Tag Archives: Lata Mangeshkar

Latha Mangeshkar: లతా మంగేష్కర్ భౌతికదేహంపై షారుఖ్ ఖాన్ ఉమ్ము వివాదం..! కొంచమైనా బుద్దుందా అంటూ నటి ఫైర్ ..!

Latha Mangeshkar: షారుఖ్ ఖాన్ ఈ మధ్య ఏం చేసినా వివాదం అవుతోంది. వరసగా ఫ్లాప్ సినిమాలతో గత వైభవాన్ని కోల్పోయాడు. మరోవైపు సల్మాన్, ఆమీర్ ఖాన్, అక్షయ్ కుమార్ లు వరసగా ప్రయోగాలు చేస్తూ.. హిట్లు కొడుతున్నారు.

Latha Mangeshkar: లతా మంగేష్కర్ భౌతికదేహంపై షారుఖ్ ఖాన్ ఉమ్ము వివాదం..! కొంచమైనా బుద్దుందా అంటూ నటి ఫైర్ ..!

2013లో విడుదలైన చెన్నై ఎక్స్ ప్రెస్ సినిమాతో చివరి సారిగా హిట్ కొట్టాడు బాలీవుడ్ బాద్షా. 9 ఏళ్లుగా వరసగా ఫ్లాపులే పలకరిస్తున్నాయి. మరోవైపు ఇదిలా ఉంటే ఇటీవల డ్రగ్స్ కేసులో షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ దొరకడం.. అతన్ని అరెస్ట్ చేసి కొన్ని రోజుల పాటు రిమాండ్ లో ఉంచడం తెలిసిందే.

Latha Mangeshkar: లతా మంగేష్కర్ భౌతికదేహంపై షారుఖ్ ఖాన్ ఉమ్ము వివాదం..! కొంచమైనా బుద్దుందా అంటూ నటి ఫైర్ ..!

ఈ వివాదంతో మరింతగా కుంగిపోయాడు. మీడియాకు ముఖం కూడా చూపట్టలేని పరిస్థితి ఎదురైంది. దీంతో పాటే దేశంలో ఓ సెక్షన్ ఆఫ్ పీపుల్ షారుఖ్ ఖాన్ ను విపరీతంగా ట్రోల్ చేస్తోంది. నీచమైన కామెంట్లు పెడుతున్నారు. డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్ దోషి అని తేలకముందే… పని గట్టుకుని ఆ ఫ్యామిలీపై విష ప్రచారం కూడా చేశారు. 

తాజాగా ఈ ఘటనపై నటి ఊర్మిళ ఫైర్..

ఇదిలా ఉంటే తాజాగా మరో వివాదంలో ఇరుక్కున్నాడు షారుఖ్ ఖాన్. ఇటీవల గాన కోకిల లతామంగేష్కర్ మరణించిన సంగతి. ఆమె అంత్యక్రియలకు షారుఖ్ ఖాన్ హాజరయ్యారు. అయితే ఆమెకు శ్రద్ధాంజలి ఘటించే సందర్భంలో మాస్క్ తీసి గాలి ఊదాడు షారుఖ్ ఖాన్. ఇక ఇది పట్టుకుని సోషల్ మీడియాలో మళ్లీ ట్రోలింగ్ మొదలయ్యాయి. షారుఖ్, లతామంగేష్కర్ పార్థీవ శరీరం వద్ద ఉమ్మివేశారని సిగ్గు లేదా అంటూ నెటిజెన్లు కామెంట్లు పెట్టారు. తాజాగా ఈ ఘటనపై నటి ఊర్మిళ ఫైర్ అయ్యారు. ముస్లిం సంప్రదాయాల ప్రకారం చనిపోయిన తర్వాత వ్యక్తి వద్ద నోటి నుంచి గాలి ఊదుతారు. ఇది తెలియని నెటిజెన్లు విమర్శిస్తున్నారంటూ..  ప్రార్ధనను కూడా ఉమ్మువేయడం అనుకునే సమాజంలో మనం బ్రతుకుతున్నామని ఆమె మండిపడ్డారు.

Latha Mangeshkar: గాన కోకిల మూగబోయింది..! ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచిన లతామంగేష్కర్..!

Latha Mangeshkar: ప్రఖ్యాత సినీ నేపథ్య గాయని, భారతరత్న లతా మంగేష్కర్ కన్నుమూశారు. ముంబై బ్రీచ్‌ క్యాండీ ఆస్పత్రిలో ఈ ఉదయం 8గం.12ని. తుదిశ్వాస విడిచారు. గత 29రోజులుగా ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.

Latha Mangeshkar: గాన కోకిల మూగబోయింది..! ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచిన లతామంగేష్కర్..!

గత నెల 8వ తేదీన కరోనాతో ఆమె ఆస్పత్రిలో చేరగా.. కరోనా నుంచి తర్వాత ఆమె కోలుకున్నారు. అయినా కొన్నాళ్ల వరకు వెంటిలేటర్ పై చికిత్స అందించారు. ఆమె కోలుకున్నట్లు వైద్యులు ప్రకటించిన విషయం కూడా తెలిసిందే.

Latha Mangeshkar: గాన కోకిల మూగబోయింది..! ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచిన లతామంగేష్కర్..!

అయితే తర్వాత ఆమెకు మళ్లీ అస్వస్థతకు గురి కాగా.. మళ్లీ వెంటిలేటర్‌ మీదే చికిత్స అందించారు. ఇలా ఆమె ఈ రోజు ఉదయం తుది శ్వాస విడిచారు. ఇక ఆమె మరణం పట్ల ఎంతో మంది సినీ ప్రముఖులు, గాయకులు, రాజకీయ నాయకులు సంతాపం తెలిపారు. దీనిలో భాగంగా.. టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ కూడా ట్విట్టర్ వేదికగా తన సంతాపం ప్రకటించారు.


ప్లేబ్యాక్ సింగర్‌గా అరంగేట్రం..

భారతదేశ సినీ సంగీత రంగానికి దశాబ్దాల పాటు ఎన్నో అద్భుతమైన పాటలు అందించిన లతా మంగేష్కర్ మరణం తీరని లోటు అని అన్నారు. ప్రముఖ గాయినిగా 980 సినిమాలకు, 20 భాషలలో 50 వేలకు పైగా పాటలు పాడి తన గానంతో సంగీత ప్రియుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారామె. లతా 1940లలో బాలీవుడ్‌లోకి కాలుమోపారు. మొదట్లోనే ఎన్నో అవమానాలు. వాయిస్ బాగాలేదని తిరస్కరించిన సందర్భాలు కూడా ఉన్నాయి. 1942లో లతకు తొలిసారిగా మంగళగౌర్ చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. లత 1942లో మరాఠీ చిత్రం ‘కితీ హాసిల్’ లో ప్లేబ్యాక్ సింగర్‌గా అరంగేట్రం చేసింది. తెలుగులో 1955 లో ఏఎన్నార్‌ ‘సంతానం’ కోసం నిదుర పోరా తమ్ముడా..అనే పాటతో అరంగేట్రం చేశారు. అతి తక్కువకాలంలోనే తన ప్రతిభతో ఉన్న శిఖరాల్ని అధిరోహించారు.

Lata Mangeshkar: లతా మంగేష్కర్ కు కరోనా పాజిటివ్.. ఐసీయూలో చికిత్స..!

Lata Mangeshkar: భారత్ లో కరోనా కేసులు సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. కొన్ని రోజుల వరకు కేవలం 10 వేల లోపు ఉన్న కరోనా కేసులు ప్రస్తుతం లక్షల్లో నమోదవుతున్నాయి. దీనితో పాటే.. ఒమిక్రాన్ కేసులు కూడా పెరిగిపోతున్నాయి. దీంతో దేశంలోని ప్రతీ రాష్ట్రం అప్రపమత్తమయ్యాయి.

Lata Mangeshkar: లతా మంగేష్కర్ కు కరోనా.. ఐసీయూలో చికిత్స..!

దీనిలో భాగంగానే నైట్ కర్ప్యూ, లాక్ డౌన్ లు లాంటివి పెడుతున్నారు. మరికొన్ని రాష్ట్రాలు వీకెండ్ లాక్ డౌన్లను కూడా విధిస్తున్నాయి. ఇదిలా ఉండగా.. తాజాగా సెలెబ్రిటీలు కూడా కరోనా బారిన పడుతున్నారు. ఇటీవల కమల్ హాసన్, మహేష్ బాబు, మంచు లక్ష్మీ, మంచు మనోజ్, విక్రమ్, సత్యారాజ్, డైరెక్టర్ ప్రియదర్శన్, సంగీత దర్శకుడు థమన్, త్రిషకు కూడా కరోనా బారిన పడ్డారు. అందులో కొంతమంది కోలుకున్నారు. మరికొంత మంది ఇంట్లోనే హోం క్వారంటైనల్ లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు.

Lata Mangeshkar: లతా మంగేష్కర్ కు కరోనా.. ఐసీయూలో చికిత్స..!

ఇలా కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాపిస్తోంది. తాజాగా దిగ్గజ గాయని లతా మంగేష్కర్​ కూడా కరోనా బారినపడ్డారు. లతా మంగేష్కర్ మేనకోడలు రచన ఈ విషయాన్ని వెల్లడించారు. ఆమెకు స్వల్ప లక్షణాలతో కోవిడ్ పాజిటివ్ గా రిపోర్ట్ వచ్చింది.


Lata Mangeshkar : ఆందోళనలో అభిమానులు..

ప్రస్తుతం ఆమెను ఆస్పత్రిలో చేర్చగా.. ఆమె ముంబైలోని బ్రీచ్ కాండీ హాస్పిటల్‌లో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. అయితే ఆమె ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని.. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు తెలిపారు. ఇక ఆమె రెండు సంవత్సరాల క్రితం వైరల్ చెస్ట్ కంజెస్టిన్ కారణంగా ఆసుపత్రిలో చేరారు. ఆమె అక్కడ చికిత్స తీసుకొని కోలుకున్నారు. ఆమె వయస్సు, ఆరోగ్యం దృష్ట్యా డాక్టర్స్ ఆమెను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలోనే లతా మంగేష్కర్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఆమె త్వరగా కోలుకోవాలని ఆమె అభిమానులు ప్రార్థిస్తున్నారు. ప్రతీ ఒక్కరు మాస్క్ లు ధరించాలని.. థర్డ్ వేవ్ ముంచుకొస్తున్న వేళ.. అనవసరంగా బయటకు రావొద్దని.. భౌతిక దూరం పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు.