉంది కరివేపాకుకు. కరివేపాకు మొక్కను ఎక్కడ వేసినా నాటుకుంటుంది. ఆకుపచ్చని రంగులో ఉండే కరివేపాకు అందరికీ అందుబాటులోనే ఉంటుంది. అయితే కూరలో కరివేపాకు కనపడితే చాలామంది తీసి బయట వేస్తుంటారు. కానీ వాటివళ్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి.

ప్రతిరోజు ఉదయాన్నే కొన్ని కరివేపాకులను తింటే ఎంతో ఆరోగ్యం. ఇవి మన చర్మం, జుట్టు, మొత్తం ఆరోగ్యాన్ని కాపాడగలవు. ఉదయం లేచి ఖాళీ కడుపుతో కొన్ని కరివేపాకు ఆకుల్ని తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. మొదట్లో చేదుగా అనిపిస్తుంది. తర్వాత అలవాటు అయిపోతుంది. కరివేపాకులో సాధారణంగా కార్బోహైడ్రేట్స్, పాస్ఫరస్, కాల్షియం, మెగ్నీషియం, అలాగే ఇనుము వంటివి పుష్కలంగా ఉంటాయి.

ఇంకా దీనిలో విటమిన్ ఏ, బి, సి, ఈ లు కూడా అధికంగా ఉంటాయి. కరివేపాకుని రోజు తీసుకోవటం వలన జీర్ణక్రియ సక్రమంగా పనిచేస్తుంది. ఎప్పుడైతే జీర్ణక్రియ వ్యవస్థ సక్రమంగా ఉంటుందో మన శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ ని బయటికి పంపిస్తుంది. కరివేపాకు ఎక్కడ వుంటే అక్కడ దోమలు మరియు క్రిమి కీటకాలు ఉండవు. కరివేపాకులో అతి ఎక్కువ ఐరన్ శాతం వుంది.

రక్తాన్ని ఉత్పత్తి చేయడంలో ఐరన్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇలా రోజూ 4 నుండి 5 కరివేపాకులు నేరుగా తినటం అలవాటు చేసుకోవటం వలన మధుమేహవ్యాధిని కొద్దివరకు నియంత్రించుకోవచ్చు. వీటిని తీసుకోవడం వల్ల జుట్టురాలడం కూడా ఆగతుంది. మలబద్దకంతో బాధపడే వారికి ఎంతో ఉపయోగపడుతుంది. కంటిచూపు, బరువు తగ్గాలనుకునే వారికి కూడా కరివేపాకు ఎంతగానో ఉపయోగపడుతుంది.

బట్టతల రాకుండా ఉండాలన్నా.. జుట్టు రాలడం ఆగిపోవాలన్న ఏం చేయాలి..? తెలుసుకోండి..!

ప్రస్తుత రోజుల్లో ఎక్కువగా చాలామందికి వేధిస్తున్న స‌మ‌స్య జుట్టు రాలిపోవ‌డం ( Hair Fall). ఇలా జుట్టు రాలుతూ ఉంటే ఓ రోజు బట్టతల వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా చిన్న‌వ‌య‌సులోనే బ‌ట్ట‌త‌ల రావ‌డం మాన‌సికంగా మ‌రింత కుంగ‌దీస్తుంది. కొంత మందికి చిన్న వయస్సులోనే జట్టు రాలుతుంటుంది. ఇలా జుట్టు రాలిపోకుండా ఇప్పటికే చాలా రకరకాల ప్రయత్నాలు కూడా చేసి ఉంటారు.

అసలు ఇలా బట్టతల రావడానికి గల కారణం ఏంటి.. జట్టు రాలిపోకుండా ఉంటాలంటే ఏం చేయాలో మనం తెలుసుకుందాం. బట్టతల అనేది ముఖ్యంగా శరీరంలోని బాల్డ్‌నెస్ జీన్స్ ఆండ్రోజెనిటిక్ అలోపిసియా కార‌ణంగా వస్తుంది. వెట్రుకలు రాలిపోవడానికి ప్రధాన కారణం మనిషి తీవ్ర ఒత్తిడితో ఉండటం, పోషకాహార లోపం కారణంగా ఇలా జరుగుతూ ఉంటుంది. ఇక మ‌హిళ‌ల్లో మెనోపాజ్‌, గ‌ర్భ‌ధార‌ణ త‌దిత‌ర స‌మ‌యాల్లో హార్మోన్ల విడుద‌లలో వ‌చ్చే మార్పు వ‌ల్ల కూడా వెంట్రుక‌లు రాలిపోతుంటాయి. పురుషుల్లో అయినా.. మ‌హిళ‌ల్లో అయినా గుండె వ్యాధులు, బీపీ, షుగ‌ర్‌, ఆర్థ‌రైటిస్ వంటి వ్యాధుల‌కు వాడే మందుల వ‌ల్ల కూడా జుట్టు ఊడిపోతుంటుంది.

బట్టతలను అడ్డుకోవడం చాలా కష్టం కానీ.. బట్టతల రాకుండా కొన్నాళ్ల పాటు మనం దానికి బ్రేక్ వేసే చాన్స్ మాత్రం ఉంటుంది. ప్రోటీన్లు ఎక్కువ‌గా ఉండే ఆహారం తీసుకోవాలి. కంటినిండా నిద్ర పోవాలి అంతే కాకుండా ప్రతీ రోజు వ్యాయామం చేయడం వల్ల కూడా జుట్టు రాలడం ఆగిపోతుంది. మ‌ద్య‌పానం, ధూమ‌పానానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. భయటకు వెళ్తే మాత్రం మూతికి మాస్క్ పెట్టుకుంటున్నట్లే తలకు కూడా స్కార్ఫ్ లేదా క్యాప్‌ ధరించి వెళ్తే దుమ్మూ, ధూళి పడకుండా ఉంటుంది. దుమ్ముతో ఎక్కువగా చుండ్రు త‌యార‌వుతుంది.

దీని వల్ల కూడా హెయిర్ ఫాల్ విపరీతంగా ఉటుంది. పురుషులు అయితే రోజు విడిచి రోజు, మహిళలు అయితే వారానికి రెండు నుంచి మూడు సార్లు తల స్నానం చేస్తే మంచింది. ఉల్లి, వెల్లుల్లి, అల్లం ర‌సాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. శిరోజాల సంరక్ష‌ణ‌లోనూ ఇవి దోహ‌దప‌డ‌తాయి. వీటిలో ఏదో ఒక ర‌సాన్ని నిద్ర‌పోయేముందు నెత్తికి ప‌ట్టించి.. పొద్దున్నే త‌ల‌స్నానం చేస్తుండాలి. ఇలా వారంలో రెండు మూడు సార్లు చేస్తే మంచి ఫ‌లితం క‌నిపిస్తుంది. ఇలా పైన చెప్పిన విధంగా చిట్కాలు అనుసరించితే జుట్టు రాలడం ఆగిపోతుంది.

చేపలను కొనుగోలు చేస్తున్నారా.. అవి తాజా చేపలా.. కాదా.. అనేవి ఇలా తెలుసుకోండి..?

ఆదివారం వచ్చిందంటే చాలు.. ఎక్కడైనా నాన్ వెజ్ దుకాణంలో జనాలు గుంపులు గుంపులుగా కనపడతారు. చికెన్, మటన్, చేపలు ఇలా ఏదో ఒకటి నాన్ వెజ్ తీసుకోవాల్సిందే. అయితే ఇందులో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏందంటే.. చేపల గురించి. మనం మార్కెట్లో లేదా మరేదైనా దుకాణంలో చేపలను తీసుకునే సమయంలో అవి తాజా చేపలా.. లేదా పాడైపోయినవా అనేవి గమనించకుండా తీసుకుంటాం. అయితే ప్రస్తుత రోజుల్లో కల్తీ మాయ నడుస్తున్న విషయం తెలిసిందే. ఎది చూసిన కల్తీ వ్యాపారం నడుస్తోంది. ఇది చేపల దాకా కూడా పాకింది. ఎక్కవ శాతం జనాలు చేపలు తీసుకునే సమయంలో కేవలం ఆ చేప మొప్పలను ఎత్తి, చేపల లోపలి భాగంలో గులాబీ రంగులో ఉందో లేదో చూస్తాం. అయితే ఈ మధ్య కాలంలో మొప్పలకు గులాబీ కలర్ రంగు, ఎర్ర రంగులను కూడా పూస్తున్నారు. కేవలం ఇదొక్కటే చూసుకొని దీనిని కొనుగోలు చేయడం అనేది మంచిది కాదు.

తాజా చేపలను గుర్తించాలంటే కొన్ని చిట్కాలను ఫాలో అయితే మీకు చేపలు మంచివా.. కావా అనేది సులువుగా తెలుసుకోవచ్చు. చేపల్లో కొవ్వు తక్కువగా ఉంటుందని.. అంతే కాకుండా పోషకాలు మెండుగా ఉంటాయని చాలామంది చికెన్, మటన్ కంటే చేపలను ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. అంతే కాకుండా చేపలను తినడం వల్ల డయాబెటిస్, బీపీ, కొలెస్ట్రాల్ లాంటివి కంట్రోల్ లో ఉంటాయి కూడా. అందుకే తాజాగా ఉండే చేపలు అంటే పాడైపోయినవి కాకుండా మంచిగా ఉన్నవి తింటే అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. ముఖ్యంగా చేపలను వాసన చూడటం ద్వారా కూడా అవి తాజాగా ఉన్నాయా.. పాడైపోయాయా అనే విషయాన్ని తెలుసుకోవచ్చు.

నిపుణులు చేపలను గుర్తించడంలో ఇదే ఉత్తమమైన మార్గమని అంటున్నారు. వాసన చూసే సందర్బంలో మీకు దానిలో నుంచి సముద్రపు నీరు వాసన వచ్చినట్లయితే అవి తాజా చేపలని అర్ధం. అలా కాకుండా దుర్వాసన వచ్చినట్లయితే.. అవి కచ్చితంగా పాడైపోయిన చేపలు. చేపల కళ్లపై తెల్లటి పూత ఉన్నా, అవి లోతుగా ఉన్నా.. అలాంటి చేపలు పాడైపోయినవి అని అర్థం. తాజా చేపలకు ఎప్పుడూ కూడా కళ్లు ప్రకాశవంతంగా, అలాగే ఉబ్బినట్లుగా ఉంటాయి. ఇలాంటివి గమనించి చేపలను కొనుగోలు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. అంతే కాకుండా మరో చిట్కాలో.. తాజాగా ఉంటే చేపల ఆకృతి లోపల, భయట ఒకేలా గట్టిగా ఉంటుంది.

అలా కాకుండా చేపల చర్మంపై ఏదైనా క్రస్ట్ ఉంటే పాడైపోయాయని అర్థం. అంటే ప్రాణం లేకుండా చాలా రోజుల నుంచి నిల్వ ఉంచారని గమనించాలి. తాజా చేపల మాంసం వాటని కోసిన తర్వాత శుభ్రంగా కనిపిస్తుంది. చేపల కళ్లను కూడా మనం గమనించాల్సి ఉంటుంది. వాటి కళ్లలో తెల్లటి పూతలు లేకుండా ఉంటాయి. అలాంటి చేపలు తాజావి అని అర్థం. అంతే కాకుండా తాజా చేపల రంగు సాధారణంగా ఒకే విధంగా ఉంటుంది. వాటి ఆకృతి కూడా కొద్దిగా తడిగా ఉంటుంది. ఇలా పైన చెప్పిన విధంగా చిట్కాలను పాటించి తాజా చేపలను కొనుగోలు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

పంటి నొప్పితో బాధపడుతున్నారా… జామాకుతో ఇలా చేయండి?

ప్రస్తుత రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా
ప్రతి ఒక్కరిని వేధిస్తున్న సమస్యల్లో దంత సమస్యలు కూడా ప్రధానమైనవి గానే చెప్పుకోవచ్చు.సాధారణంగా ప్రతి రోజూ మనం తీసుకొనే ఆహారం కొంత పళ్ళ సందుల్లో ఉండిపోవడం వల్ల బ్యాక్టీరియా వృద్ధి జరిగి పంటి సమస్యలు, చిగుళ్ల వాపు, చిగుళ్ల నుంచి రక్తం కారడం వంటి సమస్యలకు కారణం అవుతుంది.దంత సమస్యల నుంచి విముక్తి పొందాలంటే విటమిన్ సి ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడంతో పాటు ప్రతిరోజూ ఉదయం,రాత్రి నిద్రకు ముందు బ్రష్ చేసుకోవడం అలవాటు చేసుకున్నట్లయితే పంటి సమస్యలు మీదరిచేరవు.

పంటినొప్పి సమస్యలతో బాధపడుతున్నవారు కొన్ని చిట్కాలు పాటించి ఉపశమనం పొందవచ్చు. జామకాయలో విటమిన్ సి సమృద్ధిగా ఉన్న విషయం తెలిసిందే.అలాగే జామాకుల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉండి మనకు చాలా రకాలుగా ఉపయోగపడుతుంది.
ఇందులో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ప్రాపర్టీస్ గుణం పుండ్లను త్వరగా తగ్గిస్తుంది. అలాగే
జామాకు నోటిలోని ప్రమాదకర బ్యాక్టీరియాలను తొలగించడంలో కూడా ఉపయోగపడుతుంది.
కొన్ని జామ ఆకులను బాగా మరిగించి వచ్చిన ద్రావణంతో నోటిని పుక్కిలించడం వల్ల ప్రమాదకర బ్యాక్టీరియా నశిస్తుంది.

ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో అరటీ స్పూన్ ఉప్పు వేసి బాగా కలిపి ఆ ఉప్పునీటితో నోటిని పుక్కిలించడం వల్ల నాచురల్ డిస్ఇంఫెక్టెంట్ అయిన ఉప్పు నీళ్లు పళ్ళ మధ్య ఇరుక్కుని ఉండిపోయిన ఆహార పదార్థాలని బయటకి లాగేసి ఇన్‌ఫ్లమేషన్ రెడ్యూస్ అయ్యి ఇంకేవైనా చిన్న చిన్న నోటి పుండ్లు, చిగుళ్ల సమస్యలు తగ్గిపోతాయి.లవంగాలు కూడా పంటి నొప్పి సమస్యలకు అద్భుతంగా పనిచేస్తుంది. పంటి నొప్పి మరీ తీవ్రంగా ఉండి జ్వరం, పంటి నుండి చీము కారడం వంటి సమస్యలు ఉంటే వెంటనే దంత వైద్యుని సంప్రదించడం ఉత్తమం.

గుడ్లు ఎక్కువగా తింటే చనిపోతారా.. రోజుకు ఎన్ని గుడ్లు తినాలంటే?

వైద్యులు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు గుడ్లు కచ్చితంగా తినాలని చెబుతుంటారు. రోజుకు కనీసం ఒక గుడ్డు తీసుకుంటే ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయని వెల్లడిస్తూ ఉంటారు. గుడ్లు తినడం వల్ల శరీరానికి అవసరమైన ప్రోటీన్లు, విటమిన్లు లభిస్తాయి. అనేక ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టడంలో గుడ్లు సహాయపడతాయి. కంటిచూపును మెరుగుపరచడంలో, బరువును తగ్గించడంలో గుడ్లు సహాయపడతాయి.

గుడ్లలో మెదడుకు ఆరోగ్యాన్ని ఇచ్చే పదార్థాలతో పాటు శరీరానికి మేలు చేసే కొలెస్టారాల్ పెరుగుతోంది. గుడ్లు తీసుకోవడం వల్ల శిరోజాలు ఆరోగ్యంగా ఉండటంతో పాటు స్త్రీలలో రొమ్ము క్యాన్సర్ రాకుండా చేయడంలో గుడ్లు సహాయపడతాయి. అయితే గుడ్ల వల్ల ఆరోగ్య ప్రయోజనాలు చేకూరినా ఎక్కువగా గుడ్లను తీసుకుంటే ఆరోగ్య సమస్యలు తప్పవని వైద్య నిపుణులు చెబుతుండటం గమనార్హం.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఒక వ్యక్తి రెండు నెలల క్రితం మరో వ్యక్తితో తాను 50 గుడ్లు తినగలనని చెప్పి పందెం వేసి 42 గుడ్లు తిన్న తరువాత మృతి చెందాడు. అందువల్ల అవసరానికి మించి గుడ్లు తీసుకున్నా ప్రమాదమే అని గుర్తుంచుకోవాలి. గుడ్లను ఎల్లప్పుడూ పూర్తిగా ఉడికించి తినాలి. ఉడికించడం వల్ల గుడ్లలో ఉండే హానికారక బ్యాక్టీరియా పూర్తిగా తొలగిపోతుంది. పచ్చిగుడ్డును తీసుకోవడం కంటే ఉడకబెట్టిన గుడ్డును తీసుకుంటే మంచిది.

టైప్ 2 డయాబెటిస్ తో బాధ పడేవాళ్లు, కొలెస్ట్రాల్ సమస్యలు ఉన్నవాళ్లు గుడ్డును తీసుకోకపోవడమే మంచిది. ఫుడ్ అలర్జీ వల్ల బాధ పడుతున్న వాళ్లు గుడ్లను తక్కువగా తీసుకుంటే మంచిది. యాంటీ బయోటిక్స్ మందులు ఎక్కువగా వాడే వాళ్లు సైతం గుడ్లను తీసుకోకపోవడమే మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు.