Tag Archives: huzurabad

దళితబంధుకు బ్రేక్.. ఈసీ కీలక ఆదేశాలు..

హుజురాబాద్ ఉప ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పథకం దళితబంధు. దీనిని సీఎం కేసీఆర్ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఆర్థికంగా వెనుకబడిన దళిత కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల సాయం చేసేందుకు ప్రవేశపెట్టినదే దళితబంధు పథకం.

ఇప్పటికే ఈ పథకం కిందా చాలామందికి డబ్బులు కూడా క్రిడిట్ అయ్యాయి. అయితే ఉప ఎన్నిక నేపథ్యంలోనే ఈ పథకాన్ని ప్రవేశపెట్టారని.. దళితులపై ప్రేమ ఉంటే.. రాష్ట్రం మొత్తం అమలు చేయాలని ప్రతిపక్షాల డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.

అయితే ఈ రోజు ప్రగతి భవన్ లో జరిగిన సమావేశంలో రాష్ట్రం అంతటా దీనిని అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటామాని సీఎం చెప్పారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలోని నాలుగు దిక్కుల ఉన్న నాలుగు మండలాల్లో కూడా దీనిని అమలు చేస్తున్నారు. అందులో ఒకటి ఖమ్మం జిల్లాలోని చింతకాని మండలం కూడా ఉంది.

ఇదిలా ఉండగా.. ప్రస్తుతం హుజురాబాద్‌లో దళిత బంధు పథకానికి తాత్కాలికంగా బ్రేక్‌ పడింది. హుజురాబాద్‌ ఉప ఎన్నిక నేపథ్యంలో నియోజకవర్గ పరిధిలో దళిత బంధు అమలును నిలిపివేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నందున ఓటర్లు ప్రలోభానికి లోనుకాకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈసీ పేర్కొంది. అయితే ఉప ఎన్నిక తర్వాత ఈ పథకం యాథావిధిగా అమలు అవుతుందని స్పష్టం చేసింది.

హుజురాబాద్‌ హస్తం పార్టీ అభ్యర్థి ఆమెనా..?

తెలంగాణలో రాజకీయాలలో వేడి పుట్టిస్తున్న ఆంశం హుజురాబాద్ ఉపఎన్నిక. మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ రాజీనామాతో అనివార్యమైన హుజురాబాద్‌ ఉపఎన్నిక కోసం ప్రధాన రాజకీయ పార్టీలు సిద్దమవుతున్నాయి. తెరాస,బీజేపీ వ్యూహ ప్రతివ్యూహాలతో ముందుకు వెళ్తూ గెలుపు కోసం ప్రయత్నిస్తున్నాయి. మరో ప్రధాన కాంగ్రెస్ మాత్రం ఈ రేసులో కాస్త వెనుబడిందని చెప్పవచ్చు. ఇప్పడు అభ్యర్థిని కూడా ప్రకటించలేదు.

గ‌త ఎన్నిక‌ల్లో కాంగ్రెస్​ తరఫున పోటీ చేసిన పాడి కౌశిక్ రెడ్డి ఇప్పుడు గులాబీ కండువా కప్పుకున్నారు. దీంతో అభ్యర్థి కోసం కాంగ్రెప్ వేట మొదలు పెట్టింది. సామాజిక స‌మీక‌ర‌ణాల దృష్ట్యా పరిగణిలోకి తీసుకుని.. తెరాస, భాజపా… బీసీ అభ్యర్థిని బరిలో దింపాయి. కాంగ్రెస్ కూడా ఆ వర్గం నుంచే అభ్యర్థిని నిలపాలని చూస్తోంది. బీసీ అభ్యర్థి … మహిళా అభ్యర్థి అయినా కొండ సురేఖను బరిలోకి దింపే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఆక్టోంబర్‌లో హుజూరాబాద్ ఉపఎన్నిక?

హుజూరాబాద్ ఉపఎన్నికపై అందరిలో ఆసక్తి నెలకొంది. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఈ అంశం అత్యంత ప్రాధన్యం సతరించుకున్నది. తెరాసలో అత్యంత కీలక నేతగా ఉన్న ఈటల రాజేందర్ పై భూ ఆరోపణలు రావడం తర్వాత మంత్రి పదవి నుండి తొలగింపు.. దీంతో శాసనసభకు రాజీనామాతో హుజూరాబాద్ ఉపఎన్నిక అనివార్యమైంది. ఉప ఎన్నికపై ప్రధాన పార్టీలు దృష్టి పెట్టాయి. ప్రముఖంగా తెరాస,బీజేపీ మధ్య ప్రధాన పోటీ నెలకొంది. నువ్వా నేనా అనే రితిలో ఈ రెండు ప్రధాన పార్టీలు పోటీ పడుతున్నాయి.

Etela Rajender

అయితే ఉప ఎన్నిక ఎప్పుడూ అనేదానిపై ఇప్పటికి వరకు క్లారీటి రావడం లేదు. బద్వేల్ ఉపఎన్నికను పరిగణలోకి తీసుకుంటే సెప్టెంబర్ 28లోపు అక్కడ ఎన్నిక జరగాల్సి ఉంది. ఆరు నెలల్లోపే ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదల చేయాలనే ప్రథామిక నిబంధన ప్రకారం బద్వేల్‌లో ఉపఎన్నిక కోసం సెప్టెంబర్‌లో నోటిఫికేషన్ రావాలి. ఎన్నికల సంఘం ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకుంటే ఆక్టోంబర్‌లో హుజూరాబాద్ నుండి పశ్చిమబెంగాల్ వరకు ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంటుంది.

ఉద్యమ నేతకు దక్కిన గుర్తింపు_ మంత్రి తలసాని

హుజరాబాద్ నియోజకవర్గానికి టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించడం పై మంత్రి తలసాని స్పందించారు. యువకుడు, ఉత్సాహవంతుడైన గెల్లు శ్రీనివాస్ యాదవ్‌తో నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఉద్యమ నేతకు దక్కిన గుర్తింపుగా ఆయన అభివర్ణించారు.

కాగా రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడా లేవని తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న విపక్ష నేతలు, ఆ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఇటువంటి పథకాలను అమలు చేస్తారాని అని ప్రశ్నించారు.

ఇంద్రవెల్లి సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు_ సీతక్క

ఆదిలాబాద్ ఇంద్రవెల్లి సభను విజయవంతం చేసిన కాంగ్రెస్ కార్యకర్తలకు ఎమ్మెల్యే సీతక్క ధన్యవాదాలు తెలియజేశారు.ఆదిలాబాద్​ జిల్లా ఇంద్రవెళ్లి సభను విజయవంతం చేసిన ప్రజలకు, నేతలకు ములుగు ఎమ్మెల్యే సీతక్క ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల వచ్చిన ప్రతిసారి తెరాస ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నదని మండిపడ్డారు. హుజూరాబాద్​ ఉపఎన్నిక కోసమే సీఎం కేసీఆర్ దళిత బందు తీసుకు వచ్చారన్నారు.

కాగా గిరిజనుల పోడు భూములకు పట్టాల కోసం గత కొంత కాలంగా కాంగ్రెస్​ పార్టీ పోరాడుతోందని సీతక్క పేర్కొన్నారు. పోడు భూములకు కాంగ్రెస్​ హక్కులు కల్పించిందని చెప్పారు. ఇప్పటి వరకు ఎవరికి పట్టాలు ఇవ్వకుండా.. ఉన్న భూమిని లాక్కుంటున్న చరిత్ర కేసీఆర్​ది అని విమర్శించారు.

హుజురాబాద్ ఉపఎన్నిక షెడ్యూల్.. తెరాస అభ్యర్థి ఆయనే!

హుజురాబాద్ ఉపఎన్నిక షెడ్యూల్ త్వరలోనే వెలుబడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆగస్టు 6,7 తేదిల్లో షెడ్యూల్ రావొచ్చునన్న ప్రచారం జరుగుతోంది. దీనిపై ఎన్నికల కమిషన్ కసరత్తు చేపట్టినట్లుగా తెలుస్తోంది. ఇక ప్రధాన రాజకీయ పార్టీలు కూడా నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నాయి. దీనిపై ఇప్పటికే ప్రభుత్వానికి స్పష్టమైన సకేంతాలు ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే దళిత బంధు కార్యక్రమాన్ని కేసీఆర్ వాసాల మర్రి వేదికగా చకచకా ప్రకటించడం జరిగిందని వాదన వినిపిస్తోంది.

హుజూరాబాద్‌లో తెరాస,బీజీపీ మధ్యే ప్రధాన పోరు ఉండనున్నది. బీజేపీ నుంచి ఈటల బరిలో దిగనుండగా టీఆర్‌ఎస్ ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు. ఈ నెల 16వ తేదీన హుజురాబాద్‌ పర్యటన సందర్భంగా కేసీఆర్ టీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించవచే అవకాశం కనిపిస్తోంది. టీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్‌కు తెరాస టికెట్ దక్కనుందని తెలుస్తోంది. కేసీఆర్ కూడా ఆయన అభ్యర్థిత్వాన్ని దాదాపు ఖరారు చేశారనే ప్రచారం జరుగుతోంది.