ఎన్టీఆర్ సరసన..టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్న జాన్వీకపూర్.. !

0
160

సగటు తెలుగు ప్రేక్షకుడు ఎప్పటికీ మర్చిపోలేని సినిమా జగదేక వీరుడు.. అతిలోక సుందరి. అంతలా ఆ సినిమా ప్రతీ ఒక్కరినీ ఆకట్టుకుంది. అందులో అలనాటి తార.. దివి నుంచి దిగి వచ్చిన సుందరిగా కనిపించిన శ్రేదేవి నటన ఓ అద్భుతమనే చెప్పాలి. అయితే ఆమె కూతురు జాన్వీ కపూర్ ఇప్పుడు బాలీవుడ్‏లో టాప్ హీరోయిన్లలో ఒకరుగా నిలిచారు.

ఆమె చేసింది తక్కువ సినిమలే అయినా.. తన అందం.. అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. మొదటి సినిమాతోనే తన టాలెంట్ ను నిరూపించుకుంది. దీంతో ఆమెకు అభిమానులు క్యూ కట్టారు. ఇలా ఆమె సోషల్ మీడియా అకౌంట్లకు కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. ప్రస్తుతం ఆమె రెస్ట్ లేకుండా.. వరుస సినిమాలతో బిజీ బిజీగా మారారు.

అయితే అమె గత కొన్ని రోజుల నుంచి టాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వబోతుందనే వార్తలు వస్తున్నాయి. గతంలో కూడా ఆమె తెలుగులో కృష్ణ వంశీ దర్శకత్వంలో ఓ సినిమా మరియు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా తీయబోతున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. కానీ ఎలాంటి అప్ డేట్ రాలేదు. తాజాగా మరో వార్త వినిపిస్తోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన.. కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా రాబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది.

ఇక.. ఎన్టీఆర్ 30 వ సినిమాకు ముందుగా హీరోయిన్ గా శ్రీలీలను అనుకోగా.. మళ్లీ ఇప్పుడు జాన్వీ కపూర్ ను అనుకుంటున్నారట. దీంతోనే టాలీవుడ్ లో జాన్వీ ఎంట్రీ ఇస్తుందనే వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే జాన్వీతో సంప్రదింపులు కూడా జరుగుతున్నాయట. ఈ సినిమాకు సంబంధించిన విషయాలను త్వరలోనే ప్రకటించనున్నారు. అధికారికంగా మాత్రం వెల్లడి కాలేదు.