Featured

Lata Mangeshkar: లతా మంగేష్కర్ కు కరోనా పాజిటివ్.. ఐసీయూలో చికిత్స..!

Lata Mangeshkar: భారత్ లో కరోనా కేసులు సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. కొన్ని రోజుల వరకు కేవలం 10 వేల లోపు ఉన్న కరోనా కేసులు ప్రస్తుతం లక్షల్లో నమోదవుతున్నాయి. దీనితో పాటే.. ఒమిక్రాన్ కేసులు కూడా పెరిగిపోతున్నాయి. దీంతో దేశంలోని ప్రతీ రాష్ట్రం అప్రపమత్తమయ్యాయి.

Lata Mangeshkar: లతా మంగేష్కర్ కు కరోనా.. ఐసీయూలో చికిత్స..!

దీనిలో భాగంగానే నైట్ కర్ప్యూ, లాక్ డౌన్ లు లాంటివి పెడుతున్నారు. మరికొన్ని రాష్ట్రాలు వీకెండ్ లాక్ డౌన్లను కూడా విధిస్తున్నాయి. ఇదిలా ఉండగా.. తాజాగా సెలెబ్రిటీలు కూడా కరోనా బారిన పడుతున్నారు. ఇటీవల కమల్ హాసన్, మహేష్ బాబు, మంచు లక్ష్మీ, మంచు మనోజ్, విక్రమ్, సత్యారాజ్, డైరెక్టర్ ప్రియదర్శన్, సంగీత దర్శకుడు థమన్, త్రిషకు కూడా కరోనా బారిన పడ్డారు. అందులో కొంతమంది కోలుకున్నారు. మరికొంత మంది ఇంట్లోనే హోం క్వారంటైనల్ లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు.

Lata Mangeshkar: లతా మంగేష్కర్ కు కరోనా.. ఐసీయూలో చికిత్స..!

ఇలా కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాపిస్తోంది. తాజాగా దిగ్గజ గాయని లతా మంగేష్కర్​ కూడా కరోనా బారినపడ్డారు. లతా మంగేష్కర్ మేనకోడలు రచన ఈ విషయాన్ని వెల్లడించారు. ఆమెకు స్వల్ప లక్షణాలతో కోవిడ్ పాజిటివ్ గా రిపోర్ట్ వచ్చింది.


Lata Mangeshkar : ఆందోళనలో అభిమానులు..

ప్రస్తుతం ఆమెను ఆస్పత్రిలో చేర్చగా.. ఆమె ముంబైలోని బ్రీచ్ కాండీ హాస్పిటల్‌లో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. అయితే ఆమె ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని.. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు తెలిపారు. ఇక ఆమె రెండు సంవత్సరాల క్రితం వైరల్ చెస్ట్ కంజెస్టిన్ కారణంగా ఆసుపత్రిలో చేరారు. ఆమె అక్కడ చికిత్స తీసుకొని కోలుకున్నారు. ఆమె వయస్సు, ఆరోగ్యం దృష్ట్యా డాక్టర్స్ ఆమెను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలోనే లతా మంగేష్కర్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఆమె త్వరగా కోలుకోవాలని ఆమె అభిమానులు ప్రార్థిస్తున్నారు. ప్రతీ ఒక్కరు మాస్క్ లు ధరించాలని.. థర్డ్ వేవ్ ముంచుకొస్తున్న వేళ.. అనవసరంగా బయటకు రావొద్దని.. భౌతిక దూరం పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago