సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత తమ అభిమాన హీరో, హీరోయిన్లకు చాలామంది దగ్గర అవుతున్నారు. తమ వ్యక్తిగత వివరాలను పంచుకోవడం.. కామెంట్లో అభిమానులు తమ స్పందనను తెలియజేయడం చూస్తున్నాం. అయితే ఇటువంటి సందర్భాల్లో ఒకానొక సమయంలో ఆ ట్వీట్ లు వివాదానికి కూడా దారి తీస్తాయి.
సెలబ్రిటీలు చేసే ఆ చిన్న పొరపాటు కారణంగా అది పెద్ద సంచలనంగా మారడంతో పాటు.. తీవ్ర గొడవకు దారి తీస్తుంది. ప్రముఖ నిర్మాత, కమెడియన్ బండ్ల గణేష్ విషయంలో అలానే జరిగింది. బండ్ల గణేష్ సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటారన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే అతడు ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు పప్పులో కాలేశాడు. దానిలో పరోక్షంగా అనిల్ రావిపుడిపై విమర్శించాడు. ఆ ట్వీట్ చూసిన నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
కావాలనే చేశాడా.. అర్థం చేసుకుకోకుండా చేశాడా అనే సందేహంలో ఉన్నారు నెటిజన్లు.. ఏదేమైనా ఆ ట్వీట్ పై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఈ రోజు అనిల్ రావిపుడి పుట్టినరోజు సందర్భంగా అతడు ఆయనకు శుభాకంక్షలు తెలిపాడు. ఆ ట్వీట్ చూసిన ఓ నెటిజన్ ఇలా ట్వీట్ చేశాడు. పవన్ కళ్యాణ్ తో అనిల్ రావిపుడి చిత్రం ఉంటుందో.. ఉండదో.. పీకేతో మూవీ తీయొద్దు అన్ని చెప్పు అన్నా.. అంటూ ట్వీట్ చేశాడు.
దానికి బండ్ల గణేష్ ఇలా ట్వీట్ చేశాడు. మీ ప్రేమకు ధన్యవాదాలు అని అతను చెప్పాడు. నిజంగానే బండ్ల గణేష్ కు అనిల్ తో పవన్ కళ్యాణ్ సినిమా తీయడం ఇష్టం లేదనే సెన్స్ లో ఆ ట్వీట్ ఉంది. దీంతో నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. ఆ ట్వీట్ గందరగోళంగా మారింది. ఇదిలా ఉండగా దీనిపై సినీ వర్గాల్లో చర్చ మొదలైంది.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…