Tag Archives: Kidneys

కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారా.. అయితే ఈ ఆహార పదర్ధాలను తినాల్సిందే!

ప్రస్తుత జీవన గమణంలో పని మీద పెట్టిన దృష్టి ఆరోగ్యంపై ఏ మాత్రం పెట్టలేకపోతున్నారు. దీంతో వివిధ రకాల వ్యాధులతో బాధపడుతున్నారు. ఈ వ్యాధుల్లో కిడ్నీలకు సంబంధించి వ్యాధుల్లో ఎక్కువగా బాధపడుతున్నారు. ఇది మానవ శరీరంలోని టాక్సిన్ అన్నింటిని బయటికి పంపే పనిని నిర్వహిస్తాయి.

శరీరంలో ప్రతీ అవయవం ఆరోగ్యంగా ఉంటేనే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. లేదంటే.. అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అయితే కిడ్నీని ఆరోగ్యంగా ఉంచాలంటే.. తీసుకోవాల్సిన ఆహార పదర్థాలు ఇవే.. అందులో వెల్లుల్లి ముఖ్యమైనది.. దీనిలో పాస్పరస్, పొటాషియం, సోడియం లాంటివి తగిన పరిమాణంలో ఉంటాయి.

ఇవి మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉండటానికి ఎక్కువగా సహాయపడతాయి. రెండోది క్యాప్సికమ్.. క్యాప్సికమ్ అంటే కూడా కొంతమందికి ఇష్టం ఉంటుంది.. మరి కొంతమందికి ఇష్టం ఉండదు. దీనిలో విటమిన్ సి ఎక్కువగా లభిస్తుంది. ఇది కూడా ముత్రపిండాలు ఆరోగ్యంగా ఉండటానికి ఉపయోగపడతాయి.చేపలు కూడా కిడ్నీలకు మేలు చేస్తాయి.

ఇక ప్రతీ ఒక్కరు ఇష్టపడే యాపిల్ కూడా మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉండటానికి ఉపయోగపడతాయి. దీనిలో పెక్టిన్ అనే ఫైబర్ ఉంటుంది. ఇది కిడ్నీలకు ఎక్కువగా మేలు చేస్తుంది. ఇక చివరగా క్యాబేజీ ఒకటి. దీనిలో ఫైటోకెమికల్స్, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇది కిడ్నీలు ఆరోగ్యంగా ఉండేందుకు ఉపయోగపడతాయి.

ఉప్పును ఎక్కువగా తీసుకుంటున్నారా.. అయితే ఈ రోగాలు వచ్చే అవకాశం..

ఉప్పును ఎక్కువగా తినకూడదని అందరికీ తెలిసిందే. దీని వల్ల ఎక్కువగా అనారోగ్యాల బారిన పడతారు. అసలు వీటి వల్ల వచ్చే రోగాలు ఏంటో తెలుసుకుందాం.. కూరల్లో తగినంత ఉప్పు వేసుకొని తింటే.. ఆరోగ్యం మంచిగానే ఉంటుంది. కానీ అది మోతాదు కంటే మించితే మాత్రం ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా గుండెకు సంబంధించిన వ్యాధులతో పాటు.. మూత్రపిండాల వ్యాధుల వరకు వ్యాధులు సోకుతాయి.

అయితే రోజుకు ఉప్పును 5 గ్రాముల కంటే ఎక్కువగా తినకూడదు. ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తం పరిమాణం పెరిగి రక్త పోటు ఎక్కువ అవుతుంది. అదే విధంగా ఉప్పులో ఉండే సోడియం శరీరానికి చాలా అవసరం కానీ ఎక్కువ మోతాదులో తీసుకోకూడదు. శరీరంలో సోడియం లెవెల్స్ ఎక్కువగా ఉంటే రాత్రి పూట అస్సలు నిద్ర పట్టదు కాబట్టి ఈ విషయాన్ని ప్రతీ ఒక్కరూ గమనించాలి. మూత్ర సమస్యలు రావడానికి కారణం కూడా ఉప్పును ఎక్కువగా తీసుకోవడమే. ఈ సమస్య ఎక్కువగా మహిళలు.. వయసు పై బడిన వారి లో ఉంటుంది.

