పట్టిందల్లా బంగారమే అనేది పెద్దలు చెబుతుంటారు. అలాంటి సామెత కచ్చితంగా టాలీవుడ్ హీరోయిన్ పూజా హెగ్డేకు సరిపోతుంది. ఎందుకంటే.. ఆమె ఇటీవల ఏ సినిమా చేసినా.. బంపర్ హిట్ తో దూసుకుపోతోంది. ప్రస్తుతం టాలీవుడ్ లో విజయవంతమైన హీరోయిన్ గా కొనసాగుతోంది. ఇప్పటికే ఆమె చేతిలో ఎన్నో సినిమా ప్రాజెక్టులు ఉన్నాయి.
అయితే ఇటీవల ఆమె వెకేషన్ కోసం మాల్దీవులకు వెళ్లింది. అక్కడ తెగ సందడి చేస్తూ నానా రచ్చ చేసింది. ప్రశాంతమైన సాగర తీరంలో హాయిగా సేద తీరారు. మాల్దీవులకి సంబంధించిన అప్‌డేట్స్ ఇస్తూ మతులు పోగొడుతుంది పూజా హెగ్డే. ఇందులో పూజా క్యూట్ లుక్స్ ను ఆమె తన సోషల్ మీడియాలో పోస్టు చేసింది. దానిని చూసిన నెటిజన్లు మతి పోయింది.
తాజాగా పూజా హెగ్డే బికినీ వేసి హాట్ హాట్ అందాలతో కేక పెట్టించింది. పూజా హాట్ డ్యాన్స్ కి కుర్రకారు గుండెల్లో రైళ్లు పరుగెత్తాయి. ఇలా ఉండగా.. ఆమె ఉదయం తన బెడ్ మీద నుంచి లేచి.. తన ఫోన్ చూసుకుంది. ఫోన్ చూసిన వెంటనే ఎంతో సంతోషంగా బెడ్ పైనే ఆమె డ్యాన్స్ వేసింది. ఎందుకో తెలుసా.. ఆమె సోషల్ మీడియాలో ప్లాట్ ఫాంలో అంటే.. ఇన్ స్టా, ఫేస్ బుక్, ట్విట్టర్ లో తన ఫాలోవర్స్ ప్రతీ రోజు పెరుగుతూనే ఉన్నారు.
తాజాగా ఇన్ స్టాలో ఆమె ఫాలోవర్స్ 16 మిలియన్ కు చేరుకుంది. దీంతో ఆమె తన సంతోషాన్ని డ్యాన్స్ రూపంలో చూపించారు.మీ అభిమానాన్ని ఇలానే చూపించాలని.. ఇంతగా తనపై ప్రేమను కురిపిస్తున్న ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు పూజా హెగ్డే. అయితే ఆమె బెడ్ పై వేసిన డ్యాన్స్ కు సంబంధించిన వీడియోలను తన ఇన స్టాలో పోస్టు చేశారు. అది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తాజాగా.. ఈ ముద్దుగుమ్మ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ చిత్రంతో మంచి హిట్ కొట్టింది. చిరంజీవి-చరణ్ ల మల్టీ స్టారర్ ఆచార్య, ప్రభాస్ రాధే శ్యామ్ వంటి భారీ ప్రాజెక్ట్స్ పూజా హెగ్డే ఖాతాలో ఉన్నాయి. సంక్రాంతి కానుకగా విడుదల కానున్న రాధే శ్యామ్ పై భారీ అంచనాలు పెట్టుకున్నారు నెటిజన్లు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…