Samantha: ఇలా ధైర్యంగా ఉన్నానంటే కారణం వాళ్లే.. ఎవరూ పర్‌ఫెక్ట్ కాదంటున్న సమంత..!
Samantha: గత సంవత్సరం అక్టోబర్ 2న సమంత, నాగచైతన్య విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి వారిద్దరు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నారు. ఏదో ఒక టాపిక్ తో ముందుంటున్నారు. అయితే ఇవన్నీ పట్టించుకోకుండా.. ఎవరి పనుల్లో వాళ్లు బిజీగా గడుపుతున్నారు.
అయితే సమంత మాత్రం వరుస సినిమాలతో ఫుల్ బిజీ అయిపోయారు. అంతే కాదు.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ.. ప్రతీ రోజు ఏదో ఒక అప్ డేట్ ఇస్తూ.. తన అభిమానులతో టచ్ లో ఉంటున్నారు. తాజాగా సమంత రుత్ ప్రభు.. రోషిణి ట్రస్ట్, దాట్ల ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహించిన సైక్రియాటరి ఎట్ యువర్ డోర్‌స్టెప్ అనే కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో ఆమె జీవితంలో గడ్డు కాలాన్ని ఎలా ఎదుర్కొన్నారో చెప్పారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎంతో బలంగా ఉంది. ఇటువంటి సమాజంలో పరిస్థితులను ఎదుర్కొవడం అంటే ఎంతో కష్టం. జీవితంలో ఎవరూ పరఫెక్ట్ కాదు.. కానీ సోషల్ మీడియాలో మాత్రం పర్ఫెక్ట్ గా ఉండాల్సిన ఒత్తిడి ఏర్పడుతుందన్నారు.
అందుకోసం మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని సమంత అన్నారు. మానసికంగా ధృడంగా ఉంటే.. ఒత్తిడితో కూడిన జీవితాన్ని ముందుకు తీసుకెళ్లొచ్చని పేర్కొన్నారు. ప్రతీ రోజు ఒత్తిడి పెరుగుతోంది.. అలాంటి ప్రపంచంలో మనం బతుకుతున్నాం అంటూ చెప్పుకొచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో మన బలహీనతల గురించి మాట్లాడటం చాలా కష్టంగా మారుతుందని చెప్పారు. బాధలు, ఆందోళనల గురించి మాట్లాడాలంటే.. ఎంతో ఫోకస్ ఉండాలన్నారు. ఇక ఆమె జీవితంలో గ్లామర్, మెరుపులతో పాటు.. బాధలు, కష్టాలు ఉన్నాయని.. వాటిని ఎన్నో ఎదుర్కోవాల్సి వచ్చిందన్నారు. జీవితంలో ఒంటరిగా ఎద్కుర్కోలేని సమస్యలు వచ్చినప్పుడు కుంగిపోకూడదన్నారు. నా జీవితం అతిపెద్ద ప్రశ్నగా మారినప్పుడు నా స్నేహితుల సహాయాన్ని తీసుకున్నానని… వారి నుంచి సలహాలు, సూచనలు తీసుకొని ఉపశమనం పొందానన్నారు. అందుకే ఇప్పుడు మీ ముందు ధైర్యంగా కూర్చోగలిగాను అంటూ చెప్పింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…