Tag Archives: hindu belives

Devotional Tips: మీ ఇంట్లో దేవుడికి కనీసం దీపం పెట్టే సమయం కూడా ఉండడం లేదా? అయితే ఇలా చేయండి..!

Devotional Tips: మారుతున్న జనరేషన్ కారణంగా మానవుని జీవన విధానంలో కూడా ఎంతో మార్పు వచ్చింది. ఈ క్రమంలో ప్రజలు గతంలో చేసినట్లుగా దేవుడికి పూజ కార్యక్రమాలు చేయలేకపోతున్నారు. మరి కొందరు ఉద్యోగాల పేరుతో బిజీ పనుల్లో మునిగిపోయి దేవుడి గదిలో కనీసం దీపం కూడా వెలిగించలేక పోతున్నారు.

Devotional Tips: మీ ఇంట్లో దేవుడికి కనీసం దీపం పెట్టే సమయం కూడా ఉండడం లేదా? అయితే ఇలా చేయండి..!

అలాంటి వారు ఈ విధంగా చేయడం మంచిదని తెలుస్తుంది.అదేమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.. దేవుడి గదిలో దీపం వెలిగించటానికి సమయం లేనివారి కోసం ఒక మార్గం ఉంది. అదేమిటంటే దీపం వెలిగించడానికి బదులుగా అగరవత్తులు వెలిగించుకొని ఇల్లంతా దూపాన్ని చూపించవచ్చు. కొంతమందికి ఉదయం అగరవత్తి వెలిగించడానికి కూడా సమయం ఉండదు.

Devotional Tips: మీ ఇంట్లో దేవుడికి కనీసం దీపం పెట్టే సమయం కూడా ఉండడం లేదా? అయితే ఇలా చేయండి..!

అలాంటి వారు ప్రశాంతంగా సాయంత్ర సమయంలో అయినా అగరవత్తుల దూపాన్ని వెగిలించవచ్చు. ఇక సాయంత్రం కూడా కుదరకపోతే రాత్రి సమయంలో అయినా పెట్ట వచ్చు. ఇక అది కూడా కుదరని వాళ్ళు మార్కెట్లో కొత్తగా దొరికే ధూప్ స్టిక్ ను దేవుడి గదిలో ఉపయోగించడం మంచిది.


వినాయకుడిని స్మరించుకోవాలి…

ఇక అంతే కాకుండా దేవుడి గదిలో దీపం పెట్టడానికి సమయం కుదరని వాళ్ళు వినాయకుని స్మరించి దీపారాధన చేస్తే మంచి ఫలితం దక్కుతుందని తెలుస్తుంది. ఇక దీంతోపాటు కుదిరినప్పుడల్లా వారానికి ఒకసారి దేవుడి గదిని శుభ్రంగా నీటుగా కడగడం మంచిది. ఇంకా గణనాథుడు సంబంధించిన కొన్ని శ్లోకాలు ఖాళీ సమయం దొరికినప్పుడు స్మరించడం మంచిది.

Sammakka-Sarakka: మేడారం జాతరలో.. ! బెల్లం బంగారంగా ఎందుకు మారింది..?

Sammakka-Sarakka: గిరిజన కుంభమేళా… మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు అంతా సిద్దం అయింది. ప్రతీ రెండేళ్లకు ఒకసారి జరిగే ఈ జాతరకు కోట్ల మంది ప్రజలు వస్తుంటారు. మాఘ శుద్ధ పౌర్ణమి రోజుల మొదలై నాలుగు రోజుల పాటు ఈ జాతర కొనసాగుతుంది.

Sammakka-Sarakka: మేడారం జాతరలో.. ! బెల్లం బంగారంగా ఎందుకు మారింది..?

పెద్ద ఎత్తున నిర్వహించే ఈ జాతరను 1996లో రాష్ట్ర పండగగా ప్రభుత్వం గుర్తించింది. తెలంగాణ ప్రభుత్వ జాతీయపండగగా సమ్మక్క- సారలమ్మ జాతరను గుర్తించాలని డిమాండ్ చేస్తోంది.  మన రాష్ట్రం నుంచే కాకుండా మహారాష్ట్ర, చత్తీస్గడ్, ఓడిషా రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. ఈసారి కూడా మేడారం జాతరకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంది.

Sammakka-Sarakka: మేడారం జాతరలో.. ! బెల్లం బంగారంగా ఎందుకు మారింది..?

ఇదిలా ఉంటే పూర్తిగా ఆదివాసీ సంప్రదాయాలతో ఈ మేడారం జాతర సాగుతుంది. అక్కడి నియమ నిబంధనలు కొందరికి కొత్తగా అనిపించ వచ్చు. ముఖ్యంగా బెల్లాన్ని బంగారంగా తల్లులకు సమర్పించడం చాలా మందికి వింతగా తోస్తుంది. 


సమ్మక్క భర్త అయిన పగిడిద్ద రాజులో..

బెల్లాన్ని బంగారంగా తల్లులకు ఎందుకు సమర్పిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. మేడారం జాతర మొదలైనప్పుడు కేవలం గిరిజన జాతరగానే ఉండేది. అయితే తరువాత పెద్ద సంఖ్యలో భక్తులు రావడం ప్రారంభించారు. గిరిజనులకు బెల్లం, ఉప్పు వేరే ప్రాంతాల నుంచి వస్తాయి. దీంతో వీటిని గిరిజనులు అపురూపంగా చూసుకుంటారు. కాలక్రమంలో ఈ బెల్లాన్నే సమ్మక్క-సారలమ్మలకు నైవేధ్యంగా సమర్పిస్తున్నారు. ఇదిలా ఉంటే మరో కథ కూడా ఉంది. సమ్మక్క భర్త అయిన పగిడిద్ద రాజులో పగిడిద్ద అంటే బంగారం అని..  దీంతో బెల్లాన్ని బంగారం అని పిలుస్తున్నారని అంటుంటారు. తమ కోరికలు నెరవేరిన వారు వారి బరువు ఉన్నంతగా బంగారాన్ని కొలిచి తల్లులకు సమర్పిస్తారు. పిల్లలు పుట్టాలని మొక్కుకునేవారు, లేకపోతే కోరిక తీరిన తరువాత బంగారాన్ని అమ్మవార్లకు నైవేధ్యంగా ఇస్తారు. పిల్లలకు జాబ్ వచ్చినా.. లేకపోతే ఏదైనా అనారోగ్య సమస్యలు తీరినా.. అనుకున్నట్లు కోరికలు నెరవేరినా.. తల్లులకు మొక్కకున్న విధంగా బెల్లాన్ని వారి ఎత్తు జోకించి నైవేధ్యంగా సమర్పిస్తారు.

Money Tips: వీటిని పూజ గదిలో ఉంచితే డబ్బులే డబ్బులు..! ఇంకెందుకు ఆలస్యం ఆ పని చేసేయండి..!

Money Tips: సాధారణంగాప్రతీ ఇళ్లలో బల్లులు ఉంటాయి. వీటిని చూసి చాల మంది భయపడుతాారు. కానీ హిందు శాస్త్రాల ప్రకారం బల్లులకు కూడా విశేష స్థానం ఉంది. మనపై బల్లులు పడటం కూడా రాబోయే మంచిని చెడుతు సూచిస్తాయని శాస్త్రాలు చెబుతుంటాయి.

Money Tips: వీటిని పూజ గదిలో ఉంచితే డబ్బులే డబ్బులు..! ఇంకెందుకు ఆలస్యం ఆ పని చేసేయండి..!

అయితే బల్లుల ఇళ్లలోని కొన్ని ప్రదేశాల్లో కనిపిస్తే మంచిదేనట. కానీ ఆలయంలో లేదా దేవుడి గుడిలో బల్లి కనిపిస్తే మంచిది. ఆది ధనం, సంతోషాన్ని సూచిస్తుందట. అంతే కాకుండా ఇంటిలోని వ్యక్తుల మధ్య ప్రేమానురాగాలకు చిహ్నమట.

