సగటు తెలుగు ప్రేక్షకుడు ఎప్పటికీ మర్చిపోలేని సినిమా జగదేక వీరుడు.. అతిలోక సుందరి. అంతలా ఆ సినిమా ప్రతీ ఒక్కరినీ ఆకట్టుకుంది. అందులో అలనాటి తార.. దివి నుంచి దిగి వచ్చిన సుందరిగా కనిపించిన శ్రేదేవి నటన ఓ అద్భుతమనే చెప్పాలి. అయితే ఆమె కూతురు జాన్వీ కపూర్ ఇప్పుడు బాలీవుడ్లో టాప్ హీరోయిన్లలో ఒకరుగా నిలిచారు.
ఆమె చేసింది తక్కువ సినిమలే అయినా.. తన అందం.. అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. మొదటి సినిమాతోనే తన టాలెంట్ ను నిరూపించుకుంది. దీంతో ఆమెకు అభిమానులు క్యూ కట్టారు. ఇలా ఆమె సోషల్ మీడియా అకౌంట్లకు కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. ప్రస్తుతం ఆమె రెస్ట్ లేకుండా.. వరుస సినిమాలతో బిజీ బిజీగా మారారు.
అయితే అమె గత కొన్ని రోజుల నుంచి టాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వబోతుందనే వార్తలు వస్తున్నాయి. గతంలో కూడా ఆమె తెలుగులో కృష్ణ వంశీ దర్శకత్వంలో ఓ సినిమా మరియు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా తీయబోతున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. కానీ ఎలాంటి అప్ డేట్ రాలేదు. తాజాగా మరో వార్త వినిపిస్తోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన.. కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా రాబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది.
ఇక.. ఎన్టీఆర్ 30 వ సినిమాకు ముందుగా హీరోయిన్ గా శ్రీలీలను అనుకోగా.. మళ్లీ ఇప్పుడు జాన్వీ కపూర్ ను అనుకుంటున్నారట. దీంతోనే టాలీవుడ్ లో జాన్వీ ఎంట్రీ ఇస్తుందనే వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే జాన్వీతో సంప్రదింపులు కూడా జరుగుతున్నాయట. ఈ సినిమాకు సంబంధించిన విషయాలను త్వరలోనే ప్రకటించనున్నారు. అధికారికంగా మాత్రం వెల్లడి కాలేదు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…