Tag Archives: hero krishna

Super Star Krishna : మెగాస్టార్ ఒకప్పుడు కృష్ణ ఫాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్.. వైరల్ అవుతున ఒకప్పటి పాంప్లెట్ !

Super Star Krishna : టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి మెగాస్టార్ గా నిలిచిన చిరంజీవి గురించి ఎంత చెప్పినా తక్కువే. తన నటనకు ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకొని స్టార్ హీరోగా నిలిచాడు. 150కి పైగా సినిమాలలో నటించగా.. ప్రస్తుతం వరుస సినిమాలలో యంగ్ హీరోలకు పోటీగా దూసుకుపోతున్నాడు. ఇక ఈయనకు తెలుగు సినీ ఇండస్ట్రీ లోనే కాకుండా ఇతర భాషల ఇండస్ట్రీలో కూడా ఎంతోమంది వీరాభిమానులు ఉన్నారు. అంతేకాకుండా ఇప్పుడున్న యంగ్ హీరోలకు కూడా అభిమాన హీరో గా నిలిచాడు చిరంజీవి. ఇక అటువంటి చిరంజీవికే మరో అభిమాన హీరో ఉన్నాడు. ఇంతకీ ఆయన ఎవరో కాదు..

తెలుగు సినీ ఇండస్ట్రీకి సూపర్ స్టార్ గా నిలిచిన హీరో కృష్ణ గురించి తెలుగు ప్రేక్షకులందరికీ తెలిసిందే. ఈయన కూడా ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అంతేకాకుండా పలు సినిమాలలో సహాయ పాత్రల్లో కూడా మెప్పించాడు. ఈయనకు అప్పట్లోనే ఎంతోమంది అభిమానులు ఉండగా ఇప్పుడు కూడా ఈయన అంటే అభిమానించే ప్రేక్షకులు ఉన్నారు.

ఇక చిరంజీవికి కృష్ణ అంటే అభిమాన హీరో అని చాలా వరకు ఎవరికీ తెలియకపోగా.. ప్రస్తుతం నెట్టింట్లో వీరిద్దరు కలిసి దిగిన ఒకప్పటి ఫోటో, ఇప్పటి ఫోటో పంప్లెట్ బాగా వైరల్ గా మారింది. ఈ ఫోటోలు చూసిన మెగా అభిమానులు తెగ లైకులు కొడుతున్నారు. ఇందులో నిజమెంత వుందో తెలియాల్సి ఇంకా తెలియాల్సిఉంది. ఇక చిరంజీవి కృష్ణ తో కలిసి తోడుదొంగలు అనే సినిమాలో నటించగా.. ఈ సినిమాతోనే కృష్ణ నటన, వ్యక్తిత్వం తెలుసుకున్నాడు చిరంజీవి.

అప్పటికే కృష్ణ సూపర్ స్టార్ గా ఇండస్ట్రీలో నిలువగా.. చిరంజీవి మాత్రం ఆ సమయంలో ఎటువంటి గుర్తింపు అందుకోలేదు. అలా కృష్ణ కి సంబంధించిన ఏ విషయంలోనైనా చిరంజీవి ఆసక్తిగా ఎదురుచూసేవారని.. ఇక ఆయన నటించే ప్రతి ఒక్క సినిమాను చిరంజీవి బాగా ఆసక్తిగా చూసేవాడని తెలిసింది. ఇక ఇప్పటికీ చిరంజీవి.. సూపర్ స్టార్ కృష్ణను ఏదైనా సందర్భంలో కలిసినప్పుడు ఆయనతో ఎక్కువ సమయాన్ని గడుపుతూ ఉంటాడు.

Actor Krishna: కుటుంబ పరువు పోతుంది.. నరేష్ పవిత్ర వ్యవహారంపై కృష్ణ సీరియస్?

Actor Krishna: నటుడు నరేష్ పవిత్ర లోకేష్ వ్యవహారం గత కొద్ది రోజుల నుంచి మీడియా వార్తల్లో ఫ్రంట్ లైన్ లో ఉంటుంది. నరేష్ విజయనిర్మల వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు.ఈ క్రమంలోనే నటుడిగా కమెడియన్ గా ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో బిజీగా ఉన్నారు.ఇలా పలు సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నరేష్ వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎన్నో విడుదుడుకులు ఎదుర్కొంటున్నారు.