Money Tips: వీటిని పూజ గదిలో ఉంచితే డబ్బులే డబ్బులు..! ఇంకెందుకు ఆలస్యం ఆ పని చేసేయండి..!

ఆర్థిక పరిస్థితిని మెరుగు పరుస్తుందని చెబుతున్నారు పండితులు. భవిష్యతు్లో ఎదురయ్యే సంఘటనలను కూడా బల్లులు సూచిస్తాయని చెబతున్నారు. ఇంట్లో దీపావళి రోజు బల్లి కనిపిస్తే శుభ సూచకం. బల్లి లక్ష్మీదేవిని సూచిస్తుందని అంటుంటారు. దీపావళి రోజు బల్లి కనిపిస్తే త్వరలోనే లక్ష్మీ దేవి వస్తుందని అంటుంటారు. 


పూడ్చిపెట్టిన బల్లి కానీ కనిపిస్తే..

ఇక బల్లులు ఇంట్లో కొట్లాడుకుంటే ఏమవుతుంది… బల్లి చనిపోతే ఎదురయ్యే సంకేతాలేమిటనేవి ఇప్పుడు చూద్దాం. కొత్తగా ఇంట్లోకి వచ్చేవారికి బల్లులు కనిపిస్తే మన పూర్వీకుల రాకను లేకపోతే తండ్రి రాకను సూచిస్తుంది. ఆ సమయంలో మన పూర్వీకులు బల్లి రూపంలో వచ్చి దీవిస్తారని నమ్ముతారు. ఇదిలా ఉంటే ఇంట్లోకి వచ్చే సమయంలో బల్లులు చనిపోయి కానీ… పూడ్చిపెట్టిన బల్లి కానీ కనిపిస్తే అశుభమని నమ్ముతారు. బల్లులు పోట్లాడుకుంటే మంచిది కాదట. కలలో మీరు  బల్లిని పట్లుకోవాలని ప్రయత్నిస్తే .. అది పారిపోతే మంచిదని నమ్మకం. రెండు బల్లులు కొట్లాడుకుంటే చూడకూడదట. అలా చేస్తే అశుభాలు కలుగుతాయట. ఇంట్లో బల్లులు కొట్లాడుకుంటే… ఆ ఇంట్లోని వ్యక్తుల మధ్య కూడా మనస్పర్థలు పెరుగుతాయని అంటున్నారు.

Womens: దహన సంస్కారాల్లో మహిళలు ఎందుకు పాల్గొనరు..! దూరంగా ఉండటానికి కారణం ఏంటి..?

Womens: ఇతర మతాలతో పోలిస్తే సంప్రాదాయ పరంగా హిందువుల సంప్రదాయాలు చాలా భిన్నంగా ఉంటాయి. పూర్వకాలం నుంచి వచ్చే ఆచార వ్యవహారాలను ఇప్పటికీ పాటిస్తూ ఉంటారు. అయితే వీటన్నింటికి ఎంతో కొంత సైంటిఫిక్ కారణాలు కూడా ఉంటాయి. 

Womens: దహన సంస్కారాల్లో మహిళలు ఎందుకు పాల్గొనరు..! దూరంగా ఉండటానికి కారణం ఏంటి..?

భూమిపై పుట్టినప్పటి నుంచి చనిపోయే దాకా ఈ ఆచారాలు పాటిస్తూనే ఉంటాం. మనిషి చనిపోయినప్పుడు కూడా వీటిని మరింత ఎక్కువగా పాటించడం మనం చూస్తూనే ఉంటాం. మనిషి చనిపోయినప్పుడు అతని ఆత్మ వెళ్లాలని ప్రార్థిస్తూ దహన సంస్కారాలు చేస్తుంటాం.

Womens: దహన సంస్కారాల్లో మహిళలు ఎందుకు పాల్గొనరు..! దూరంగా ఉండటానికి కారణం ఏంటి..?

అలాగే దింపుడుకళ్లెం వంటి ఆచారాలను నిర్వహిస్తుంటారు. హిందూ సంప్రదాయం ప్రకారం.. మనిషి చనిపోయిన తర్వాత పూడ్చడమో.. లేక కాల్చడమో చేస్తుంటారు. ఇదిలా ఉంటే హిందూ సంప్రదాయాల ప్రకారం మహిళలను శ్మశాన వాటికకు రాకుండా.. దహన సంస్కారాల్లో పాల్గొనరు. అయితే అసలు ఈ కార్యక్రమాల్లో మహిళలు ఎందుకు పాల్గొనరు ఇప్పుడు తెలుసుకుందాం.

ఇళ్లు శుభ్రం చేసే కార్యక్రమాలు చేస్తుంటారు..

పురుషులతో పోలిస్తే మహిళలు తొందరగా భావోద్వేగానికి గురవుతారు. దహన సంస్కారాలు నిర్వహించే సమయంలో భావోద్వేగాలతో మెంటల్ గా ప్రభావితం అయ్యే అవకాశం ఉంది. దీంతో మహిళలను దహన సంస్కారాలకు దూరంగా ఉంచుతారు. పూర్వకాలం నుంచి ఎవరి ఇంట్లో అయిన ఓ మనిషి చనిపోతే.. ఆ ఇంట్లో పిల్లల్ని, ముసలి వారిని  చూసుకుంటూ.. ఇళ్లు శుభ్రం చేసే కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. దీంతో శ్మశాన వాటికలకు వెళ్లేవారు కాదు. దహన సంస్కారాలకు వెళ్లి వచ్చేవారికి భోజనం చేసేవారు. ఇదిలా ఉంటే శ్మశాన వాటికలల్లో దుష్టశక్తులు ఉంటాయని నమ్ముతుంటారు. దీంతో మహిళలకు పెద్ద జుట్టు ఉండటంతో ఆవహించే ప్రమాదం ఉంటుందని నమ్ముతారు. ఆలాగే గర్భం దాల్చిన మహిళలు శ్మశాన వాటికలు వెళ్లడం నిషేధంగా ఉంది హిందూ సంప్రదాయంలో.

గుడికి వెళుతున్నారా…? అయితే ఈ రూల్స్ తప్పక పాంటించండి..!

దేవుడి భక్తి అనేది ప్రతీ ఒక్కరికీ ఉంటుంది. దానికి కొంత మంది గుళ్ల చుట్టూ తిరుగుతుంటారు. మరికొంత మందికి ఆ అలవాటు ఉండదు. ఇక ఆలయాలు దర్శించుకోవడం వెనుక శాస్త్రీయ ప్రయోజనాలు ఉన్నాయి. సాధారణంగా ఆలయాలను భూమిలోని మహత్తరమైన ఆకర్షణ శక్తి తరంగాలు ఎక్కడ ప్రసరిస్తూ ఉంటాయో అక్కడ ఆలయాన్ని నిర్మిస్తారు.

ఉత్తర దక్షిణ ధ్రువాల మధ్య ఎలా ఆకర్షణ శక్తి ఉంటుందో అలా భూమిలో పాజిటివ్ ఎనర్జీ పాసయ్యేచోట ప్రసిద్ధ దేవాలయాలు నిర్మించారు. అందుకే అలాంటి ఆలయాల్లో అడుగుపెట్టగానే మనసు ప్రశాంతంగా ఉంటుంది. అటువంటి ఆలయాల్లోకి ప్రవేశించినప్పుడు కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది.