అలానే ఉప్పు తీసుకోవడం వల్ల సోడియం రక్తంలో కలిసి నీటి ఉత్పత్తి పెరిగి పోతుంది. దీని ఫలితంగా రక్తం పరిమాణం పెరిగే దీనితో మూత్రం ఎక్కువగా వస్తుంది. కాబట్టి అధిక మోతాదులో దీనిని తీసుకోవడం మంచిది కాదు. రోజుకి ఐదు గ్రాముల కంటే ఉప్పు తీసుకోకూడదు. కానీ మన భారత దేశంలో రోజుకు 11 గ్రాములు ఉప్పు తీసుకుంటున్నట్లు సమాచారం. మూత్రపిండాలపై అధిక భారం పడితే అది గుండెపై కూడా ప్రభావం చూపతిస్తుంది.

అధిక సోడియంను కరిగించడానికి మూత్ర పిండాలు మూత్ర విసర్జన సమస్య, రక్తంలో అధిక సోడియం వల్ల ధమనుల ఒత్తిడిని పెరుగుతుంది. ఇలా ధమనులు గట్టి పడడానికి దారి తీస్తుంది అలానే హృదయ సంబంధిత సమస్యలు, అధిక రక్తపోటు, హార్ట్ స్ట్రోక్, మూత్ర పిండాల వ్యాధులు వంటి సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి ఉప్పును సాధ్యమైనంత తగ్గించి తినడం చాలా మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు.

కిడ్నీ బాగుండాలంటే ఈ ఆహారాన్ని తీసుకోండి!

మనం ఆరోగ్యంగా ఉండాలంటే మన శరీరంలోని ప్రతి అవయవం సరైన క్రమంలో పనిచేస్తున్నప్పుడే మనం ఎంతో ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందగలము. ఈ క్రమంలోనే మన శరీరంలో గుండె ఊపిరితిత్తులతో పాటు కిడ్నీలను కూడా ఎంతో జాగ్రత్తగా కాపాడుకోవాలి. కిడ్నీలు సరైన క్రమంలో పని చేసినప్పుడే మనం ఎంతో ఆరోగ్యవంతంగా ఉండగలను.అయితే కిడ్నీల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే కొన్ని ఆహార పదార్థాలను తప్పనిసరిగా తీసుకోవాలి. కిడ్నీలు పూర్తిగా పాడు అయ్యేవరకు మనకి ఎలాంటి లక్షణాలూ కనబడవు. కనుక అలాంటి సమస్య తలెత్తకుండా ముందే మనం జాగ్రత్త పడి మన కిడ్నీలను పరిరక్షించుకోవాలి. కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచడానికి ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం…

*కిడ్నీ ఆరోగ్యానికి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ కలిగినటువంటి కొవ్వు చేపలు తినడం వల్ల కిడ్నీల ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చు. ఈ చేపల్లో కొవ్వు లతోపాటు ప్రొటీన్లు పుష్కలంగా లభిస్తాయి.

*తాజా పండ్లు, కూరగాయలు, పండ్ల రసాలను అధికంగా తీసుకోవడం వల్ల మన కిడ్నీలలో ఏర్పడిన వ్యర్థాలను బయటకు పంపి కిడ్నీ ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి.

*యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభించేటటువంటి బెర్రీలు అధికంగా తీసుకోవాలి. అదేవిధంగా ఫైబర్ యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా లభించే యాపిల్ పండ్లను తినడం వల్ల మలబద్దక సమస్య తొలగిపోయి కిడ్నీలు ఆరోగ్యవంతంగా ఉంటాయి.

*కిడ్నీ ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడానికి ఎరుపు రంగులో ఉండే క్యాప్సికమ్ ఎంతో దోహదపడుతుంది. ఈ రెడ్ క్యాప్సికమ్ లో పొటాషియం తక్కువగా ఉండి విటమిన్ ఏ,విటమిన్ C, విటమిన్ B6, ఫోలిక్ యాసిడ్, ఫైబర్‌లు రెడ్ క్యాప్సికమ్‌లో లభించి కిడ్నీ ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి.

అతి మూత్ర సమస్య ఉందా.. అయితే ఇలా చెయ్యండి!

మన శరీరంలో ఉండే వివిధ అవయవాలు వివిధ పనులను నిర్వహిస్తుంటాయి. ఈ క్రమంలోనే మూత్రపిండాలు నిరంతరం రక్తాన్ని శుద్ధి చేస్తూ వడపోస్తుంటాయి. ఈవిధంగా వడపోత కార్యక్రమంలో విడుదలయ్యే వ్యర్థ పదార్థాలను మూత్రాశయం నిల్వ ఉంచుకుని ఉంటుంది. సాధారణంగా మన మూత్రశయం 300 నుంచి 600 మిల్లీలీటర్ల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ విధంగా మూత్రాశయం నిండిన తరువాత నాడుల ద్వారా ఈ సమాచారం మన మెదడుకు చేరవేసి మనకు టాయిలెట్ వెళ్లాలనే సమాచారాన్ని పంపిస్తుంది. ఇది నిరంతరం జరిగే ప్రక్రియ.

ఈ విధంగా ప్రతి రోజు సుమారుగా ఎనిమిది సార్లు మనం మూత్రాశయానికి వెళితే మనలో ఎటువంటి సమస్య లేదని అర్థం. కానీ కొందరు తరచూ మూత్రాశయానికి వెళుతూ ఉంటారు. ఈ విధంగా మూత్రాశయాన్నికి తరచూ వెళ్లడం వల్ల వారిలో పలు సమస్యలు తలెత్తుతున్నాయని చెప్పవచ్చు. ఈ విధంగా తరచు మూత్రాశయం రావడానికి గల కారణం మూత్రాశయంలో ఇన్ఫెక్షన్ కావడం, అధిక శరీర బరువు పెరగడం, అదే విధంగా ఎక్కువ సంతానం కలిగినవారిలో మూత్రాశయ కండరాలు బలహీనపడటం వల్ల తరచూ మూత్రానికి వెళుతూ ఉంటారు.

ఈ విధంగా అతిమూత్ర సమస్య ఉన్నవారు తరచూ టాయిలెట్ కి వెళ్లడం, కొందరిలో మూత్రాశయం లీక్ అవ్వడం, అలాగే కొందరు దగ్గినా,తుమ్మినా, అతిగా నవ్విన వారిలో మూత్రాశయం లీక్ అవడం వంటి సమస్యలు తలెత్తుతుంటాయి. ఈ విధమైన సమస్యలు కలిగి ఉన్నవారికి సర్జరీ చేయడం ద్వారా ఈ సమస్య నుంచి కొంత ఉపశమనం పొందవచ్చు. అదే విధంగా ఈ సమస్య నుంచి కొంతవరకు ఉపశమనం పొందాలంటే కొన్ని చిట్కాలను పాటించడం ద్వారా ఈ సమస్యనుంచి ఉపశమనం పొందవచ్చు.

ఎక్కువ మూత్రాశయం వెళ్లేవారు రాత్రి సమయంలో వీలైనంత వరకు ద్రవ పదార్థాలను దూరంగా పెట్టడం ఎంతో ఉత్తమం.ఈ విధమైనటువంటి సమస్యతో బాధపడేవారు రాత్రిపూట పాలు మజ్జిగ లేదా ఏవైనా పండ్లు రసాలను తీసుకోకపోవటం వల్ల కొంతవరకు ఈ సమస్య నుంచి విముక్తి పొందవచ్చు. ముఖ్యంగా మన శరీర బరువును తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి. అధిక శరీర బరువు కారణంగా మూత్రాశయం పై అధిక ఒత్తిడి పడటం వల్ల ఈ సమస్య తలెత్తుతుంది. ధూమపానం మద్యపానానికి దూరంగా ఉండటం మంచిది.అదే విధంగా అధిక ఫైబర్ కలిగిన ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల ఈ మూత్రాశయ సమస్యల నుంచి విముక్తి పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.

పరగడుపున నీటిని తాగటం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

 

మానవ శరీరంలోని అవయవాలు సరైన క్రమంలో పని చేయాలంటే తప్పకుండా నీరు అవసరమవుతుంది. మన శరీరానికి నీరు ఎంతో అవసరం.రోజుకు తగినంత మోతాదులో నీటిని తీసుకోవటం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయనే విషయం మనకు తెలిసిందే. అధికంగా నీటిని తీసుకోవడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు కలగడంతో పాటు చర్మ సమస్యలు కూడా తొలగిపోతాయని చెబుతారు. అయితే నిద్రలేవగానే నీటిని తాగటం వల్ల మరిన్ని ప్రయోజనాలను పొందవచ్చు.

ఉదయం నిద్రలేవగానే నీటిని తాగటం వల్ల రోజంతా ఎంతో ఉత్సాహంగా, చురుకుగా ఉంటారు. అదేవిధంగా పరగడుపున నీటిని తీసుకోవటం ద్వారా మన ప్రేగులలో ఏర్పడిన మలినాలన్నీ బయటకు విసర్జించడం ద్వారా ప్రేగులు శుభ్రం అవుతాయి. అదేవిధంగా జీర్ణక్రియ పనితీరు మెరుగుపడటమే కాకుండా, మలబద్ధక సమస్యను నివారిస్తుంది. పరగడుపున మనం తీసుకునే నీరు మన శరీరంలో జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది.

మనలో చాలామంది ఆకలి లేమి సమస్యతో బాధపడుతుంటారు. ఈ విధమైన సమస్యతో బాధపడేవారు ప్రతిరోజూ ఉదయం నీటిని తాగటం వల్ల పేగులలో ఉన్న వ్యర్థాలు బయటకు తొలగిపోయి ఆకలిని పెంచుతాయి. అదేవిధంగా మన శరీరంలో రోగనిరోధక శక్తిని కూడా పెంపొందిస్తాయి. ప్రతిరోజు కనీసం నాలుగు బాటిల్ ల నీటిని త్రాగటం వల్ల శరీరం పొడిబారకుండా, మన చర్మానికి కావాల్సిన తేమను అందిస్తుంది. అదేవిధంగా మూత్రపిండాలలో ఏర్పడినటువంటి ఇన్ఫెక్షన్, రాళ్లను కూడా బయటకు పంపుతుంది.కనుక వీలైనంత వరకు ఉదయం నిద్రలేవగానే నీటిని త్రాగటం వల్ల ఈ ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.

చనిపోయి ఐదుగురి ప్రాణాలు కాపాడిన చిన్నారి.. ఎలా అంటే..?

ఆ పాప వయస్సు కేవలం 20 నెలలు. ఊహ కూడా ఆ పాపకు తెలిసీ తెలియని వయస్సు. ఇంత చిన్న వయస్సులో ఆ పాప ఏకంగా ఐదుగురి ప్రాణాలను కాపాడింది. పాప ఈ లోకానికి దూరమైనా ప్రాణదాతగా నిలిచి ఐదుగురి ప్రాణాలు నిలపడం గమనార్హం. పూర్తి వివరాల్లోకి వెళితే ఢిల్లీలోని రోహిణి ఏరియాకు చెందిన ధ‌నిష్తా అనే చిన్నారి వయస్సు కేవలం 20 నెలలు. ఈ నెల 8వ తేదీన ధ‌నిష్తా ఆడుకుంటూ బాల్కనీ నుంచి కింద పడింది.

పాప బాల్కనీ నుంచి పడినట్టు గుర్తించిన తల్లిదండ్రులు వెంటనే అప్రమత్తమై సమీపంలో ఉన్న గంగారామ్ ఆస్పత్రికి పాపను తీసుకెళ్లారు. అయితే వైద్యులు పరీక్షలు చేసి పాప బ్రెయిన్ డెడ్ అయినట్టు గుర్తించారు. 11వ తేదీన పాప పరిస్థితి విషమించడంతో పాటు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. విషయం తెలిసిన ధ‌నిష్తా తల్లిదండ్రులు చిన్నారి ప్రాణాలు కోల్పోయినా అశిశ్ కుమార్ అవయవాలను దానం చేయడం ద్వారా అవయవాలు అవసరం ఉన్నవాళ్ల ప్రాణాలను కాపాడాలని నిర్ణయం తీసుకున్నారు.

చిన్నారి తల్లిదండ్రులు బబితా, అశిష్ కుమార్ ఒకవైపు బాధను దిగమింగుకుంటూ వైద్యులకు చిన్నారి అవయవాలను దానం చేయాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. వైద్యులు పాప శరీర అవయవాల ద్వారా ఏకంగా ఐదుగురి ప్రాణాలను కాపాడారు. పాప కిడ్నీలు, గుండె, కాలేయం, కార్నియాలను దానం చేసినట్లు సమాచారం. పాప తండ్రి చిన్నారి అవయవాలను దానం చేయడం గురించి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.

పాప తండ్రి అశిశ్ కుమార్ మాట్లాడుతూ తమ పాప చనిపోయినా ఐదుగురిలో బ్రతికే ఉందని వెల్లడించారు. అవయవాల కోసం చూస్తున్న కొందరిని తాము కలిసిన సమయంలో అవయవదానం చేయాలనిపించిందని అశిశ్ కుమార్ చెప్పారు.