Super Star Krishna : టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి మెగాస్టార్ గా నిలిచిన చిరంజీవి గురించి ఎంత చెప్పినా తక్కువే. తన నటనకు ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకొని స్టార్ హీరోగా నిలిచాడు. 150కి పైగా సినిమాలలో నటించగా.. ప్రస్తుతం వరుస సినిమాలలో యంగ్ హీరోలకు పోటీగా దూసుకుపోతున్నాడు. ఇక ఈయనకు తెలుగు సినీ ఇండస్ట్రీ లోనే కాకుండా ఇతర భాషల ఇండస్ట్రీలో కూడా ఎంతోమంది వీరాభిమానులు ఉన్నారు. అంతేకాకుండా ఇప్పుడున్న యంగ్ హీరోలకు కూడా అభిమాన హీరో గా నిలిచాడు చిరంజీవి. ఇక అటువంటి చిరంజీవికే మరో అభిమాన హీరో ఉన్నాడు. ఇంతకీ ఆయన ఎవరో కాదు..
తెలుగు సినీ ఇండస్ట్రీకి సూపర్ స్టార్ గా నిలిచిన హీరో కృష్ణ గురించి తెలుగు ప్రేక్షకులందరికీ తెలిసిందే. ఈయన కూడా ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అంతేకాకుండా పలు సినిమాలలో సహాయ పాత్రల్లో కూడా మెప్పించాడు. ఈయనకు అప్పట్లోనే ఎంతోమంది అభిమానులు ఉండగా ఇప్పుడు కూడా ఈయన అంటే అభిమానించే ప్రేక్షకులు ఉన్నారు.
ఇక చిరంజీవికి కృష్ణ అంటే అభిమాన హీరో అని చాలా వరకు ఎవరికీ తెలియకపోగా.. ప్రస్తుతం నెట్టింట్లో వీరిద్దరు కలిసి దిగిన ఒకప్పటి ఫోటో, ఇప్పటి ఫోటో పంప్లెట్ బాగా వైరల్ గా మారింది. ఈ ఫోటోలు చూసిన మెగా అభిమానులు తెగ లైకులు కొడుతున్నారు. ఇందులో నిజమెంత వుందో తెలియాల్సి ఇంకా తెలియాల్సిఉంది. ఇక చిరంజీవి కృష్ణ తో కలిసి తోడుదొంగలు అనే సినిమాలో నటించగా.. ఈ సినిమాతోనే కృష్ణ నటన, వ్యక్తిత్వం తెలుసుకున్నాడు చిరంజీవి.
అప్పటికే కృష్ణ సూపర్ స్టార్ గా ఇండస్ట్రీలో నిలువగా.. చిరంజీవి మాత్రం ఆ సమయంలో ఎటువంటి గుర్తింపు అందుకోలేదు. అలా కృష్ణ కి సంబంధించిన ఏ విషయంలోనైనా చిరంజీవి ఆసక్తిగా ఎదురుచూసేవారని.. ఇక ఆయన నటించే ప్రతి ఒక్క సినిమాను చిరంజీవి బాగా ఆసక్తిగా చూసేవాడని తెలిసింది. ఇక ఇప్పటికీ చిరంజీవి.. సూపర్ స్టార్ కృష్ణను ఏదైనా సందర్భంలో కలిసినప్పుడు ఆయనతో ఎక్కువ సమయాన్ని గడుపుతూ ఉంటాడు.
ప్రపంచంలో కాఫీ ప్రియులు ఎన్నో రకాల కాఫీలను ఆస్వాదిస్తుంటారు. సాధారణ కాఫీ నుంచి ప్రత్యేక రకాల కాఫీల వరకు మార్కెట్లో…
పనసపండు అంటే చాలామందికి ఎంతో ఇష్టం. తియ్యటి రుచి, ప్రత్యేకమైన సువాసన, పోషకాలతో నిండిన ఈ పండు వేసవి కాలంలో…
జ్వరం వచ్చినప్పుడు ఆహారం విషయంలో అనేక సందేహాలు, అపోహలు ప్రజల్లో కనిపిస్తుంటాయి. ముఖ్యంగా మాంసాహార ఆహారం తీసుకోవచ్చా లేదా అనే…
అమెరికాలో స్థిరపడాలని, అక్కడే భవిష్యత్తును నిర్మించుకోవాలని కలలు కంటున్న లక్షలాది మంది భారతీయులకు కొత్త ఆందోళన మొదలైంది. ఇప్పటికే వీసా…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం కీలక శుభవార్త అందించింది. ఉద్యోగ సంఘాలు చాలా కాలంగా కోరుతున్న అంశంపై సానుకూల…
జ్యోతిష్య శాస్త్రంలో చంద్రుడికి అత్యంత కీలకమైన స్థానం ఉంది. మనస్సు, ఆలోచనలు, భావోద్వేగాలు, కుటుంబ జీవితం, ఆర్థిక స్థితి వంటి…