Tag Archives: Kaikala Satyanarayana

Posani Krishna Murali: కైకాల సత్యనారాయణ మరణం గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన పోసాని.. చెంచాగిరి అంటూ కామెంట్స్!

Posani Krishna Murali: నవరస నట సార్వభౌముడు కైకాల సత్యనారాయణ శుక్రవారం తెల్లవారుజామున తీవ్రమైన అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటూ మరణించారు. ఈయన మరణ వార్త తెలుసుకున్నటువంటి సినీ సెలబ్రిటీలు పెద్ద ఎత్తున ఆయన నివాసానికి చేరుకొని తన మృతికి ప్రగాఢ సంతాపం తెలియజేశారు.

ఇక కైకాల మరణ వార్త తెలుసుకున్నటువంటి ఎంతోమంది సినీ రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా కూడా తన మృతికి సంతాపం ప్రకటిస్తూ పోస్టులు చేశారు. ఈ క్రమంలోనే రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సైతం కైకాల మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

ఈ క్రమంలోనే ఇండస్ట్రీలో తరచూ ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా వార్తలలో నిలిచి ఉండే పోసాని కృష్ణమురళి సైతం కైకాల సత్యనారాయణ మరణం గురించి స్పందిస్తూ చేసినటువంటి కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి పోసాని సత్యనారాయణ మరణం గురించి ఎలా స్పందించారు అనే విషయానికి వస్తే…

Posani Krishna Murali: నిజాయితీగా బతికిన నటుడు కైకాల…

చెంచాగిరి చేయకుండా… డ్రామాలు ఆడకుండా నిజాయితీగా బతికిన నటుడు కైకాల సత్యనారాయణ. కాలం ఉన్నంతవరకు కాకపోయినా సినీ కళాకారులు బ్రతికున్నంత కాలం బ్రతికి ఉండే నటుడు కైకాల గారు..జోహార్ అంటూ ఆయన మృతి పట్ల స్పందిస్తూ ఈయన చేసినటువంటి కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Kaikala Satyanarayana: ఏపీ సీఎం జగన్ కు లేఖ రాసిన కైకాల.. శ్రద్ధ చూపినందుకు ధన్యవాదాలు అంటూ!

Kaikala Satyanarayana: తెలుగు సినిమా ఇండస్ట్రీలో సీనియర్ నటుడిగా ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించి ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్న కైకాల సత్యనారాయణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే నవంబర్ నెలలో కైకాల సత్యనారాయణ తీవ్ర అనారోగ్య సమస్యతో బాధపడుతూ ఆస్పత్రిలో చేరిన విషయం మనకు తెలిసిందే.

Kaikala Satyanarayana: ఏపీ సీఎం జగన్ కు లేఖ రాసిన కైకాల.. శ్రద్ధ చూపినందుకు ధన్యవాదాలు అంటూ!

ఇలా అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన కైకాల ప్రస్తుతం పూర్తిగా కోలుకుని ఆరోగ్యంగా ఉన్నారు. ఈ క్రమంలోనే కైకాల సత్యనారాయణ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి లేఖ రాశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తనకు అనారోగ్య సమస్య చేసినప్పుడు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని సహాయం అందించి తన ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవడంతో కైకాల సంతోషం వ్యక్తం చేస్తూ ఏపీ సీఎం జగన్ కు లేఖ రాసి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

Kaikala Satyanarayana: ఏపీ సీఎం జగన్ కు లేఖ రాసిన కైకాల.. శ్రద్ధ చూపినందుకు ధన్యవాదాలు అంటూ!

ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియ చేయడమే కాకుండా తన అనారోగ్య సమస్యతో బాధపడుతున్న సమయంలో తన కుటుంబానికి అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.

మీ సహాయం నా కుటుంబానికి శక్తినిచ్చింది..

అనారోగ్య సమస్యతో ఆస్పత్రి పాలైనప్పుడు ఎంతో బిజీ షెడ్యూల్ లో ఉండి కూడా వ్యక్తిగతంగా నన్ను పరామర్శించారు. ప్రభుత్వం నుంచి నాకు కావాల్సిన సహాయాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు. మీరు చెప్పిన విధంగానే ఉన్నతాధికారులు నన్ను సంప్రదించి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు నేను కష్ట సమయాల్లో ఉన్నప్పుడు మీరు చేసిన సహాయం నాకు నా కుటుంబానికి అద్భుతమైన శక్తిని ఇచ్చిందని, కళాకారుల పట్ల మీరు చూపిస్తున్న గౌరవం, ప్రజల పట్ల మీరు చూపిస్తున్న శ్రద్ధ చూస్తుంటే రాష్ట్రం మంచి చేతులలో ఉందనే భరోసా వస్తుందని కైకాల పేర్కొన్నారు.

కైకాల సత్యనారాయణ ఆరోగ్యం గురించి స్పందించిన కూతురు రమాదేవి..!

