ప్రమాదం తర్వాత మొదటి సారి మీడియా ముందుకు సాయిధరమ్ తేజ్..?

0
90

ఇటీవల మెగా హీరో సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదంలో గాయపడి.. చికిత్స అనంతరం అపోలో ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన విషయం తెలిసిందే. దాదాపు 20 రోజుల వరకు చికిత్స పొందిన ధరమ్ తేజ్ కోలుకొని.. తన పుట్టిన రోజునే ఇంటికి వెళ్లారు. ఆ రోజు నుంచి కూడా అతడు మీడియా ముందుకు వచ్చి మాట్లాడలేదు.

తన ఆరోగ్యం గురించి తన ట్విట్టర్ ఖాతాలో అప్ డేట్ ఇచ్చేవాడు. ఇలా తన అభిమానులతో ట్విట్టర్ ద్వారా ముచ్చటించేవారు. అయితే తాజాగా అతడు మీడియా ముందుకు వచ్చి మాట్లాడనున్నారు. తేజ్ కి సంబంధించిన ఒకటి రెండు ఫొటోలో బయటకు వచ్చాయి. ఆ ఫొటోలను తన కుటుంబసభ్యులే విడుదల చేశారు.

అతడు హీరోగా నటించిన రిపబ్లిక్ సినిమాకు సంబంధించి శాటిలైట్, ఓటీటీ హక్కుల్ని జీ5 సొంతం చేసుకుంది. దీనిలో భాగంగానే జీ5 టీమ్ రిప‌బ్లిక్ ప్రీమియ‌ర్స్‌కి సంబంధించిన ఓ ప్రెస్‌మీట్ ను నిర్వహించనుంది. ఈ మీట్ లో చిత్ర‌బృందం పాల్గొన‌బోతోంది. ఆ మీట్ లోనే తేజ్ పాల్గొననున్నారు.
ప్రమాదం తర్వాత రిపబ్లిక్ సినిమాకు సంబంధించి ఎలాంటి ఈవెంట్లకు హాజరు కాలేదు. ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా అతడు పాల్గొనలేదు.

మొదటి సారి మీడియా ముందుకు వస్తుండటంతో అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రమాదం గురించి మీడియాలో వివిధ రకాల కథానాలు వచ్చినప్పటికీ దేనికి వాస్తవ రూపం లేదు. ప్రమాదానికి గురైన తేజ్ చెబితేనే అది ఎలా జరిగిందో తెలియనుంది. అతడి నోటి వెంట.. ప్రమాదం ఎలా జరిగిందనే విషయాలను చెబుతారో లేదో చూడాలి.