Tag Archives: jio

Jeevitha Rajasekhar: జీవిత రాజశేఖర్ కు జియో పేరుతో కుచ్చుటోపి.. పోలీసుల అదుపులోకి నిందితుడు!

Jeevitha Rajasekhar:టెక్నాలజీ పెరగడంతో సైబర్ నేరగాళ్లు కూడా పెద్ద ఎత్తున మోసాలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలోనే సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీలు వరకు ఎంతో సునాయసంగా మోసపోతు లక్షల్లో డబ్బు పోగొట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే నటి జీవిత రాజశేఖర్ కు ఒక ఫోన్ కాల్ ద్వారా ఓ వ్యక్తి పరిచయమయ్యారు. తన పేరు ఫారుక్ అని పరిచయం చేసుకొని మీకు ఇంటర్నెట్ కనెక్షన్ ఇచ్చింది తానేనట్టు పరిచయం చేసుకున్నారు.

ఈ క్రమంలోనే ఇంటర్నెట్ కనెక్షన్ ఇవ్వడం ద్వారా జియో సేవలలో 50 శాతం డిస్కౌంట్ పేరుతో ఎలక్ట్రానిక్ వస్తువులను కొనుక్కొని చేసే ఆఫర్ ఉందని చెప్పారు. అయితే జీవిత ఏదో పనిలో ఉండి ఈ విషయాలన్నీ తన మేనేజర్ తో మాట్లాడాలని సూచించారు. ఈ క్రమంలోనే అటువైపు నుంచి ఆ వ్యక్తి జియో ఆఫర్ పేరిట రెండున్నర లక్ష రూపాయలు విలువ చేసే వస్తువులను ఆఫర్ ధరలో మీరు 1.25 లక్షల రూపాయలకే కొనుగోలు చేయవచ్చు అంటూ చెప్పారు.

ఇలా ఎలక్ట్రానిక్ వస్తువులు ఆఫర్లు రావడంతో జీవిత మేనేజర్ సదరు వ్యక్తి అకౌంట్ కు 1.25లక్షల రూపాయలు నగదును ట్రాన్స్ఫర్ చేశారు.ఇలా డబ్బు పంపిన తర్వాత అవతలి ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది దీంతో తాను మోసపోయానని గ్రహించిన జీవిత సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి పోలీసులకు జరిగిన విషయం మొత్తం తెలియజేశారు.

Jeevitha Rajasekhar: పోలీసుల అదుపులోకి నిందితుడు నరేష్..


ఈ క్రమంలోనే పోలీసులు ఫోన్ నెంబర్ ఆధారంగా విచారణ జరపగా ఆ వ్యక్తి ఫారుక్ కాదని గుర్తించారు.జియో ఆఫర్ పేరిట జీవిత రాజశేఖర్ దంపతులకు కుచ్చుటోపి పెట్టిన వ్యక్తి చెన్నైకి చెందిన నరేష్ అని పోలీసులు గుర్తించడమే కాకుండా తనని అదుపులోకి తీసుకున్నారు. ఇలా ఎంతోమంది ప్రతి రోజు సైబర్ నేరగాళ్ల మాయలో పడి పెద్ద ఎత్తున డబ్బును మోసపోతున్నారు.

JIO: ఒక్క క్లిక్ చాలు ప్రపంచం మీ ముందరే.. ! సరికొత్త ఇంటర్నెట్ టెక్నాలజీతో ముందుకు రానున్న రిలయన్స్ జియో..!

JIO: భారత టెలికాం రంగంలో రిలయన్స్ జియోకు ముందు జియో తర్వాత అని చూసుకోవాలి. అంతగా టెలికాం రంగంలో విప్లవానికి నాంది పలికింది. 4జీ నెట్వర్క్ గ్రామస్థాయి వరకు తీసుకుపోవడానికి సహాయపడింది. జియో దెబ్బకి అప్పటివరకు ఉన్న టెలికాం సంస్థలకు భారీ దెబ్బ పడింది. దేశంలో ప్రతి మూలకు ఇంటర్నెట్ చేరడంలో సక్సెస్ అయింది.

JIO: ఒక్క క్లిక్ చాలు ప్రపంచం మీ ముందరే.. ! సరికొత్త ఇంటర్నెట్ టెక్నాలజీతో ముందుకు రానున్న రిలయన్స్ జియో..!