పౌరాణిక చిత్రాల్లో అతడిని మించిన నటుడు లేరు.. ఏ పాత్రలోనైనా జీవించి నటిస్తారు.. అతడే కైకాల సత్యనారాయణ. ఇటీవల అతడు అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ప్రస్తుతం అతడు కోలుకుంటున్నట్లు వైద్యులు బులిటెన్ ద్వారా తెలియజేశాడు. అయితే మొన్న చిరంజీవి కైకాల సత్యనారాయణ తనతో మాట్లాడారని.. అతడు కోలుకుంటున్నట్లు కూడా చెప్పాడు.

ఆ సమాచారాన్ని చిరంజీవే తెలిపారు. ఈ విషయం అందరికీ తెలిసిందే. అపోలో ఆసుపత్రి వైద్యులూ ఆయన ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు హెల్త్ బులెటిన్ ను విడుదల చేస్తున్నారు. తాజాగా ఆయన కూతురు రమాదేవి కూడా ఆయన ఆరోగ్యంపై స్పందించారు.

ఆడియో వాయిస్ ద్వారా ఆమె సందేశాన్నిచ్చారు. కైకాల సత్యనారాయణ ఆరోగ్యం ప్రస్తుతం మెరుగవుతోందని.. ప్రతీ ఒక్కరితో మాట్లాడుతున్నారని.. ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆమె అన్నారు. కొన్ని సందర్భాల్లో కొంతమంది సోషల్ మీడియాలో ఆయన పరిస్థితి విషమించిందనే వార్తలు వచ్చాయి… అలాంటి వార్తలు నమ్మోద్దని చెప్పారు.

ఇలాంటి అనవసర వార్తలతో జనాలను ఆందోళనకు గురి చేయవద్దని ఆమె విజ్ఞప్తి చేశారు. మొదట అతడు ఆసుపత్రిలో వైద్యానికి ఆయన స్పందించడంలేదని ప్రకటించడంతో ఆందోళన నెలకొన్న సంగతి తెలిసిందే. తర్వాత అతడు స్పదిస్తున్నారని వైద్యులే చెప్పారు. మూడు రోజులుగా అతడు అపోలో చికిత్స తీసుకుంటున్న విషయం తెలిసిందే. అతడు త్వరగా కోలుకోవాలని సగటు తెలుగు అభిమానులు ఆ దేవుడిని ప్రార్థిస్తున్నారు.

కైకాల సత్యనారాయణకు రేపుల అనే పేరు ఎలా వచ్చిందో తెలుసా?

కైకాల సత్యనారాయణ ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఇతను తెలుగు సిని ఇండస్ట్రీలో నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరుచుకున్నారు.ఆయన దాదాపు 700 సినిమాలకు పైగా నటించాడు.నటుడిగా అతను పౌరాణిక, సాంఘిక, చారిత్రక, జానపద పాత్రలు చేసారు. దాదాపుగా ఆరు దశాబ్దాల నటనా జీవితంలో ఎన్నో గొప్ప గొప్ప సినిమాల్లో నటించారు.

అంతేకాకుండా ఏడాదికి పదికి పైగా చిత్రాలు చేసేవారు. వీటిలో ఎక్కువగా ఆయన విలన్ పాత్రలో చేసిన సినిమాలే ఉన్నాయి. ఎన్టీఆర్, ఏఎన్నార్ ల నుంచి బాలకృష్ణ,నాగార్జున, చిరంజీవిల సినిమాలలో విలన్ పాత్రలో నటించారు. యుక్త వయసులో ఉన్న కైకాల సత్యనారాయణకు, అమ్మాయిలను మోసం చేయడం, మానభంగాలకు పాల్పడడం, హింసించడం లాంటివి పాత్రలు ఎక్కువగా దక్కేవి. దీనితో ఆ పాత్రలో లీనమై ఆ పాత్రలలో విలనిజం పండించేవారు.

దీంతో అప్పట్లో ఆయనకు సొసైటీలో పూర్తిగా నెగిటివ్ ఇమేజ్ ఉండేది. మరీ ముఖ్యంగా అంటే ఆడవాళ్ళు కైకాల సత్యనారాయణ అంటే మండిపడే వారు. ఒకసారి ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న కైకాల సత్యనారాయణ పై ఆడవారు మాటల దాడి చేశారట. ఎందుకయ్యా ఆడవాళ్ళ జీవితాలతో ఆడుకుంటారని ఒక మహిళ నిలదీసిందట. ఈ విషయాలన్నీ కూడా కైకాల ఒక ఇంటర్వ్యూ లో పంచుకున్నారు.

ఇక ఆ రోజుల్లో ఈయన ఎక్కువగా మహిళలపై అత్యాచార పాత్రలో నటించడం వల్ల ఈయనను రేపుల నారాయణ అని కూడా పిలిచే వారట. సినిమాలో జరిగే దానిని నిజంగా భావించి అమాయకత్వం ప్రజలు, హీరో హీరోయిన్ లను అమితంగా ప్రేమించేవారు. కానీ విలన్ పాత్రలు చేసే నటులపై మాత్రం కోపం పెంచుకునేవారు. ప్రేక్షకులకు అంతలా కోపానికి గురి చేసి అంతా సహజమైన నటన నటించేవారు కైకాల సత్యనారాయణ. ఆ తర్వాత వయసు మీద పడటంతో విలన్స్ పాత్రలు తగ్గించి క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా ఎన్నో సినిమాల్లో నటించారు.