Tag Archives: kadapa

Sai Dharam Tej: ఇది నాకు పునర్జన్మ… మామయ్య అంటే ఎంతో ప్రాణం: సాయి ధరమ్ తేజ్

Sai Dharam Tej: మెగా మేనల్లుడు సాయి ధరంతేజ్ విరూపాక్ష సినిమా ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఈ సినిమా మంచి హిట్ కావడంతో సినిమాలకు కమిట్ అవుతున్నారు. ఈ క్రమంలోనే సాయిధరమ్ తేజ్ నటించిన విరూపాక్ష సినిమా ద్వారా హిట్ అందుకున్నటువంటి ఈయన త్వరలోనే బ్రో సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. ఈ సినిమా ఈనెల 28వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఈ విధంగా ఈ సినిమా విడుదల దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టారు. అయితే సాయి ధరమ్ తేజ ఈ మధ్యకాలంలో పలు దైవ దర్శనాలను సందర్శించుకుంటున్న విషయం మనకు తెలిసిందే . తాజాగా కడప అమీన్ దర్గాలో ఈయన సందడి చేశారు ఇక్కడ ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఈయన మాట్లాడుతూ పలు విషయాలు తెలియజేశారు.

రోడ్డు ప్రమాదం తర్వాత నేను బ్రతికి బయటపడ్డాను అంటే ఇది నాకు పునర్జన్మ. ఈ పునర్జన్మను ప్రసాదించిన దేవుడికి కృతజ్ఞతలు తెలుపుతూ ఇలా పలు ఆలయాలకు వెళ్తున్నానని సాయి ధరమ్ తేజ్ వెల్లడించారు. ఇక సినిమాల గురించి ఈయన మాట్లాడుతూ తను పవన్ కళ్యాణ్ మామయ్యతో సినిమా చేయడం ఒక గొప్ప అనుభూతిగా భావిస్తున్నాను ఇలా తనతో సినిమా చేసే అవకాశం రావడం నిజంగా నా అదృష్టం.

Sai Dharam Tej: ఇండస్ట్రీలో కొనసాగడమే ఇష్టం…


పవన్ కళ్యాణ్ మామయ్య అంటే తనకు ప్రాణం ఆయన ఏం చెబితే అదే చేస్తాను తనకు రాజకీయాలపై ఆసక్తి ఉంటే తనని రాజకీయాలలోకి రమ్మన్నారు. అయితే నాకు సినిమా ఇండస్ట్రీ అంటే ఇష్టమని తెలుసుకున్నటువంటి మామయ్య తనని ఇండస్ట్రీలోనే కొనసాగమని చెప్పారు అంటూ ఈ సందర్భంగా సినిమాల గురించి రాజకీయాల గురించి సాయి ధరమ్ తేజ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఇద్దరూ కలిసి సహజీవనం చేశారు.. అతనిలో అనుమానం.. ఊహించని విధంగా శవమై తేలింది..

ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేసుకుంటూ ఇద్దరు ప్రేమలో పడ్డారు. ఒకరిని విడిచి ఒకరు విడిపోయి ఉండలేనంతగా ప్రేమించుకున్నారు. ఇద్దరు కలిసి పెద్దలను ఒప్పించి పెళ్లి కూడా చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. కానీ ఇరు కుటుంబాల్లో వీళ్లకంటే పెద్ద వాళ్లకు పెళ్లిళ్లు కాలేదు. ఇప్పుడు ఈ విషయం ఇంట్లో చెబితే ఒప్పుకోరనే ఉద్దేశ్యంతో చెప్పలేదు. కొన్నాళ్లు ఆగిన తర్వాత చెబుదాం అనుకొని అక్కడే ఓ రూం తీసుకొని ఉంటున్నారు.

చివరకు ఓ రోజు ఆమె ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మరణించింది. దీనికి సంబంధించి వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా రేణిగుంటకు చెందిన అంటోనీ గీత అనే యువతి.. కడప నగరంలోని నాగరాజుపేటకు చెందిన అనిల్ కుమార్.. అదే ప్రాంతంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పనిచేస్తున్నారు. అక్కడ వీరిద్దరు ఒకరినొకరు ఇష్టపడ్డారు. జాబ్ బంద్ చేసిన తర్వాత వీళ్లు అదే ప్రాంతంలోనే వేర్వేరు ఆసుపత్రుల్లో పనిచేస్తున్నారు.

