మనం ఆరోగ్యంగా ఉండాలంటే మన శరీరంలోని ప్రతి అవయవం సరైన క్రమంలో పనిచేస్తున్నప్పుడే మనం ఎంతో ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందగలము. ఈ క్రమంలోనే మన శరీరంలో గుండె ఊపిరితిత్తులతో పాటు కిడ్నీలను కూడా ఎంతో జాగ్రత్తగా కాపాడుకోవాలి. కిడ్నీలు సరైన క్రమంలో పని చేసినప్పుడే మనం ఎంతో ఆరోగ్యవంతంగా ఉండగలను.అయితే కిడ్నీల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే కొన్ని ఆహార పదార్థాలను తప్పనిసరిగా తీసుకోవాలి. కిడ్నీలు పూర్తిగా పాడు అయ్యేవరకు మనకి ఎలాంటి లక్షణాలూ కనబడవు. కనుక అలాంటి సమస్య తలెత్తకుండా ముందే మనం జాగ్రత్త పడి మన కిడ్నీలను పరిరక్షించుకోవాలి. కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచడానికి ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం…
*కిడ్నీ ఆరోగ్యానికి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ కలిగినటువంటి కొవ్వు చేపలు తినడం వల్ల కిడ్నీల ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చు. ఈ చేపల్లో కొవ్వు లతోపాటు ప్రొటీన్లు పుష్కలంగా లభిస్తాయి.
*తాజా పండ్లు, కూరగాయలు, పండ్ల రసాలను అధికంగా తీసుకోవడం వల్ల మన కిడ్నీలలో ఏర్పడిన వ్యర్థాలను బయటకు పంపి కిడ్నీ ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి.
*యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభించేటటువంటి బెర్రీలు అధికంగా తీసుకోవాలి. అదేవిధంగా ఫైబర్ యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా లభించే యాపిల్ పండ్లను తినడం వల్ల మలబద్దక సమస్య తొలగిపోయి కిడ్నీలు ఆరోగ్యవంతంగా ఉంటాయి.
*కిడ్నీ ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడానికి ఎరుపు రంగులో ఉండే క్యాప్సికమ్ ఎంతో దోహదపడుతుంది. ఈ రెడ్ క్యాప్సికమ్ లో పొటాషియం తక్కువగా ఉండి విటమిన్ ఏ,విటమిన్ C, విటమిన్ B6, ఫోలిక్ యాసిడ్, ఫైబర్‌లు రెడ్ క్యాప్సికమ్‌లో లభించి కిడ్నీ ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి.
తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన ఏడాది వయసున్న చిన్నారి ఆర్యాన్ష్ ప్రస్తుతం అరుదైన జన్యుపరమైన వ్యాధితో పోరాడుతున్నాడు. చిన్న వయసులోనే…
బెంగళూరులో మూడు నెలల క్రితం చోటుచేసుకున్న ఆరేళ్ల చిన్నారి వెన్నెల మృతి కేసు తాజాగా సంచలన మలుపు తిరిగింది. మొదట…
ఇటీవలి కాలంలో ఆహార భద్రతపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా కూరగాయలు, పండ్లలో రసాయనాల వినియోగంపై తరచూ వార్తలు వెలువడుతుండటంతో…
హైదరాబాద్ నగరంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లు అనారోగ్యానికి గురై చికిత్స…
ప్రపంచ వాతావరణ పరిస్థితులపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న…
తెలుగు బుల్లితెరపై ప్రసారమైన ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ’ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన పండు మాస్టర్, తన డ్యాన్స్…