తాజాగా మరో సంచలనానికి రిలయన్స్ జియో నాంది పలుకుతోంది. ఒక్క క్లిక్ తోనే మూడు గంటల సినిమా డౌన్ లోడ్ అయిపోతుంది. దేశంలోని మారుమూల పల్లెల్లో కూడా ఇంటర్నెట్ సేవలు పరుగులు తీస్తాయి. ప్రభుత్వ కార్యాలయాలలో సర్వర్ డౌన్ అనే మాట ఉండదు.

JIO: ఒక్క క్లిక్ చాలు ప్రపంచం మీ ముందరే.. ! సరికొత్త ఇంటర్నెట్ టెక్నాలజీతో ముందుకు రానున్న రిలయన్స్ జియో..!

ఏకంగా 100 ఎంబీపీఎస్ వేగంతో ఇంటర్నెట్ సేవలు అందనున్నాయి. దేశంలో ఏ ప్రాంతానికి వెళ్లిన ఫుల్ సిగ్నల్ వచ్చే విధంగా ఇంటర్నెట్ విప్లవానికి రిలయన్స్ జియో నాంది పలుకనుంది. శాటిలైట్ బ్రాడ్ బ్యాండ్ అందించేందుకు రెడీ అయ్యింది.


మల్టీ ఆర్బిట్ స్పేస్ టెక్నాలజీ ..

ఇందుకోసం రిలయన్స్ జియో లక్సెంబర్గ్ ఎస్ఈఎస్ జాయింట్ వెంచర్ ప్లాన్ చేసింది. ఈ జాయింట్ వెంచర్ లో జియోలో 51 శాతం వాటా, ఎస్ఈఎస్ కి 49 శాతం వాటా ఉంటుంది. అత్యాధునిక టెక్నాలజీతో బ్రాడ్ బ్యాండ్ సేవలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. దేశంలోని ఏ మూలకు అయినా శాటిలైట్ తోనే ఇంటర్నెట్ సర్వీసులు అందేలా ఏర్పాట్లు చేస్తున్నారు. మల్టీ ఆర్బిట్ స్పేస్ టెక్నాలజీ నెట్వర్క్ ద్వారా సర్వీసులు అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. శాటిటైల్ కంటెంట్ కనెక్టివిటీ లో ప్రపంచంలో నెంబర్ వన్ స్థానంలో ఉన్న ఎస్ఈఎస్ సంస్థ తో  రిలయన్స్ జియో ఈ డీల్ కుదుర్చుకోవడం దేశంలో డిజిటల్ విప్లవానికి మరింత దోహదం చేస్తుందని jio డైరెక్టర్ ఆకాశం అని అన్నారు.

Reliance Jio: వెనక్కి తగ్గిన రిలయన్స్ జియో.. ఆ ప్లాన్ పై రూ.102 తగ్గింపు..!

Reliance Jio రిలయన్స్ జియోతో పాటు ఇతర ప్రధాన టెలికాం ఆపరేటర్లు కొన్ని రోజుల క్రితం తమ అనేక ప్లాన్‌ల ధరలను పెంచేశాయి. కొన్ని ప్లాన్లను నిలిపివేశారు కూడా. వాటితో పాటు సవరించిన ప్లాన్లను ప్రవేశపెట్టారు. తాజాగా ఆ ధరలను రిలయన్స్ జియో తగ్గించింది. వాటి వివరాలిలా ఉన్నాయి.

గత ఏడాది రూ. 499 ప్లాన్ ను రూ. 601 కి పెంచింది. తర్వాత దానిని మళ్లీ రూ.499కి తీసుకొచ్చింది. ఇక ఈ రూ. 499 ప్లాన్ ఇప్పుడు 2GB రోజువారీ డేటాను అందిస్తుంది. పరిమితి తర్వాత.. వినియోగదారులు 64kbps స్పీడ్ తో డేటాను అందిస్తుంది. ఈప్లాన్ ప్రస్తుతం ఇప్పుడు 28 రోజుల కాలవ్యవధితో రిలయన్స్ జియో అందిస్తోంది.

అంతే కాకుండా.. Jio నుండి జియోకి , జియో నుంచి నాన్ జియోకి అపరిమిత వాయిస్ కాల్స్‌తో పాటు రోజుకు 100ఎస్ఎంఎస్ లు , జియో ప్రైమ్ మెంబర్‌షిప్‌ను అందిస్తుంది. రూ. 499 ప్లాన్ డిస్నీ + హాట్‌స్టార్ కాంబో సబ్‌స్క్రిప్షన్‌ను కూడా అందిస్తుంది. ఈ హాట్ స్టార్ ప్లాన్ అనేది ఎలాంటి రూపాయి కూడా చెల్లించకుండా సంవత్సరం వరకు ఉపయోగించుకోవచ్చు. అంతేకాదు.. ఉచితంగానే జియ్ టీవీ, జియో సినిమా వంటివి జియ్ యాప్ కలిగిని వారికి యాక్సెస్ ఉటుందని పేర్కొంది.

మరో ఆఫర్ ఇలా..


రిలయన్స్ జియో వార్షిక ప్లాన్‌పై హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్ వ్యవధిని రూ. 2,545కి పెంచుతుందని రిలయన్స్ జియో ప్రకటించింది. ఆఫర్ గతంలో జనవరి 2 వరకు మాత్రమే అందుబాటులో ఉండగా.. ఇది ఇప్పుడు ఈ సంవత్సరం జనవరి 7 వరకు అందుబాటులో ఉంటుందని తెలిపింది. ఆ తేదీకి ముందు రీఛార్జ్ చేసుకునే వినియోగదారులు అదనపు ప్రయోజనాలను పొందగలరు. రూ. 2,545 ప్లాన్ అనేది అపరిమిత కాల్‌లు, రోజుకు 100 SMSలు మరియు 336 రోజుల వ్యవధిలో 1.5GB రోజువారీ డేటాను అందించే వార్షిక ప్లాన్. అయితే.. హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్‌తో ప్లాన్ ఇప్పుడు అదనంగా 29 రోజుల చెల్లుబాటును అందిస్తుంది. ఇది సాధారణ 336 రోజులకు బదులుగా పూర్తి 365 రోజులకు ఉపయోగపడుతుంది.

జియో సంచలన నిర్ణయం.. 2,500 రూపాయలకే స్మార్ట్ ఫోన్..?

దేశీయ టెలీకాం రంగంలో జియో సృష్టించిన సంచలనాలు అన్నీఇన్నీ కావు. జియో రాకతో దేశంలోని ప్రజలకు అనేక ప్రయోజనాలు కలిగాయి. ఒకప్పుడు 1 జీబీ డేటా కోసం 100 రూపాయలకు పైగా ఖర్చు చేయాల్సి ఉండగా జియో తక్కువ ధరకే ఉచిత కాల్స్, డేటాకు ఛార్జీలను వసూలు చేస్తూ టెలీకం రంగంలో అంతకంతకూ ఎదుగుతోంది. అనంతరం జియో ఫోన్ల ద్వారా టెలీకాం రంగంలో జియో మరో సంచలనం సృష్టించింది.

ఫీచర్ ఫోన్లు అయిన జియో ఫోన్లలో కూడా వాట్సాప్, యూట్యూబ్ లను అందుబాటులోకి తెచ్చి జియో ఫీచర్ ఫోన్ల విక్రయాల్లో ఇతర కంపెనీలతో పోలిస్తే ఎక్కువ మార్కెట్ ను సొంతం చేసుకుంది. రోజురోజుకు ప్రజల్లో స్మార్ట్ ఫోన్ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో జియో మరో సంచలన నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. గతంలోనే జియో స్మార్ట్ ఫోన్ ను అందుబాటులోకి తెస్తామని కీలక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.

అయితే ఆ స్మార్ట్ ఫోన్ ధర అందరూ 4,000 రూపాయలకు అటూఇటుగా ఉంటుందని భావించారు. అయితే జియో మాత్రం అంతకంటే తక్కువ ధరకే స్మార్ట్ ఫోన్ ను అందుబాటులోకి తీసుకొస్తూ ఉండటం గమనార్హం. జియో కంపెనీ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ జియో సంస్థ 2,500 రూపాయల నుంచి 3,000 రూపాయల లోపు ధరకే స్మార్ట్ ఫోన్ ను అందుబాటులోకి తెస్తున్నట్టు వెల్లడించారు.
అయితే అధికారికంగా ఈ మేరకు ప్రకటన వెలువడాల్సి ఉంది.

2,500 నుంచి 3,000 రూపాయల లోపు స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి వస్తే ఇతర స్మార్ట్ ఫోన్ల అమ్మకాలపై జియో స్మార్ట్ ఫోన్ ప్రభావం తీవ్రంగా పడే అవకాశం ఉంది. అతి త్వరలో జియో స్మార్ట్ ఫోన్ ప్రజలకు అందుబాటులోకి రానుందని సమాచారం.