ఇప్పటికే నరేష్ మూడు పెళ్లిళ్లు చేసుకుని ముగ్గురికి విడాకులు ఇచ్చారు. ఈ క్రమంలోనే నటి పవిత్ర లోకేష్ తో ఈయన రిలేషన్ లో ఉన్నారని త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నామని ప్రకటించారు. ఇక ఈ వ్యాఖ్యలపై నటి పవిత్ర లోకేష్ స్పందిస్తూ మేము రిలేషన్ లో ఉన్న విషయం కృష్ణ గారి ఫ్యామిలీకి కూడా తెలుసు. ఆ ఫ్యామిలీ సపోర్ట్ మాకుంది అంటూ కామెంట్స్ చేశారు.

ఈ విధంగా వీరి వ్యవహారం రోజు రోజుకు వైరల్ కావడంతో సీన్లోకి నరేష్ మూడవ భార్య రమ్య ఎంట్రీ ఇచ్చారు. ఇక రమ్య ఎంట్రీ ఇవ్వడంతో వీరి వివాదం తారస్థాయికి చేరింది. రమ్య ఏకంగా నరేష్ పవిత్ర పై చెప్పుతో దాడికి కూడా ప్రయత్నం చేశారు. ఈ విధంగా వీరి మధ్య గొడవల కారణంగా కృష్ణ ఫ్యామిలీ కూడా ప్రస్తావనలోకి వచ్చింది. దీంతో కృష్ణ సీరియస్ అయినట్లు తెలుస్తోంది.

తన పేరు ప్రస్తావన రావడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కృష్ణ..

నరేష్ పవిత్ర వ్యవహారం వల్ల కృష్ణ గారి పేరుతో పాటు ఆయన కుటుంబం గురించి కూడా వార్తల్లో రావడంతో కృష్ణ కుటుంబ పరువు పోతుందని భావించి నరేష్ ను మందలించడమే కాకుండా ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.ఈ క్రమంలోనే ఈ వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ నరేష్ పై కృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారనేది మాత్రం నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది.

Hero Krishna : ‘పసివాడి ప్రాణం’ సినిమా చేయాలనుకున్న కృష్ణ.. ఎందుకు తప్పుకున్నారో తెలుసా?

Hero Krishna: దక్షిణాది సినీపరిశ్రమ అనగానే టాలీవుడ్, కోలీవుడ్, శాండల్ వుడ్, మాలీవుడ్ లు గుర్తుకువస్తాయి. ఒకప్పుడు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ చిత్రాలు మద్రాస్ లోని విజయ- వాహిని, జెమినీ స్టూడియోస్ లోనే షూటింగ్ జరుపుకొని ఆంధ్ర, తమిళ, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో విడుదలై ప్రేక్షకాదరణ పొందేవి. ఆ తర్వాత భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడడం లాంటి పరిణామాలతో దక్షిణాది రాష్ట్రాలు సొంతగా సినీ పరిశ్రమను ఏర్పాటు చేసుకున్నాయి. దక్షిణాది రాష్ట్రాల్లో అతిచిన్న రాష్ట్రమైన కేరళ అతి తక్కువ బడ్జెట్ తో సినిమాలు నిర్మించుకుంటుంది. అయినప్పటికి కొత్త కథలతో సినిమాలు నిర్మించి విజయపరంపర కొనసాగిస్తున్నారు.

ఆ క్రమంలో విజయవంతమైన చిత్రాల రీమేక్ హక్కులను టాలీవుడ్, కోలీవుడ్, శాండల్ వుడ్ కొన్ని సందర్భాల్లో బాలీవుడ్ కి అమ్ముతున్నారు. 1985 పీటర్ వేర్ దర్శకత్వంలో హారిసన్ ఫోర్డ్ హీరోగా విట్నెస్ (WITNES) చిత్రం విడుదలయింది. కొత్త కథలు కొరకు చూస్తున్నా మలయాళ కథారచయిత ‘ఫాజిల్’ విట్నెస్ చిత్రాన్ని చూసి ఇండియన్ నేటివిటీకి అనుగుణంగా కథలో మార్పులు చేసి మమ్ముట్టి, నదియా హీరో, హీరోయిన్లుగా “పూవిన్ పుతియా పూన్ తెన్నల్” చిత్రాన్ని రూపొందించారు.