ఆ నియమాలు ఏంటంటే.. ముందుగా గుడిచుట్టూ ప్రదక్షిణలు చేయాలి. అక్కడ ఎలాంటి ధ్వజ స్తంభం నీడనకానీ, ప్రాకారం నీడను కానీ ప్రదక్షిణ చేసే సమయంలో దాట కూడదు. దేవుడి విగ్రహం కింద నిలబడి ఎలాంటి అబద్ధాలు చెప్పకూడదు. దేవాలయంలో దేవుడికి వెనకాల కూర్చోకూడదు. దేవాలయంలోకి ప్రేవేశించిన ఏ భక్తుడు ఏడవకూడదు.

ఖాళీ చేతులతో దేవుడి గుడిలోకి వెళ్ల కూడదు. వస్త్రాలను కూడా సాంప్రదాయానికి విరుద్ధంగా ధరించడానికి వీళ్లేదు. ఇక గుడి దగ్గర యాచించే వాళ్లకు తోచిన సహాయం చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో గుడిలోకి జుట్టు విరబోసుకొని వెళ్లకూడదు. దేవుడికి ఎదురుగా నష్టాంగ నమస్కారం చేయకూడదు.

రేపటి నుంచి శ్రావణ మాసం.. మొదటి సోమవారం ఇలా పూజలు చేయండి.. !

శ్రావణ మాసం అనేది తెలుగు సంవత్సరంలో ఐదవ నెలలో వస్తుంది. శ్రవణం నక్షత్రంతో చంద్రుడు కలవడంతో ఈ నెలను శ్రావణ మాస నెల అంటారు. పురాణాల ప్రకారం ఈ శ్రావణ మాసం అనేది అత్యంత పవిత్రమైనదిగా చెబుతుంటారు. శివున్ని సోమవారం రోజున పూజిస్తే ఎంతో పుణ్యమని పెద్దలు అంటుంటారు. మిగతా తెలుగు నెలలకూ శ్రావణమాసానికీ చాలా తేడా ఉంది. శ్రావణమాసం ఎంతో ప్రత్యేకమైనది, విశిష్టమైనది, అత్యంత ముఖ్యమైనది.

రేపటి నుంచి అంటే (ఆగస్టు 9) నుంచి శ్రావణ మాసం మొదలవుతుంది. మొదటగానే శ్రావణ సోమవారం వచ్చింది. దీంతో రేపు శివుడికి ఎక్కువ పూజలు చేస్తారు. అంతేకాకుండా ఉపవాసం కూడా ఉంటారు. శ్రావణ సోమవారంరోజున శివలింగానికి చెరకు రసంతో పూజ చేస్తే.. ఆర్ధిక కష్టాలు తొలగుతాయి.

సంతానం లేనివారు శివలింగాన్ని పాలతో అభిషేకం చేయాలి. పేదవారికి దానధర్మం చేస్తే సంతాన భాగ్యం కలుగుతుందని శివ పురాణం చెబుతుంది. ఈ నెలంతా మహిళలు రకరకాల పూజలు, నోములు, వ్రతాలు చేస్తారు. ఉపవాస దీక్షలు చేస్తూ లక్ష్మీదేవి అమ్మవారికి రోజూ నైవేద్యం సమర్పిస్తూ… పూజలు చేస్తారు. శ్రావణ సోమవారం రోజున పాలు , పంచదార కలిసి అభిషేకం చేస్తే సుఖ సంతోషాలతో జీవిస్తారట. చాలా మంది ఈ నెలంతా మాంసం తినరు.

భక్తిశ్రద్ధలతో ఇష్టదైవాన్ని కొలుచుకుంటారు. ఈ నెలలో చేపలు కూడా ముట్టరు. ఇందుకు ఓ సైంటిఫిక్ కారణం కూడా ఉంది. సంవత్సర కాలంలో… ఈ నెలలోనే చేపలు ఎక్కువగా సంతానాన్ని వృద్ధి చేసుకుంటాయి. అందువల్ల వాటిని ముట్టుకోకుండా ఉంటే… మత్య్స సంపద పెరుగుతుంది. తద్వారా సంవత్సరమంతా చేపలు లభించేందుకు వీలవుతుంది.