Lata Mangeshkar: భారత్ లో కరోనా కేసులు సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. కొన్ని రోజుల వరకు కేవలం 10 వేల లోపు ఉన్న కరోనా కేసులు ప్రస్తుతం లక్షల్లో నమోదవుతున్నాయి. దీనితో పాటే.. ఒమిక్రాన్ కేసులు కూడా పెరిగిపోతున్నాయి. దీంతో దేశంలోని ప్రతీ రాష్ట్రం అప్రపమత్తమయ్యాయి.

దీనిలో భాగంగానే నైట్ కర్ప్యూ, లాక్ డౌన్ లు లాంటివి పెడుతున్నారు. మరికొన్ని రాష్ట్రాలు వీకెండ్ లాక్ డౌన్లను కూడా విధిస్తున్నాయి. ఇదిలా ఉండగా.. తాజాగా సెలెబ్రిటీలు కూడా కరోనా బారిన పడుతున్నారు. ఇటీవల కమల్ హాసన్, మహేష్ బాబు, మంచు లక్ష్మీ, మంచు మనోజ్, విక్రమ్, సత్యారాజ్, డైరెక్టర్ ప్రియదర్శన్, సంగీత దర్శకుడు థమన్, త్రిషకు కూడా కరోనా బారిన పడ్డారు. అందులో కొంతమంది కోలుకున్నారు. మరికొంత మంది ఇంట్లోనే హోం క్వారంటైనల్ లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు.

ఇలా కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాపిస్తోంది. తాజాగా దిగ్గజ గాయని లతా మంగేష్కర్ కూడా కరోనా బారినపడ్డారు. లతా మంగేష్కర్ మేనకోడలు రచన ఈ విషయాన్ని వెల్లడించారు. ఆమెకు స్వల్ప లక్షణాలతో కోవిడ్ పాజిటివ్ గా రిపోర్ట్ వచ్చింది.
Lata Mangeshkar : ఆందోళనలో అభిమానులు..
ప్రస్తుతం ఆమెను ఆస్పత్రిలో చేర్చగా.. ఆమె ముంబైలోని బ్రీచ్ కాండీ హాస్పిటల్‌లో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. అయితే ఆమె ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని.. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు తెలిపారు. ఇక ఆమె రెండు సంవత్సరాల క్రితం వైరల్ చెస్ట్ కంజెస్టిన్ కారణంగా ఆసుపత్రిలో చేరారు. ఆమె అక్కడ చికిత్స తీసుకొని కోలుకున్నారు. ఆమె వయస్సు, ఆరోగ్యం దృష్ట్యా డాక్టర్స్ ఆమెను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలోనే లతా మంగేష్కర్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఆమె త్వరగా కోలుకోవాలని ఆమె అభిమానులు ప్రార్థిస్తున్నారు. ప్రతీ ఒక్కరు మాస్క్ లు ధరించాలని.. థర్డ్ వేవ్ ముంచుకొస్తున్న వేళ.. అనవసరంగా బయటకు రావొద్దని.. భౌతిక దూరం పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు.































