ఇటీవల మెగా హీరో సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదంలో గాయపడి.. చికిత్స అనంతరం అపోలో ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన విషయం తెలిసిందే. దాదాపు 20 రోజుల వరకు చికిత్స పొందిన ధరమ్ తేజ్ కోలుకొని.. తన పుట్టిన రోజునే ఇంటికి వెళ్లారు. ఆ రోజు నుంచి కూడా అతడు మీడియా ముందుకు వచ్చి మాట్లాడలేదు.
తన ఆరోగ్యం గురించి తన ట్విట్టర్ ఖాతాలో అప్ డేట్ ఇచ్చేవాడు. ఇలా తన అభిమానులతో ట్విట్టర్ ద్వారా ముచ్చటించేవారు. అయితే తాజాగా అతడు మీడియా ముందుకు వచ్చి మాట్లాడనున్నారు. తేజ్ కి సంబంధించిన ఒకటి రెండు ఫొటోలో బయటకు వచ్చాయి. ఆ ఫొటోలను తన కుటుంబసభ్యులే విడుదల చేశారు.
అతడు హీరోగా నటించిన రిపబ్లిక్ సినిమాకు సంబంధించి శాటిలైట్, ఓటీటీ హక్కుల్ని జీ5 సొంతం చేసుకుంది. దీనిలో భాగంగానే జీ5 టీమ్ రిపబ్లిక్ ప్రీమియర్స్‌కి సంబంధించిన ఓ ప్రెస్‌మీట్ ను నిర్వహించనుంది. ఈ మీట్ లో చిత్రబృందం పాల్గొనబోతోంది. ఆ మీట్ లోనే తేజ్ పాల్గొననున్నారు.
ప్రమాదం తర్వాత రిపబ్లిక్ సినిమాకు సంబంధించి ఎలాంటి ఈవెంట్లకు హాజరు కాలేదు. ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా అతడు పాల్గొనలేదు.
మొదటి సారి మీడియా ముందుకు వస్తుండటంతో అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రమాదం గురించి మీడియాలో వివిధ రకాల కథానాలు వచ్చినప్పటికీ దేనికి వాస్తవ రూపం లేదు. ప్రమాదానికి గురైన తేజ్ చెబితేనే అది ఎలా జరిగిందో తెలియనుంది. అతడి నోటి వెంట.. ప్రమాదం ఎలా జరిగిందనే విషయాలను చెబుతారో లేదో చూడాలి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…