ప్రేమించుకున్న వీళ్లు పెళ్లి కూడా చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. కానీ ఇంట్లో చెప్పలేక పోయారు. ఇద్దరి ఇళ్లలో పెళ్లికావాల్సిన పెద్దవాళ్లుండటంతో కొన్నాళ్లు ఆగుదామని భావించారు. అయితే వీరిద్దరు ఒకే ప్రాంతంలో ఉండటంతో రూం తీసుకొని అక్కడే సహజీవనం చేస్తున్నారు. కొన్నాళ్ల వరకు బాగానే ఉన్నా తర్వాత అనిల్ కు గీతపై అనుమానం పెంచుకున్నాడు. నిన్ను నమ్మి నీతో ఉంటున్నా.. నన్ను మోసం చేస్తున్నావంటూ అతడు అనడంతో .. ఆమె తీవ్ర మనస్థాపం చెందింది.

అతడు లేని సమయం చూసి ఓ రోజు డాబాపైకి ఎక్కి ఇంజక్షన్ ద్వారా విషం ఎక్కించుకొని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆమె తల్లిదండ్రులకు సమాచారం అందించారు. గీత తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అనిల్ ను తమ అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.

వైయస్ వివేకా హత్య కేసులో కొనసాగుతున్న విచారణ!

ఏపీ మాజీ మంత్రి వైయస్ వివేకా హత్యలో సీబీఐ విచారణ 69వ రోజు కొనసాగింది. అధికారులు రెండు బృందాలుగా పులివెందులలో విచారణ చేపట్టారు. తుమ్మలపల్లి కర్మాగారంలో పనిచేసే ఉద్యోగి ఉదయ్ కుమార్ రెడ్డితో పాటు ఆయన తండ్రి ప్రకాష్ రెడ్డిని అధికారులు ప్రశ్నించారు .

కాగా విచారణలో భాగంగా అధికారులు ఇద్దరు అనుమానితులను విచారించారు. సీబీఐ కస్టడీలో ఉన్న సునీల్​యాదవ్​తో పాటు అతని సమీప బంధువు భరత్​కుమార్​ యాదవ్​ను ప్రశ్నించారు. వివేకా కుమార్తె సునీత.. తనకు భద్రత కల్పించాలని ఎస్పీకి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో పులివెందుల పోలీసులు వివేకా ఇంటి వద్ద పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. అంతేకాక ఈనెల 10న పులివెందుల వివేకా ఇంటి వద్ద అనుమానాస్పదంగా తిరిగినా మణికంఠరెడ్డిని ఇవాళ పోలిసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పలు విషయాలపై మణికంఠ రెడ్డిని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అనంతరం… మణికంఠ రెడ్డిపై బైండోవర్ కేసు నమోదైంది. .

అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురి మృతి

కడప జిల్లాలో శుక్రవారం అర్ధరాత్రి 1గంట సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మైదుకూరు –బద్వేలు జాతీయ రహదారిపై డి. అగ్రహారం వద్ద ఇన్నోవా, మినీ లారీ ఢీకొనడంతో ఐదుగురు వ్యక్తులు మృతి చెందారు. మరో ఇద్దరూ తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్ప పోందుతున్నారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు చెందిన ఏడుగురు వ్యక్తులు ఇన్నోవాలో కడపలో జరిగే వివాహా కార్యక్రమానికి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది.

చిత్తూరు నుంచి టమాటా లోడుతో వస్తున్న మినీ లారీ డి.అగ్రహారం వద్ద ఉన్న స్పీడ్‌ బ్రేకర్ల కారణంగా ఇన్నోవాను ఢికొట్టింది. పరిమితి మిచ్చిన వేగంతో ఉన్న రెండు ఒకదానికి ఒకటి బలంగా ఢీకొనడంతో ఈ ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంది. మృతదేహాలను బద్వేలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేశారు.