Super Star Krishna: సూపర్ స్టార్ కృష్ణ ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి ఎంతో పేరు ప్రఖ్యాతలు పొందారు అయితే నేడు ఈయన తన సినీ ప్రస్థానానికి సెలవు పెట్టి తిరిగిరాని లోకాలకు వెళ్లారు.అయితే కృష్ణ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన తర్వాత తేనె మనసులు సినిమా ద్వారా హీరోగా పరిచయమయ్యారు. ఈ క్రమంలోని అప్పట్లో కృష్ణ తనని తాను పరిచయం చేసుకుంటూ ఓ లేఖ రాశారు.
ప్రస్తుతం ఈ లెటర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సందర్భంగా కృష్ణ తనని పరిచయం చేసుకుంటూ ఈ రసిక ప్రపంచానికి నా వందనాలు నా పేరు కృష్ణ తేనె మనసులు సినిమాలో బసవరాజు పాత్రలో నటించాను సినిమాలలో నటించాలన్న ఆశతో ఎన్నో సంవత్సరాలుగా కలలకంటూ లెఫ్ట్ రైట్ కొడుతున్న నాకు ఈ రోజు రంగురంగుల కలగా ఈ స్టమన్ కలర్లో పరిచయమైంది.
దీనికోసం ఎంతోమంది దర్శకులు డాన్స్ మాస్టర్లు నా చేత అక్షరాల డ్రిల్ చేయించారు, నటన నేర్పించారు, డాన్సులు చేయించారు.చివరికి నా వేషం ఏంటి అని అడిగితే డ్రిల్ మాస్టర్ అని చెప్పారు. అయితే జీవితం డ్రిల్ కాకుండా జాగ్రత్తగా కాపాడుకున్నాను. మీరందరూ చూసి బాగోగులు చెప్పే క్షణం కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నాను.
ఉగాదికి నా శుభాకాంక్షలు అంటూ కృష్ణ గారు స్వయంగా తనని తాను పరిచయం చేసుకుంటూ రాసినటువంటి ఈ లేక ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఇలా తేనె మనసులు సినిమా ద్వారా హీరోగా పరిచయమైనటువంటి కృష్ణ తెలుగు చిత్ర పరిశ్రమకు ఒక జేమ్స్ బాండ్, ఒక కౌబాయ్, ఒక అల్లూరి సీతారామరాజు అని చెప్పాలి. ఇలా తెలుగు వారి అల్లూరి సీతారామరాజు నేడు అస్తమించడంతో ఎంతోమంది కన్నీరు మున్నీరు అవుతున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…