Tag Archives: london

Mahesh Babu -Namrata: ఫ్యామిలీతో కలిసి లండన్ లో ఎంజాయ్ చేస్తున్న మహేష్ బాబు దంపతులు… ఫోటోలు వైరల్!

Mahesh Babu -Namrata: మహేష్ బాబుకు ఏ మాత్రం ఖాళీ దొరికిన వెంటనే తన ఫ్యామిలీతో కలిసి వెకేషన్ వెళ్తూ ఉంటారనే సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఈయన తాజాగా మరోసారి తన భార్య పిల్లలతో కలిసి లండన్ వెకేషన్ వెళ్లారు. ఈ క్రమంలోనే లండన్ వెకేషన్ కి సంబంధించిన కొన్ని ఫోటోలను నమ్రత సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.అయితే ఇందులో మహేష్ పిల్లలు కనిపించలేదు కానీ మహేష్ బాబు ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ మాత్రం ఉన్నారు.

ఇక వెకేషన్ కి సంబంధించిన ఫోటోలను నమ్రత సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఇందులో నమ్రత చెల్లెలు కూడా ఉండడం విశేషం. ఇలా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో కలిసి వీరంతా ఫుడ్ తింటూ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ ఫోటోలను షేర్ చేసిన నమ్రత పుడ్ తింటూ ఎన్నో విషయాల గురించి మాట్లాడుకుంటూ తమ బాండింగ్ మరింత స్ట్రాంగ్ చేసుకున్నట్లు తెలిపారు.

ఇలా నమ్రత షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో మహేష్ ఫ్యాన్స్ ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ఫోటోలలో మహేష్ బాబు కాస్త డిఫరెంట్ లుక్ లో ఉన్నారు. అలాగే ఈయన చాలా యంగ్ గా కనిపిస్తూ ఉండడంతో ఫాన్స్ ఈ ఫోటోలను వైరల్ చేస్తున్నారు.

Mahesh Babu -Namrata: సరికొత్త లుక్ లో మహేష్..


ఇక మహేష్ బాబు సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఈయన త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకేక్కుతున్న గుంటూరు కారం సినిమా షూటింగ్లో పాల్గొన్న విషయం మనకు తెలిసిందే. అయితే ఈ షూటింగ్ ప్రస్తుతం జరుగుతున్నప్పటికీ మహేష్ బాబు పై చిత్రీకరించాల్సిన సన్నివేశాలు లేకపోవడంతో మహేష్ వెకేషన్ ప్లాన్ చేశారు.ఈ సినిమా తర్వాత రాజమౌళి దర్శకత్వంలో రాబోయే సినిమా షూటింగ్ పనులలో బిజీ అవుతారు.

Samantha: ఈ ఫేక్ యాక్సెంట్ అవసరమా సమంత… భారీగా ట్రోల్ చేస్తున్న నెటిజన్స్!

Samantha: అనారోగ్యం నుండి కోలుకున్న తర్వాత సమంత వరుస షూటింగ్లలో పాల్గొంటూ బిజీగా ఉంది. ఇటీవల సమంత నటించిన శాకుంతలం సినిమా విడుదలై అంచనాలను అందుకోలేక అందరిని నిరాశపరిచింది. ప్రస్తుతం సీటాడెల్ ప్రమోషన్ పనులతో సమంతా బిజీగా ఉంది. సీటాడెల్ వెబ్ సిరీస్ ఏప్రిల్ 28వ తేదీ విడుదల కాబోతోంది. ఈ క్రమంలో ప్రమోషన్ లో భాగంగా లండన్ లో ప్రీమియర్ షో నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో సమంత చాలా స్టైలిష్ గా సరికొత్త లుక్ లో కనిపించారు. బ్లాక్ డ్రెస్, ఖరీదైన డైమండ్ జువెలరీతో చాలా స్టైలిష్ లుక్ లో కనిపించింది.
అయితే ఈ వేడుకలో సమంత స్పీచ్ గురించి అనేక విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ వెబ్ సీరీస్ లో భాగం కావటంతో సమంత చాలా ఎక్సైట్డ్ గా ఉంది. ఈ క్రమంలో తాను మాట్లాడిన తీరులో చాలా మార్పు కనిపించింది.

