కైకాల సత్యనారాయణ ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఇతను తెలుగు సిని ఇండస్ట్రీలో నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరుచుకున్నారు.ఆయన దాదాపు 700 సినిమాలకు పైగా నటించాడు.నటుడిగా అతను పౌరాణిక, సాంఘిక, చారిత్రక, జానపద పాత్రలు చేసారు. దాదాపుగా ఆరు దశాబ్దాల నటనా జీవితంలో ఎన్నో గొప్ప గొప్ప సినిమాల్లో నటించారు.
అంతేకాకుండా ఏడాదికి పదికి పైగా చిత్రాలు చేసేవారు. వీటిలో ఎక్కువగా ఆయన విలన్ పాత్రలో చేసిన సినిమాలే ఉన్నాయి. ఎన్టీఆర్, ఏఎన్నార్ ల నుంచి బాలకృష్ణ,నాగార్జున, చిరంజీవిల సినిమాలలో విలన్ పాత్రలో నటించారు. యుక్త వయసులో ఉన్న కైకాల సత్యనారాయణకు, అమ్మాయిలను మోసం చేయడం, మానభంగాలకు పాల్పడడం, హింసించడం లాంటివి పాత్రలు ఎక్కువగా దక్కేవి. దీనితో ఆ పాత్రలో లీనమై ఆ పాత్రలలో విలనిజం పండించేవారు.
దీంతో అప్పట్లో ఆయనకు సొసైటీలో పూర్తిగా నెగిటివ్ ఇమేజ్ ఉండేది. మరీ ముఖ్యంగా అంటే ఆడవాళ్ళు కైకాల సత్యనారాయణ అంటే మండిపడే వారు. ఒకసారి ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న కైకాల సత్యనారాయణ పై ఆడవారు మాటల దాడి చేశారట. ఎందుకయ్యా ఆడవాళ్ళ జీవితాలతో ఆడుకుంటారని ఒక మహిళ నిలదీసిందట. ఈ విషయాలన్నీ కూడా కైకాల ఒక ఇంటర్వ్యూ లో పంచుకున్నారు.
ఇక ఆ రోజుల్లో ఈయన ఎక్కువగా మహిళలపై అత్యాచార పాత్రలో నటించడం వల్ల ఈయనను రేపుల నారాయణ అని కూడా పిలిచే వారట. సినిమాలో జరిగే దానిని నిజంగా భావించి అమాయకత్వం ప్రజలు, హీరో హీరోయిన్ లను అమితంగా ప్రేమించేవారు. కానీ విలన్ పాత్రలు చేసే నటులపై మాత్రం కోపం పెంచుకునేవారు. ప్రేక్షకులకు అంతలా కోపానికి గురి చేసి అంతా సహజమైన నటన నటించేవారు కైకాల సత్యనారాయణ. ఆ తర్వాత వయసు మీద పడటంతో విలన్స్ పాత్రలు తగ్గించి క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా ఎన్నో సినిమాల్లో నటించారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…