Tag Archives: hero

Bigg Boss 6: బిగ్ బాస్ ఎంట్రీ ఇవ్వనున్న టాలీవుడ్ యంగ్ హీరో.. బిగ్ బాస్ ఎంట్రీ వెనుక అసలు కారణం ఇదేనా?

Bigg Boss 6: బుల్లితెరపై ప్రసారమవుతున్న అతిపెద్ద రియాలిటీ షోలలో బిగ్ బాస్ రియాలిటీ షో ఒకటి.ఈ కార్యక్రమం గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రసారం అవుతూ ప్రేక్షకులను పెద్ద ఎత్తున సందడి చేస్తోంది. ఈ క్రమంలోనే ఈ కార్యక్రమం ఇప్పటికే తెలుగులో ఐదు సీజన్లలో పూర్తి చేసుకొని ఆరవ సీజన్ ప్రసారం కావడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్ కూడా పూర్తి చేసుకుంది.

Bigg Boss 6: బిగ్ బాస్ ఎంట్రీ ఇవ్వనున్న టాలీవుడ్ యంగ్ హీరో.. బిగ్ బాస్ ఎంట్రీ వెనుక అసలు కారణం ఇదేనా?

బిగ్ బాస్ చరిత్రలో ఎప్పుడూ లేనివిధంగా తొలిసారిగా బిగ్ బాస్ నాన్ స్టాప్ కార్యక్రమంలో భాగంగా లేడీ కంటెస్టెంట్ విన్నర్ గా నిలిచారు. ఇక ఈ కార్యక్రమం ప్రేక్షకులను పెద్ద ఎత్తున సందడి చేసింది. ఇదిలా ఉండగా బుల్లితెరపై సీజన్ సిక్స్ ప్రసారం చేయడానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు.ఎప్పటిలాగే ఈసారి కూడా సోషల్ మీడియాలో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిని బిగ్ బాస్ కంటెస్టెంట్ గా ఎంపిక చేసినట్లు సమాచారం.

Bigg Boss 6: బిగ్ బాస్ ఎంట్రీ ఇవ్వనున్న టాలీవుడ్ యంగ్ హీరో.. బిగ్ బాస్ ఎంట్రీ వెనుక అసలు కారణం ఇదేనా?

ఈ క్రమంలోనే బిగ్ బాస్ సీజన్ సిక్స్ కార్యక్రమంలో పాల్గొనబోయే కంటెస్టెంట్ లు వీళ్లే అంటూ ఇప్పటికే కొందరి పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.ఇదిలా ఉండగా తాజాగా ఈ కార్యక్రమంలోకి టాలీవుడ్ యంగ్ హీరో ఎంట్రీ ఇవ్వనున్నారనే వార్త వైరల్ అవుతుంది. తూనీగ తూనీగ సినిమాతో వెండితెర అరంగ్రేటం చేసిన హీరో సుమంత్ అశ్విన్ బిగ్ బాస్ సీజన్ సిక్స్ కార్యక్రమంలోకి కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇవ్వనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ప్రేక్షకాదరణ కోసమే బిగ్ బాస్ ఎంట్రీ…

సుమంత్ అశ్విన్ కేరింత, హ్యాపీ వెడ్డింగ్, వంటి సినిమాలలో నటించిన పెద్దగా ప్రేక్షకాదరణ పొందలేదు. అందుకే మంచి గుర్తింపు సంపాదించుకోవడం కోసమే ఆయన ఈ కార్యక్రమంలోకి వెళ్లడానికి ఒప్పుకున్నారని వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాలి. ఇక తాజాగా సుమంత్ 7 డేస్ 6 నైట్స్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

ఏఎన్ఆర్ మల్టీస్టారర్ సినిమా వద్దన్నా చేశారు.. చివరకు ఇలా జరిగింది..

సినిమా ఇండస్ట్రీలో ఇద్దరు కలిసి మల్టీస్టారర్ సినిమా చేస్తున్నారంటే.. అది అభిమానుల్లో ఎక్కువ అంచనాలకు తీసుకెళ్తుంది. మొదట్లో ఇలా మల్టీస్టారర్ సినిమాలు బాగానే వచ్చాయి. సీనియర్ హీరోలల్లో ముఖ్యంగా అక్కినేని నాగేశ్వరరావు, ఎన్టీఆర్ లాంటి వాళ్లు ఎన్నో సినిమాలను ఇలా మల్టీస్టారర్ గా చేశారు. అంతేకాకుండా విజయాలను కూడా అందుకున్నారు.

ఈ క్రమంలోనే అక్కినేని వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నాగార్జునతో కలిసి ఏఎన్ఆర్ సినిమాలలో నటించారు. శివ సినిమాతో నాగార్జున అప్పట్లో ఓ ట్రెండ్ ను సెట్ చేశారు. ఆ తర్వాత నాగార్జున నటించే సినిమాలపై అభిమానులకు భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే ఏఎన్నార్ తో కలిసి నాగార్జున మల్టీ స్టారర్ గా చేస్తే ఎలా ఉంటుందని శివ సినిమా నిర్మాతలు భావించారు. ఇలా వారిద్దరు కలిసి కలెక్టర్ గారి అబ్బాయి, అగ్నిపుత్రుడు వంటి సినిమాలు తీశారు.

తర్వాత మళ్లీ మూడో సారి వారిద్దరి కాంబినేషన్లో ఓ మల్టీస్టారర్ చిత్రాన్ని తెరకెక్కించాలని పలువురు నిర్మాతలు భావించారు. అయితే ప్రతీసారి ఇలాంటి ప్రయోగాలు విజయాన్ని అందుకోలేవని.. చాలామంది ఈ మల్టీస్టారర్ తీయకపోవడమే మంచిదని సలహాలు ఇచ్చినప్పటికీ ఏఎన్ఆర్ మాత్రం నాగార్జునతో కలిసి కోదండరామిరెడ్డి దర్శకత్వంలో “ఇద్దరూ ఇద్దరే” అనే మల్టీస్టారర్ చిత్రాన్ని తెరకెక్కించారు. కానీ ఈ చిత్రంలో బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది.

ఈ సినిమాలో నాగేశ్వరరావు మంచివాడి పాత్రలో.. నాగార్జున చెడ్డవాడిగా నటించడం ఈ సినిమాకు మైనస్ పాయింట్ అయింది. దీనిని నాగార్జున అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. అలాగే స్క్రీన్ ప్లే విషయంలో కూడా కోదండరామిరెడ్డి ప్రయోగం ఫలించలేదని చెప్పవచ్చు. ఈ సినిమాలో రమ్యకృష్ణ హీరోయిన్ పాత్రలో నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయినప్పటికీ ఈ సినిమాలో ఒకే ఒక్క పాట హైలెట్ గా నిలిచింది. ‘ఓనమాలు నేర్పాలని అనుకున్నా.. అనే సాంగ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుందని చెప్పవచ్చు.