Tag Archives: key decision

Bigg Boss: పల్లవి ప్రశాంత్ అరెస్ట్… షాకింగ్ డెసిషన్ తీసుకున్న బిగ్ బాస్ నిర్వాహకులు?

Bigg Boss : బుల్లితెర రియాలిటీ షోగా ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్నటువంటి కార్యక్రమాలలో బిగ్ బాస్ కార్యక్రమం ఒకటి. ఈ షో అన్ని భాషల్లో ప్రసారమవుతున్న సంగతి తెలిసినదే. ఇక ఈ షో తెలుగులో 7 సీజన్లను పూర్తి చేసుకుంది. ఏడవ సీజన్లో భాగంగా కామన్ మ్యాన్ పల్లవి ప్రశాంత్ గెలుపొందిన విషయం అందరికీ తెలిసిందే.

ఇక ఈ సీజన్ గ్రాండ్ ఫినాలేరోజు పెద్ద ఎత్తున పల్లవి ప్రశాంత్ అభిమానులు అమర్ అభిమానుల మధ్య గొడవ చోటుచేసుకున్న సంగతి తెలిసిందే.ఈ గొడవలో భాగంగా పల్లవి ప్రశాంత్ అభిమానులు అమర్ ఫ్యామిలీతో ప్రయాణిస్తున్నటువంటి కారుపై రాళ్ల దాడి చేశారు. దీంతో ఇది కాస్త పెద్ద ఎత్తున వివాదంగా మారింది. ఇలా ఈ విషయం వివాదంగా మారటమే కాకుండా పల్లవి ప్రశాంత్ జైలుకు కూడా వెళ్లి బెయిల్ మీద బయటకు వచ్చారు.

ఇక ఈ అల్లర్లకు పాల్పడినటువంటి వారిని సిసి కెమెరాలు ఆధారంగా పోలీసులు గుర్తించి వారిపై కేసులను నమోదు చేస్తున్నారు. ఇలా ఈ సీజన్ ఈ స్థాయిలో గొడవలకు కారణం కావడంతో బిగ్ బాస్ నిర్వాహకులు ఈ కార్యక్రమం పట్ల షాకింగ్ డెసిషన్ తీసుకున్నారని తెలుస్తోంది. ఈ కార్యక్రమంలో పాల్గొని కంటెస్టెంట్లు బయటకు వచ్చే సమయంలో పెద్ద ఎత్తున ర్యాలీలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

ర్యాలీలు నిర్వహించకూడదు…

ఇలా ఇకపై ర్యాలీలు చేయకుండా వారిని కంటెస్టెంట్లుగా ఎంపిక చేసుకునే సమయంలోనే అగ్రిమెంట్ చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారట కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయిన తర్వాత అన్నపూర్ణ స్టూడియో పరిసర ప్రాంతాలలో ఎవరు కూడా ర్యాలీ చేయకూడదని వారు హౌస్ లోకి వచ్చేటప్పుడు ఎలా గుట్టు చప్పుడు కాకుండా వస్తారో బయటకు వెళ్లేటప్పుడు కూడా అలాగే వెళ్లాలి అంటూ నిబంధనలను పెట్టబోతున్నారని తెలుస్తోంది.

మరణించిన ఉద్యోగుల ఈ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న మోడీ సర్కార్?

దేశవ్యాప్తంగా కేంద్ర ఉద్యోగుల పట్ల మోడీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో పని చేసే ఏ ఉద్యోగి అయినా మరణించిన వెంటనే వారి కుటుంబ సభ్యుల ఇబ్బందులను తీర్చే విధంగా అడుగులు వేస్తోంది. విధులు నిర్వహిస్తూ ఉద్యోగి మరణించిన కేవలం నెలల వ్యవధిలోనే ఆ ఉద్యోగి కుటుంబానికి పెన్షన్ చెల్లించాలని నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకుంది.

ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి చనిపోతే వారి కుటుంబం నుంచి వచ్చిన క్లెయిమ్ వెంటనే నెల వ్యవధిలో గా ఆ కుటుంబానికి పెన్షన్ అందేలా చర్యలు తీసుకోవాలని వివిధ శాఖలకు ఆదేశాలను జారీ చేసింది.పాత పెన్షన్‌ పథకం, జాతీయ పెన్షన్‌ కింద ఉండి మరణించిన ప్రభుత్వ ఉద్యోగికి అందాల్సిన మొత్తాన్ని ఆ కుటుంబానికి అందించాలని తెలిపింది.

ఈ క్రమంలోనే ఉద్యోగి చెల్లించిన మొత్తాన్ని ఎన్‌పీఎస్‌ పెన్షన్‌ కార్పస్ ను కుటుంబ సభ్యులకు వెంటనే అందించడమే కాకుండా పెన్షన్ ఇవ్వడం ప్రారంభిస్తున్న సమయంలోనే ఉద్యోగి శాశ్వత పదవీ విరమణ ఖాతా సంఖ్యను మూసివేయాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే 2020 జనవరి 1 నుంచి మరణించిన ప్రభుత్వ ఉద్యోగుల వివరాలు, వారి కుటుంబ సభ్యుల పింఛన్ జారీ, ఇతర వివరాలను నెలవారీగా పంపించాలని ఆదేశాలు జారీ చేసింది.