విదేశాలకు వెళ్ళగానే యాస మార్చింది. ఈ ఫేక్ యాక్సెంట్ అవసమా? అంటూ సమంత మాట్లాడిన వీడియోని షేర్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు. అయితే కొంతమంది అభిమానులు ఈ విషయంలో ఆమెను వెనకేసుకొస్తున్నారు. ఇదిలా ఉండగా ఇప్పటికే సమంతా గురించి అనేక విమర్శలు వినిపిస్తున్నాయి.
శాకుంతలం సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సమంత తన అనారోగ్యం గురించి చెబుతూ కన్నీళ్లు పెట్టుకుంది.

Samantha: సింపతి కార్డు ప్లే చేసిన సామ్…

తన ఆరోగ్యం సహకరించకపోయినా శాకుంతలం మీద ఉన్న ఇష్టంతో ప్రమోషన్స్ లో పాల్గొన్నట్లు తెలిపింది. ఈ క్రమంలో కొంతమంది ఆమె తీరుని తప్పు పడుతూ.. కేలవం సినిమా సక్సెస్ చేయటానికి సమంత ఇలా సింపతీ కార్డు ప్లే చేస్తోంది అంటూ విమర్శలు చేశారు. అయితే కంటెంట్ లేకపోవటంతో సినిమాని ప్రేక్షకులు ఆదరించలేదు. అయితే శాకుంతలం సినిమా ప్రమోషన్స్ లో సమంత తెల్లటి రంగు దుస్తులు ధరించి చేతిలో జప మాలతో ఉన్న సమంత సీటాడెల్ ప్రమోషన్స్ కోసం దేశం దాటగానే రూపం మార్చింది అంటూ విమర్శలు చేస్తున్నారు.

Nagachaitanya -Sobhita Dhulipala: లండన్ రెస్టారెంట్ లో జంటగా కనిపించిన నాగచైతన్య శోభిత… ఫోటో వైరల్!

Nagachaitanya -Sobhita Dhulipala: అక్కినేని నాగచైతన్య గత కొద్ది రోజులుగా తన వ్యక్తిగత విషయాల వల్ల పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తున్నారు. సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత కొన్ని కారణాల వల్ల ఈయన సమంతకు విడాకులు ఇచ్చారు. ఇలా సమంత నుంచి విడిపోయిన నాగచైతన్య మరొక హీరోయిన్ తో డేటింగ్ లో ఉన్నారంటూ పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.

ఇలా నాగచైతన్య శోభిత ఇద్దరు కూడా విదేశాలలో కలిసి జంటగా కనిపించడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. అయితే గత ఏడాది వీరిద్దరూ కలిసి లండన్ వెకేషన్ వెళ్లారంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే అది గ్రాఫిక్స్ ఫోటో అంటూ కొందరు కొట్టి పారేశారు కానీ తాజాగా ఈ వెకేషన్ కి సంబంధించిన మరొక ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

లండన్ లోని రెస్టారెంట్ చెఫ్ సురేందర్ మోహన్ ఇంస్టాగ్రామ్ లోనాగచైతన్యతో కలిసి దిగిన ఫోటోని షేర్ చేశారు. అయితే ఈ ఫోటోలో వెనుక వైపు టేబుల్ దగ్గర నటి శోభిత కూర్చుని ఉన్నారు.ఇలా శోభిత ఈ ఫోటోలో కనిపించడంతో వీరిద్దరూ కలిసి డిన్నర్ కి వెళ్ళారని వీరిద్దరూ నిజంగానే డేటింగ్ లో ఉన్నారంటూ మరోసారి వీరి డేటింగ్ వార్తలు తెరపైకి వచ్చాయి.