మలయాళంలో వచ్చిన ఈ సినిమా ఘన విజయం సాధించింది. అలా ఈ విజయవంతమైన సినిమా కోసం ఇతర సినీ పరిశ్రమ నిర్మాతలు పోటీపడి రీమేక్ హుక్కులను కొనుక్కున్నారు. అనేకమంది తెలుగు నిర్మాతలు పోటీపడగా చివరికి రీమేక్ హక్కులు అల్లు అరవింద్ కు దక్కాయి. ఇది గమనించని విజయబాపినీడు ‘విట్నెస్’ అనే ఇంగ్లీష్ ‌చిత్రాన్ని చూసి… ‘సాక్షి’ టైటిల్ తో ఓ కథను రాసుకున్నారు.

Hero Krishna: పసివాడి ప్రాణం సినిమాలో ముందుగా నటించాల్సిన హీరో కృష్ణ ..ఎందుకు తప్పుకున్నారో తెలుసా?

బాలనటుడిగా మహేష్ బాబు..

ఆచంట గోపీనాథ్ నిర్మాతగా విజయబాపినీడు దర్శకత్వంలో కృష్ణ, శ్రీదేవి హీరో హీరోయిన్ అని భావించాడు. ఇందులో బాలనటుడిగా మహేష్ బాబుని అనుకున్నారు. ఇక సినిమా షూటింగ్ ప్రారంభించాలి అన్న నేపథ్యంలో ఇదే కథతో చిరంజీవి సినిమా చేస్తున్నారని తెలియడంతో అలాంటి కథతోనే మరో సినిమా చేయడం మంచిది కాదని దర్శకుడు ఈ సినిమాని తెరకెక్కించడం విరమించుకున్నారు. అలా కృష్ణతో చేయాల్సిన పసివాడి ప్రాణం కాస్తా ఆగిపోయింది.

హీరో కృష్ణ, బాలుకి మధ్య జరిగిన పెద్ద గొడవ అదే?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరో కృష్ణ, బాలసుబ్రహ్మణ్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ క్రమంలోనే కృష్ణ విజయ కృష్ణ బ్యానర్ లో ఇందిరా గాంధీపై ఒక బుర్ర కథ చేశారు. దానికి సంభందించి sp బాల సుబ్రమణ్యం ప్లే బ్యాక్ సింగర్ గా చేశారు. కృష్ణ గారు, విజయ నిర్మల గారికి కాంగ్రెస్ మీద ఉన్న మక్కువతో ఇందిరా గాంధీ మీద బుర్ర కథ చేశారని పద్మాలయ శర్మ అన్నారు.

వాళ్ళు అభిమానంతో ఎంత ఇష్టపడి చేపించుకున్నా సరే దానికి ఇచ్చిపుచ్చుకునే విషయంలో బాల సుబ్రమణ్యం గారి నుంచి ఒక ప్రస్థావన వచ్చిందని ఆయన వివరించారు. దాంతో వాళ్ళు హర్ట్ అయ్యారని ఆయన తెలిపారు. అంతకు ముందు కృష్ణ గారితో బాల సుబ్రమణ్యం ఒక సినిమా చేసినప్పుడు, ఏదో ఫేమస్ విషయంలో కొన్ని మనస్పర్థలు చోటు చేసుకున్నాయి.

ఇలా పేమెంట్స్ విషయంలో కొంచెం లేట్ అయ్యేదని ఆయన అన్నారు. ఇలా జరిగినప్పుడు వాళ్ళు కూడా అప్పటి విషయం తీసుకొచ్చి ముందు అవి బయటకు తీయండి అని వారి మధ్య మాట మాట పెరిగి పలు విమర్శలకు దారి తీసిందని ఆయన తెలిపారు. అలా వారి మధ్య దూరం ఏర్పడిందని ఆయన వివరించారు. ఈ కారణం చేత హీరో కృష్ణ బాలు మధ్య గొడవ ఏర్పడింది.