పౌరాణిక చిత్రాల్లో అతడిని మించిన నటుడు లేరు.. ఏ పాత్రలోనైనా జీవించి నటిస్తారు.. అతడే కైకాల సత్యనారాయణ. ఇటీవల అతడు అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ప్రస్తుతం అతడు కోలుకుంటున్నట్లు వైద్యులు బులిటెన్ ద్వారా తెలియజేశాడు. అయితే మొన్న చిరంజీవి కైకాల సత్యనారాయణ తనతో మాట్లాడారని.. అతడు కోలుకుంటున్నట్లు కూడా చెప్పాడు.
ఆ సమాచారాన్ని చిరంజీవే తెలిపారు. ఈ విషయం అందరికీ తెలిసిందే. అపోలో ఆసుపత్రి వైద్యులూ ఆయన ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు హెల్త్ బులెటిన్ ను విడుదల చేస్తున్నారు. తాజాగా ఆయన కూతురు రమాదేవి కూడా ఆయన ఆరోగ్యంపై స్పందించారు.
ఆడియో వాయిస్ ద్వారా ఆమె సందేశాన్నిచ్చారు. కైకాల సత్యనారాయణ ఆరోగ్యం ప్రస్తుతం మెరుగవుతోందని.. ప్రతీ ఒక్కరితో మాట్లాడుతున్నారని.. ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆమె అన్నారు. కొన్ని సందర్భాల్లో కొంతమంది సోషల్ మీడియాలో ఆయన పరిస్థితి విషమించిందనే వార్తలు వచ్చాయి… అలాంటి వార్తలు నమ్మోద్దని చెప్పారు.
ఇలాంటి అనవసర వార్తలతో జనాలను ఆందోళనకు గురి చేయవద్దని ఆమె విజ్ఞప్తి చేశారు. మొదట అతడు ఆసుపత్రిలో వైద్యానికి ఆయన స్పందించడంలేదని ప్రకటించడంతో ఆందోళన నెలకొన్న సంగతి తెలిసిందే. తర్వాత అతడు స్పదిస్తున్నారని వైద్యులే చెప్పారు. మూడు రోజులుగా అతడు అపోలో చికిత్స తీసుకుంటున్న విషయం తెలిసిందే. అతడు త్వరగా కోలుకోవాలని సగటు తెలుగు అభిమానులు ఆ దేవుడిని ప్రార్థిస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…