RGV: అధికార పార్టీ ఎమ్మెల్యేపై ఆర్జీవీ ఆగ్రహం.. ఇలాంటి ఇడియట్స్ వల్లనే..!
RGV: టాలీవుడ్, ఏపీ ప్రభుత్వాల మధ్య టికెట్ల యుద్ధం జరుగుతూనే ఉంది. ఇప్పటికే నాని, సిద్ధార్థ్ వంటి హీరోలు ప్రభుత్వంపై నేరుగా కామెంట్లు చేశారు. శ్యామ్ సింగరాయ్ సినిమాకు ముందు నాని చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి.
నాని… సినిమా థియేటర్ల కలెక్షన్లు, కిరాణా కొట్టు కలెక్షన్ల కన్నా తక్కువగా ఉన్నాయనే వ్యాఖ్యలు వివాదాన్ని రాజేశాయి. దీంతో ఏపీ మంత్రి పేర్ని నాని కూడా తనదైన శైలిలో హీరో నాని వ్యాఖ్యలను తిప్పికొట్టారు.
ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆర్జీవి, ఏపీ ప్రభుత్వం పై మండిపడుతున్నారు. టికెట్ల రేట్ల తగ్గింపు అంచంపై ఇప్పటికే ట్విట్టర్ ద్వారా ఏపీ ప్రభుత్వానికి ప్రశ్నలు సంధించారు.
దీనికి సమాధానంగా పేర్ని నాని కూడా ట్విట్టర్ వేదికగా సమాధానాలు ఇచ్చారు. వీరిద్దరి మధ్య ట్విట్టర్ వేదికగా యుద్దమే నడిచింది. ఇదిలా తాజాగా నిన్న ఆర్జీవీ, మంత్రి పేర్నినానితో సమావేశం అయ్యారు. టికెట్ రేట్ల తగ్గింపు అంశంపై చర్చించారు. టికెట్ రేట్లను తగ్గిస్తే సినిమా క్వాలిటీ కూడా తగ్గుతుందని రామ్ గోపాల్ వర్మ, మంత్రికి వివరించారు. పేదవాడికి అందుబాటులో ఉండేం దుకు ధరలు తగ్గించినట్లు చెప్పుకొచ్చారు. సినిమా వ్యయాన్ని మీరే తగ్గించుకోవాలన్నట్లు మంత్రి సలహా ఇచ్చారు.
ఇదిలా ఉంటే వైసీపీ ఎమ్మెల్యే చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు మరోసారి టాలీవుడ్, ఏపీ ప్రభుత్వాల మధ్య ఉద్రిక్తతలు పెంచాయి. వైసీపీ ఎమ్మెల్యే నన్నపురెడ్డి ప్రసన్నకుమార్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సినిమావాళ్లు బలిసి కొట్టుకుంటున్నారంటూ.. వ్యాఖ్యలు చేశారు. కోట్లు సంపాదించుకుని .. పేదలకు సినిమాను దూరం చేస్తున్నారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాక్యలపై రామ్ గోపాల్ వర్మ ఫైర్ అయ్యారు. వైఎస్ జగన్ అంటే తనకు ఎంతో అభిమానం ఉందని, ప్రసన్నకుమార్ రెడ్డి లాంటి ఇడియట్స్ వల్లే ఆయనకు చెడ్డ పేరు వస్తుందని తెలిపారు. ఇలాంటి వాళ్లను జగన్ దూరం పెట్టాలంటూ హితవు పలికారు. సినిమా గురించి ఏమి తెలియకుండా అవాకులు చెవాకులుపేలే వాళ్లనుమూర్ఖులే అంటామని.. ఆర్జీవీ తనదైన శైలిలో స్ట్రాంగ్ గా రిప్లే ఇచ్చారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…