Nagachaitanya -Sobhita Dhulipala: తెరపైకి డేటింగ్ రూమర్లు…


ఇక ఇదే విషయం గురించి నాగచైతన్యను లాల్ సింగ్ చద్దా సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో ప్రశ్నించగా ఈ ప్రశ్నకు నాగచైతన్య ఏ విధమైనటువంటి సమాధానం చెప్పకుండా కేవలం నవ్వుతూ ఈ ప్రశ్నను దాటవేశారు. ఇక నాగచైతన్య తాజాగా కొత్త ఇంటిని కూడా కొనుగోలు చేశారని తెలుస్తోంది. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకొని ఒకటి కాబోతున్నారని వార్తలు పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి.

Nirav Modi: డబ్బుల్లేక నెలకు 10 లక్షల అప్పు చేస్తున్నా… నీరవ్ మోడీ కామెంట్స్ వైరల్!

Nirav Modi: సాధారణంగా బ్యాంకులో రుణం తీసుకున్న తర్వాత దానిని తప్పకుండా తిరిగి చెల్లించాలి. లేదా బ్యాంకు వారు మన ఆస్తులను జప్తు చేసే అవకాశం ఉంటుంది . అయితే కొంతమంది వ్యాపారవేత్తలు మాత్రం వేల కోట్ల రూపాయలు బ్యాంకుల నుండి అప్పుగా తీసుకుని చిల్లిగవ్వ చెల్లించకుండా దేశం విడిచి పారిపోతున్నారు. ఇలా ఇప్పటికి ఎంతోమంది కోటీశ్వరులు తీసుకున్న అప్పులు చెల్లించలేక ఐపి పెట్టి దేశాలు వదిలి వెళ్ళిపోతున్నారు. అలాంటి వారిలో ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ కూడా ఒకరు.

బ్యాంకుల నుంచి కోట్ల రూపాయల అప్పు తీసుకుని ఎగవేసి, విదేశాలకు పారిపోయిన నీరవ్ మోడీ ఇప్పుడు తన దగ్గర చిల్లిగవ్వ కూడా లేక అప్పు చేస్తున్నానని చెబుతున్నాడు. ప్రముఖ వజ్రాల వ్యాపారి మోడీ గతంలో బ్యాంకుల నుండి వేల కోట్ల రూపాయలు అప్పుచేసి వాటిని తిరిగి చెల్లించకుండా విలాసవంతమైన జీవితాన్ని గడిపాడు. ఆ తర్వాత అప్పు చెల్లించలేక దేశం విడిచి పారిపోయాడు. అయితే ప్రస్తుతం అతడి దగ్గర చిల్లిగవ్వ లేదట.

ఇటీవల నీరవ్​ను ఇండియాకు అప్పగించే విచారణలో భాగంగా చట్టపరమైన ఖర్చులు చెల్లించాలని లండన్‌లోని హైకోర్టు ఆదేశించింది. అయితే ఈ చెల్లింపులకు సంబంధించి బర్కింగ్‌సైడ్ మేజిస్ట్రేట్ కోర్టు ముందు నీరవ్ మోడీ వర్చువల్‌గా హాజరయ్యాడు . కోర్టు ఆదేశించిన మొత్తాన్ని ఒకేసారి చెల్లించలేనని.. నెలకు 10 వేల పౌండ్ల చొప్పున కడతానని అర్జీ పెట్టుకున్నాడు.
అయితే ఆ 10 వేల పౌండ్లను ఎక్కడి నుంచి తెస్తావని న్యాయమూర్తి అడగ్గా.. ప్రస్తుతం తన దగ్గర డబ్బు లేదని, భారత ప్రభుత్వం తన ఆస్తులు అన్ని జప్తు చేయటం వల్ల కోర్టుకు చెల్లించాల్సిన మొత్తం కోసం అప్పు తీసుకుంటున్నట్లు నీరవ్ చెప్పాడని తెలుస్తోంది.

Nirav Modi: వేల కోట్లు మోసం చేసిన నీరవ్ …

పీఎన్‌బీని వేల కోట్ల రూపాయలు మోసగించిన కేసులో ఇండియాకు అప్పగించే విషయంలో గతేడాది నీరవ్ మోడీకి చుక్కెదురైంది. అతడ్ని భారత్‌కు అప్పగించేందుకు లండన్‌ హైకోర్టు అనుకూలంగా తీర్పును ఇచ్చింది. అలాగే ఈ తీర్పుపై యూకే సుప్రీం కోర్టులో అప్పీల్ చేసేందుకు నీరవ్‌కు కోర్టు నుంచి అనుమతి లభించలేదు. అయితే ఇండియాకు రాకుండా ఉండేందుకు ఆయనకు ఇంకా మార్గాలు ఉన్నట్లు తెలుస్తోంది.

ఆ ఎలుకలు చేసిన పనికి.. 2 వేల మంది ఇబ్బందికి గురయ్యారు.. ఎందుకంటే..?

కొంతమంది ఇళ్లల్లో ఎలుకలు ఎక్కువగా ఇబ్బంది కలిగిస్తాయి. వాటి వల్ల ఇబ్బంది పడే వారు కొందరు ఉంటే.. వాటిని కొన్ని ప్రయోగాలకు ఉపయోగించే వారు కూడా ఉన్నారు. వైద్య రంగంలో వాటిపై ప్రయోగాలు చేస్తుంటారు. ఎలుకలకు తినే వస్తువు ఏదైనా కనిపిస్తే వాటిని వదిలిపెట్టవు.

తాజాగా ఇక్కడ ఆ ఎలుకలు చేసిన పనికి దాదాపు 2 వేల మంది ఇంటర్ నెట్ కష్టాలను ఎదుర్కొంటున్నారు. ఈ ఘటన ఇంగ్లాండ్ లో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. ఇంగ్లాండ్ లోని టోరిడ్జ్‌, డేవాన్‌ ప్రాంతాలలో ఎలుకల బెడద కాస్త ఎక్కువే అని చెప్పాలి. అక్కడ అవి ఇంటర్ నెట్ కేబుళ్లను కొరికి పడేశాయి.

ఎక్కడ ఆ వైర్లు తెగి పడ్డాయో తెలియకుండా చేసేశాయి. దీంతో ఆ ప్రాంతంలోని మొత్తం దాదాపు 2 వేల మంది వైఫై సేవలను వినియోగించుకోలేక పోయారు. ఇలా అక్కడ బీటీ, ప్లస్‌నెట్‌,స్కై, వొడాఫోన్‌ సేవలు అర్థాంతరంగా నిలిచిపోయాయి. దాదాపు ఏడు గంటల పాటు ఇలా వైఫై సేవలకు అంతరాయం కలిగింది.

దీనిపై స్థానికంగా ఓ ప్రభుత్వ అధికారి స్పందించారు. ఫిర్యాదు వచ్చిన దగ్గర నుంచి తమ ఇంజనీర్లు ఎక్కువగా సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నాడు. మునుపటి స్థితికి రావడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలిపాడు.

ప్రియుడితో డేట్ కు వెళ్లిన యువతి.. హోటల్ లో జరిగిన ఘటనతో ఆమె ఏం చేసిందో తెలుసా..?

అక్కడ ఒక్క చికెన్ ముక్కకు రూ.3 వేలు వసూలు చేశారు. అవును మీరు విన్నది నిజమే.. సరదాగా తన ప్రేమికుడితో డేట్ కు వెళ్లిన ఓ యువతి.. ఆ హోటల్ లోనే విందు చేయడానికి కూర్చున్నారు. అక్కడ వాళ్లు ఆర్డర్ చేసిన ఐటెంకు రూ.3 వేల బిల్లు వేసి ఆశ్చర్యానికి గురి చేశారు.

పూర్తి వివరాల్లోకి వెళ్లితే.. లండన్ కు చెందిన రవీన్ అనే యువతి.. తన ప్రియుడితో కలిసి ది షార్డ్‌లోని రెస్టారెంట్‌లో డేటింగ్‌కు వెళ్ళింది. సరదాగా ముచ్చట్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేద్దామని ఆమె ఒక డిష్ ఆర్డర్ చేసింది. దానికి రూ.3 వేలు ఖర్చు అయింది.

అయితే దానిని తీసుకొని వచ్చిన తర్వాత ఆమె షాక్ కు గురైంది. అందులో కేవలం ఒక చికెన్ ముక్క, సాస్, ఓ బంగాళదుంప మాత్రమే ఉన్నాయి. ఇంగ్లాండ్ కరెన్సీలో 30 పౌండ్లు అంటే రూ.3 వేలు. అంత ఖర్చు పెట్టి ఆర్డర్ చేస్తే.. కనీసం చిన్న పిల్లలకు కూడా కడుపు నిండని ఐటెం తెస్తారా అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమె ఆర్డర్ పెట్టిన ఐటెంను ఫొటో తీసి.. ట్విట్టర్ లో పోస్ట్ చేసింది.

“గాయ్స్, నా 30 పౌండ్ల భోజనాన్ని చూడండి” అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఎంతో మధురంగా.. ఎన్నో సంవత్సరాల వరకు గుర్తుండిపోయేలా కాలక్షేపం చేయడానికి వస్తే.. ఇలా రెస్టారెండ్ నిర్వాహకులు తీవ్ర అసంతృప్తిని కలిగించారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఆమె చేసిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.

దొంగను పట్టించిన గూగుల్ యాప్… ఎలాగంటే?

కొన్నిసార్లు ఇతర ప్రాంతాలకు వెళ్లినప్పుడు అక్కడ భాష రాకపోవడంతో నానా అవస్థలు పడుతుంటారు. అలా భాష రాకపోవడంతో ఏకంగా పోలీసుల చేతిలో ఇద్దరు వ్యక్తులు అరెస్టయి ప్రస్తుతం జైల్లో ఊచలు లెక్క పెడుతున్నారు. ఈ అరుదైన సంఘటన ఇంగ్లాండ్ మహానగరంలోని లండన్ ప్రాంతంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు…

ఎప్పటిలాగే లండన్ లో పోలీస్ పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో పోలీస్ అధికారులకు ఒక కారు నుంచి పెద్ద మొత్తంలో గంజాయి వాసన రావడంతో అనుమానం వచ్చి ఆ కారును ఆపి తనిఖీ చేశారు. కారు మొత్తం వెతికినా ఎక్కడ వారికి గంజాయి కనిపించలేదు. కారులో ఎటువంటి గంజాయి లేకపోయినా వారిపై పోలీసులకు అనుమానం తీర లేదు. అయితే కారులో కూర్చుని ఉన్న ఇద్దరు వ్యక్తుల పై అనుమానం రావడంతో వారిని కూడా వెతికారు. వారి దగ్గర కూడా ఎలాంటి ఆనవాళ్లు దొరకకపోవడంతో పోలీసులు పొరపాటు పడ్డట్టే భావించారు.

ఆ సమయంలో పొరపాటు పడిన పోలీస్ అధికారులు వారికి ఇంగ్లీషులో క్షమాపణ చెప్పి, వారికి అనుమానం రావడానికి గల కారణాలు చెబుతున్న సమయంలో అసలు గుట్టు బయట పడింది.కారులో ఉన్న వ్యక్తులకు ఇంగ్లీషు రాకపోవడంతో పోలీసులు ఏం చెబుతున్నారో తెలుసుకోవడానికి తన ఫోన్ ఆన్ చేసి గూగుల్ ట్రాన్స్ లేషన్ యాప్ ను ఓపెన్ చేయడానికి ప్రయత్నిస్తున్న సమయంలో వారి ఫోన్ లో ఒక వీడియో ప్లే అయింది. దీంతో పోలీసులు ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. ఆ వీడియోలో ఆ ఇద్దరు వ్యక్తులు గంజాయి పెంచుతున్న తోట వీడియో ప్లే కావడంతో వాళ్ల దగ్గర నుంచి ఫోన్ లాక్కుని వారు నివాసం ఉంటున్న అపార్ట్ మెంట్ ను తనిఖీలు చేసి అక్కడ పెంచుతున్న 300 గంజాయి మొక్కలను సీజ్ చేసి వారిని అరెస్టు చేశారు.ఈ విధంగా గూగుల్ యాప్ ఆ దొంగలను పట్టించడంలో ఎంతో సహాయపడుతుందని చెప్పవచ్చు.